Maruti Suzuki Jimny : మారుతి సుజుకి జిమ్నీ SUV వచ్చేస్తోంది.. 24,500 బుకింగ్స్ దాటేసింది.. ఈ కారు ధర ఎంత ఉండొచ్చుంటే?

Maruti Suzuki Jimny : భారత మార్కెట్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న SUVలలో ఒకటి మారుతి సుజుకి జిమ్నీ. ఇప్పటివరకూ 24,500 బుకింగ్స్ నమోదు చేసింది.

Maruti Suzuki Jimny : మారుతి సుజుకి జిమ్నీ SUV వచ్చేస్తోంది.. 24,500 బుకింగ్స్ దాటేసింది.. ఈ కారు ధర ఎంత ఉండొచ్చుంటే?

Maruti Suzuki Jimny bookings at 24,500, Check Full Details

Maruti Suzuki Jimny : దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki India) నుంచి భారత మార్కెట్లోకి మారుతి సుజుకి జిమ్నీ (Maruti Suzuki Jimny) కారు వచ్చేస్తోంది. ఇదివరకే మార్కెట్లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) సబ్-4 మీటర్ల కాంపాక్ట్ SUVని లాంచ్ చేసింది. ఇప్పుడు ఐదు డోర్ల జిమ్నీ SUVని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. నివేదికల ప్రకారం.. ఇప్పటి వరకు మారుతి సుజుకి జిమ్నీ 24,500 బుకింగ్‌లను సంపాదించింది. భారత మార్కెట్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న SUVలలో ఇదొకటి. అయితే, మారుతి సుజుకి బ్రెజ్జా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, మారుతి సుజుకి ఫ్రాంక్స్ తర్వాత వచ్చిన SUV కార్ల మోడల్‌లలో జిమ్నీ నాల్గవ SUV మోడల్ కారుగా రానుంది.

మారుతి జిమ్నీ ధర (అంచనా) :
ఆర్థిక సంవత్సరం (FY24)లో భారత SUV విభాగంలో 25శాతం మార్కెట్ వాటాను మారుతి లక్ష్యంగా పెట్టుకుంది. Fronx, Jimny కార్లపైనే కంపెనీ ఆశలు పెట్టుకుంది. కంపెనీ SUV వాల్యూమ్‌లు FY23లో 2లక్షల 2వేల యూనిట్లుగా ఉన్నాయి. అంటే.. 12.07% మార్కెట్ వాటాను నమోదు చేసింది. ఇదే ఆర్థిక సంవత్సరంలో 1,673,000 యూనిట్ల SUV వాల్యూమ్‌లను నమోదు చేసింది. జిమ్నీ, ఫ్రాంక్స్ రెండూ ఆటో ఎక్స్‌పో 2023లో మారుతి సుజుకి ఆవిష్కరించింది.

Read Also : Google I/O 2023 : భారత్‌లో ఈరోజే గూగుల్ వార్షిక I/O 2023 ఈవెంట్.. ఏయే ప్రొడక్టులను లాంచ్ చేయొచ్చు? లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే?

రెండు SUVలు ఇగ్నిస్, బాలెనో, సియాజ్, XL6, గ్రాండ్ విటారాతో పాటు మారుతి Nexa డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్నాయి. మారుతి సుజుకి జిమ్నీ ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ప్రారంభంలో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. భారత్‌లో మారుతి సుజుకి జిమ్నీ ధర రూ. 11 లక్షల నుంచి రూ. 15 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా.

Maruti Suzuki Jimny bookings at 24,500, Check Full Details

Maruti Suzuki Jimny bookings at 24,500, Check Full Details

ఈ ఆఫ్-రోడర్ జిమ్నీ కారు K15B 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. 105PS గరిష్ట శక్తిని, 134Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇంజిన్‌ను 5-స్పీడ్ MT లేదా 4-స్పీడ్ ATతో చేయవచ్చు. ఫ్రేమ్ వీల్ ఆధారంగా SUV లో రేంజ్ ట్రాన్స్‌ఫర్ గేర్ (4L మోడ్)తో ALLGRIP PRO 4WD టెక్నాలజీని కలిగి ఉంది. నెక్సా మోడల్‌లు సాధారణంగా సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా వేరియంట్‌లలో రానుంది. సిగ్మా ఎంట్రీ-లెవల్, ఆల్ఫా టాప్-స్పెక్‌గా ఉంటుంది. జిమ్నీలో జీటా, ఆల్ఫా వేరియంట్‌లు మాత్రమే ఉన్నాయి.

మారుతి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO) CV రామన్ మాట్లాడుతూ.. జిమ్నీ ఫాలోయింగ్ ఉన్న బ్రాండ్ అని అన్నారు. Zeta, Alpha వేరియంట్‌లలో అన్ని ఫీచర్లు వినియోగదారులకు అవసరమని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతానికి జిమ్నీ మోడల్ 4WDతో రానుంది. మారుతి సమీప భవిష్యత్తులో జిమ్నీ 2WDని ప్రవేశపెట్టే ఆలోచనలో లేదని రామన్ పేర్కొన్నారు.

Read Also : Waayu Food Delivery App : స్విగ్గీ, జొమాటోకు పోటీగా.. సరికొత్త ఫుడ్ డెలివరీ Waayu యాప్‌.. తక్కువ ధరకే ఫుడ్ డెలివరీ..!