Twitter New Features : ట్విట్టర్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్లు.. మీ మెసేజ్‌లకు ఇక ఫుల్ ప్రొటెక్షన్.. ఎలన్ మస్క్ కూడా మీ మెసేజ్ చదవలేడు..!

Twitter New Features : ట్విట్టర్ యూజర్ల ప్రైవసీ, యూజర్ ఎక్స్‌పీరియన్స్ మరింత మెరుగుపరచేందుకు కొత్త ఫీచర్లు, అప్‌డేట్‌లను ప్రకటించింది. ఈ కొత్త అప్‌డేట్‌లలో ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లు, కాలింగ్ ఆప్షన్ వంటి ఫీచర్లుఅందుబాటులో ఉన్నాయి.

Twitter DMs to be encrypted so that even Elon Musk

Twitter New Features : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. యూజర్ల ప్రైవసీ కోసం ట్విట్టర్ అనేక కొత్త ప్రైవసీ ఫీచర్లను తీసుకొచ్చింది. అందులో ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్, ఇతర అప్‌డేట్‌లతో సహా కొత్త ఫీచర్లను ప్రకటించింది. ఇక నుంచి ట్విట్టర్ మెసేజ్‌లు మరింత సురక్షితమని చెప్పవచ్చు. సీఈఓ ఎలోన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని ట్విట్టర్ ప్లాట్ ఫారం తమ యూజర్ ఎక్స్ పీరియన్స్ మెరుగుపరచేందుకు వివిధ మార్పులతో టెస్టింగ్ చేస్తోంది. ఈ మార్పుల నేపథ్యంలో కొన్ని వివాదానికి దారితీశాయి. మరికొన్ని యూజర్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆండ్రాయిడ్, iOS యాప్‌ల కోసం మెరుగైన డైరెక్ట్ మెసేజింగ్ (DMs), ఎన్‌క్రిప్షన్ ఆప్షన్లను ట్విట్టర్ ప్రకటించింది.

రాబోయే రోజుల్లో ట్విట్టర్ తమ ప్లాట్‌ఫారమ్‌కు ఫోన్ కాల్‌లను యాడ్ చేసే పనిలో ఉన్నట్లు ట్విట్టర్ వెల్లడించింది. యాప్ లేటెస్ట్ వెర్షన్‌తో, మీరు థ్రెడ్‌లోని ఏదైనా మెసేజ్ (ఇటీవలి మాత్రమే కాదు) DM రిప్లయ్ ఇవ్వవచ్చు. ఏదైనా ఎమోజి రియాక్షన్ ఉపయోగించవచ్చు. ఎన్‌క్రిప్టెడ్ DM V1.0 రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ ఫీచర్ వేగంగా డెవలప్ అవుతోంది. ఈ క్రమంలోనే కంపెనీ సీఈఓ మస్క్ స్పందిస్తూ.. నా తలపై తుపాకీ పెట్టిన కూడా మీ DMలను చూడలేకపోయానని ట్వీట్ చేశాడు. త్వరలో మీ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఎవరికైనా వాయిస్ కాల్, వీడియో చాట్ చేసుకోవచ్చు. మీ ఫోన్ నంబర్‌ను ఇవ్వకుండానే ప్రపంచంలో ఎక్కడైనా యూజర్లతో మాట్లాడవచ్చునని అని ట్వీట్ తెలిపింది.

Read Also : Reliance Jio Plans : జియో యూజర్లకు అదిరే ఆఫర్.. ఈ రీఛార్జ్ ప్లాన్లపై 40GB వరకు ఫ్రీ డేటా.. ఇదిగో ఫుల్ లిస్టు.. మీకు నచ్చిన ప్లాన్ ఎంచుకోండి..!

