TCL 4K QLED TV : కొత్త టీవీ కొంటున్నారా? టీసీఎల్ నుంచి కొత్త 4K QLED టీవీ ఇదిగో.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

TCL 4K QLED TV : టీసీఎల్ కొత్త 4K QLED TV, C645ని రిలీజ్ చేసింది. ఈ టీవీ ధర రూ.40,990 నుంచి ప్రారంభమవుతుంది. ఎంటర్‌టైన్మెంట్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు TCL లేటెస్ట్ ఆఫర్ Google TV OSతో వస్తుంది.

TCL 4K QLED TV : కొత్త టీవీ కొంటున్నారా? టీసీఎల్ నుంచి కొత్త 4K QLED టీవీ ఇదిగో.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

TCL launches new 4K QLED TV C645, price starts at Rs 40,990

Updated On : May 10, 2023 / 7:42 PM IST

TCL 4K QLED TV : కొత్త టీవీ కోసం చూస్తున్నారా? టెలివిజన్ మార్కెట్‌లో పోటీ వాతావరణం నెలకొంది. ఎందుకంటే అనేక బ్రాండ్‌లు సరసమైన ధరలకు అత్యుత్తమ స్పెషిఫికేషన్లనతో టీవీలను అందిస్తున్నాయి. 4K OLED టీవీని సొంతం చేసుకోవాలంటే ఇదే సరైన సమయం.. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం TCL తమ టెలివిజన్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. ఇందులో భాగంగానే C645 మోడల్ ప్రారంభించింది. టీవీ వ్యూ విషయంలో కస్టమర్లకు అద్భుతమైన అనుభూతిని అందిస్తామని స్మార్ట్ టీవీ చెబుతోంది.

TCL ఇండియా CEO ఫిలిప్ జియా మాట్లాడుతూ.. C645 టీవీ మోడల్.. భారత మార్కెట్లో తమ QLED TV రేంజ్ ప్రీమియం టీవీగా పేర్కొన్నారు. ఈ కొత్త OLED టీవీ లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లతో వచ్చిందన్నారు. అద్భుతమైన వ్యూతో సరైన డెలివరీని అందిస్తుంది. కొత్త శకానికి నాంది పలికేందుకు భారత మార్కెట్లో 4K QLED ప్రొడక్టుతో ముందుకు వచ్చామని తెలిపారు. TCL లేటెస్ట్ ఆఫర్లు, ఫీచర్లు, ధర ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

టీసీఎల్ C645 4K TV ధర ఎంతంటే? :
TCL C645 టీవీ మోడల్ ధర రూ. 40,990 నుంచి ప్రారంభమవుతుంది. ఈ టీవీ నాలుగు వేర్వేరు డిస్ప్లే సైజుల్లో అందుబాటులో ఉంది. అందులో 65-అంగుళాల, 55-అంగుళాల, 50-అంగుళాలు, 43-అంగుళాలు వరుసగా ఉన్నాయి. రిలయన్స్ డిజిటల్ (Reliance Digital), క్రోమా (Croma) వంటి ఇ-కామర్స్ స్టోర్లలో కొనుగోలుకు ఈ టీసీఎల్ టీవీ అందుబాటులో ఉంది. ఆసక్తిగల వినియోగదారులు TCL ఆఫ్‌లైన్ స్టోర్‌లతో పాటు వెబ్‌సైట్‌ను విజిట్ చేసి కూడా టీవీని కొనుగోలు చేయొచ్చు. కూడా పొందవచ్చు.

Read Also : Maruti Suzuki Jimny : మారుతి సుజుకి జిమ్నీ SUV వచ్చేస్తోంది.. 24,500 బుకింగ్స్ దాటేసింది.. ఈ కారు ధర ఎంత ఉండొచ్చుంటే?

43-అంగుళాల TCL టీవీ ధర రూ. 40,990 కాగా, సెగ్మెంట్‌లోని అత్యంత ఖరీదైన టీవీ 65 అంగుళాలతో రూ. 79,990 ధరతో అందుబాటులో ఉంది. 55-అంగుళాల వేరియంట్ ధర రూ. 56,990, 50-అంగుళాల వేరియంట్ ధర రూ. 48,990 నుంచి అందుబాటులో ఉన్నాయి. అదనంగా, TCL ఈరోజు (మే 10) ప్రారంభమయ్యే ప్రీబుకింగ్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ మే 16 వరకు కొనసాగుతుంది.

TCL launches new 4K QLED TV C645, price starts at Rs 40,990

TCL launches new 4K QLED TV C645, price starts at Rs 40,990

ఈ ఆఫర్‌లో భాగంగా, కస్టమర్‌లు TCL QLED 4K స్మార్ట్ టీవీని కొనుగోలు చేసిన తర్వాత ఉచితంగా సౌండ్ బార్‌ (Sound Bar)ను కూడా గెలుచుకోవచ్చు. అయితే, ఈ ఆఫర్ రిలయన్స్ డిజిటల్, క్రోమాలో ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన మోడళ్లపై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీంతో పాటు, కొనుగోలుదారులు వివిధ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.

TCL C645 TV : టాప్ ఫీచర్లు ఇవే :
కొనుగోలుదారులకు ఎంటర్‌టైన్మెంట్ అందించడానికి TCL లేటెస్ట్ ఆఫర్ Google TV OSతో ప్రవేశపెట్టింది. యూజర్ల స్మార్ట్‌ఫోన్‌ల నుంచి TCL WI-Fi రెడీ డివైజ్‌లతో కనెక్ట్ కావొచ్చు. ఇతర అప్లియన్సెస్ కంట్రోల్ చేసేందుకు Google వాచ్‌లిస్ట్, Google ఫొటోలు, TCL హోమ్‌ను కూడా కలిగి ఉంటుంది. TV బెజిల్-లెస్ డిజైన్‌ను కలిగి ఉంది. హై-ఎండ్ డిస్‌ప్లేతో వస్తుంది. HDR10+ సపోర్ట్‌తో కూడా వస్తుంది.

లేటెస్ట్ టీవీ రేంజ్ ప్రవేశపెట్టిన TCS కంపెనీ గేమర్స్‌పై కూడా దృష్టి సారిస్తోంది. అందుకే C645 120Hz గేమ్ యాక్సిలరేటర్‌తో వస్తుంది. టీవీ ఆటో-అడ్జస్ట్‌మెంట్ ఫంక్షన్ అధిక రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. గేమర్‌లు తమకు ఇష్టమైన టైటిల్‌లను ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆస్వాదించవచ్చని కంపెనీ పేర్కొంది. TCL టీవీలో AMD FreeSync టెక్నాలజీ కూడా ఉంది. ఆర్టిఫాక్ట్-ఫ్రీ గేమ్‌ప్లే ఎక్స్ పీరియన్స్ కూడా అందిస్తుంది. ఈ C645 టీవీ వినియోగదారులకు స్ట్రీమింగ్, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ మరింత అందించేందుకు డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ కూడా కలిగి ఉంది.

Read Also : Reliance Jio Plans : జియో యూజర్లకు అదిరే ఆఫర్.. ఈ రీఛార్జ్ ప్లాన్లపై 40GB వరకు ఫ్రీ డేటా.. ఇదిగో ఫుల్ లిస్టు.. మీకు నచ్చిన ప్లాన్ ఎంచుకోండి..!