ఇందులో విశేషమేమిటంటే, గత ఏడాదిలో ‘ట్విట్టర్ 2.0 ది ఎవ్రీథింగ్ యాప్’ కోసం ప్రణాళికలను ట్విట్టర్ ప్రకటించింది. ఈ యాప్ పేమెంట్లు, లాంగ్-ఫార్మ్ ట్వీట్లు, ఎన్‌క్రిప్టెడ్ డీఎంల వంటి ఫీచర్లను అందిస్తుందని అప్పుడే మస్క్ చెప్పారు. ఇప్పుడు ఈ ఫీచర్లు వచ్చే యాప్ అప్‌డేట్‌లలో ట్విట్టర్‌లోకి వస్తాయని సూచిస్తున్నాయి. ట్విట్టర్‌లోని ఈ కొత్త కాల్ ఫీచర్ ఇప్పటికే Meta (META.O) సోషల్ మీడియా యాప్‌లు, Facebook, Instagram ప్లాట్‌ఫారాల్లో అందుబాటులో ఉంది. ట్విట్టర్‌లో ఎన్‌క్రిప్టెడ్ డైరెక్ట్ మెసేజ్‌లు ఇకపై అందరికి అందుబాటులో ఉంటాయని మస్క్ ప్రకటించారు. అయితే, కాల్‌లు కూడా ఎన్‌క్రిప్ట్ చేయబడతాయో లేదో మస్క్ క్లారిటీ ఇవ్వలేదు.

Twitter New Features : Twitter DMs to be encrypted so that even Elon Musk

ట్విట్టర్‌లో వాయిస్, వీడియో కాల్స్ ఆప్షన్ :
ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌లో వాయిస్, వీడియో కాల్స్ చేసేందుకు యూజర్లను అనుమతించే కొత్త ఫీచర్‌ను డెవలప్ చేస్తోందని మస్క్ వెల్లడించారు. ఈ ఫీచర్ ఫేస్‌టైమ్ మాదిరిగానే ఉంటుందని, యూజర్లు తమ ఫోన్ నంబర్‌ను షేర్ చేయకుండానే ట్విట్టర్‌లో ఎవరికైనా కాల్ చేయొచ్చునని ఆయన తెలిపారు. ఇప్పటికే ట్విట్టర్ స్పేస్‌ల ద్వారా లైవ్ వాయిస్ చాట్‌ని అందిస్తోంది. అయినప్పటికీ, స్పేస్‌లు పబ్లిక్, గ్రూపు చాట్‌ల కోసమే రూపొందించింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ప్రైవేట్, పర్సనల్ కాల్‌లను చేసుకోవచ్చు.

ఇన్‌యాక్టివ్ అకౌంట్లను తొలగిస్తున్న ట్విట్టర్ :
అనేక ఏళ్లుగా ఉపయోగించని ఇన్‌యాక్టివ్ అకౌంట్లను డిలీట్ చేసేందుకు ట్విట్టర్ క్లీన్సింగ్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. యూజర్ నేమ్ ఎల్జిబిలిటీని పెంచేందుకు ఇన్ యాక్టివ్ అకౌంట్లను డిలీట్ చేస్తోంది. ట్విట్టర్ తొలగించిన అకౌంట్ల ట్వీట్లు, డేటాను కూడా ట్విట్టర్ ఆర్కైవ్ చేస్తుంది. తద్వారా వాటిని పరిశోధకులు, చరిత్రకారులు సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఇన్‌యాక్టివ్ అకౌంట్లను తొలగించే ముందు వాటి యజమానులకు తెలియజేస్తామని కంపెనీ తెలిపింది.

అలా చేయాలనుకుంటే వారి అకౌంట్లను మళ్లీ యాక్టివేట్ చేసుకునే అవకాశం కల్పిస్తామని పేర్కొంది. చాలా కాలంగా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న అకౌంట్లను ప్లాట్‌ఫారమ్ ‘ప్రక్షాళన’ చేస్తుందని మస్క్ ఇటీవల ట్వీట్‌లో ప్రకటించారు. తద్వారా మీ ఫాలోవర్ల సంఖ్య తగ్గడానికి కారణం కావచ్చు. ఏళ్ల తరబడిగా ఉన్న ఇన్‌యాక్టివ్ అకౌంట్లను డిలీట్ చేస్తున్నామని, మీ అకౌంట్లో ఫాలోవర్ల సంఖ్య తగ్గడాన్ని చూడవచ్చునని మస్క్ ట్వీట్‌లో తెలిపారు.

Read Also : TCL 4K QLED TV : కొత్త టీవీ కొంటున్నారా? టీసీఎల్ నుంచి కొత్త 4K QLED టీవీ ఇదిగో.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!