Google I/O 2023 : భారత్‌లో ఈరోజే గూగుల్ వార్షిక I/O 2023 ఈవెంట్.. ఏయే ప్రొడక్టులను లాంచ్ చేయొచ్చు? లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే?

Google I/O 2023 : సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ ఫిజికల్‌గా నిర్వహించనుంది. గూగుల్ ప్రొడక్టుల అభిమానులు కీనోట్‌ను ఉచితంగా లైవ్‌లోనే చూడవచ్చు. Google I/O లైవ్ స్ట్రీమింగ్ YouTubeలో అందుబాటులోకి ఉంటుంది.

Google I/O 2023 : భారత్‌లో ఈరోజే గూగుల్ వార్షిక I/O 2023 ఈవెంట్.. ఏయే ప్రొడక్టులను లాంచ్ చేయొచ్చు? లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే?

Google I_O 2023 Starts tonight _ How to watch Livestream in India, what to expect

Google I/O 2023 : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ (Google I/O 2023) ఈవెంట్ నిర్వహించనుంది. షెడ్యూల్ ప్రకారం.. మే 10న భారత్‌లో కొత్త Android OS, ఇతర డెవలప్‌మెంట్‌లను ప్రదర్శించనుంది. గూగుల్ మొదటి పిక్సెల్ టాబ్లెట్‌తో పాటు మొదటి ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌ పిక్సెల్ ఫోల్డ్ కూడా ప్రదర్శించనుంది. ఈ ఏడాదిలో Google I/O మరింత ప్రత్యేకంగా ఉండనుంది. భారత మార్కెట్లోకి వస్తున్న Pixel 7a అధికారిక లాంచ్‌ను కూడా వీక్షించవచ్చు. ఇందులో హార్డ్‌వేర్‌తో పాటు, (Google AI), జనరేటివ్ AI చాట్‌బాట్ బార్డ్ (Bard AI) వంటి ఏఐ టూల్స్ గురించి వివరణ ఇవ్వనుంది. కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ కీనోట్‌తో ఈ షో ప్రారంభం కానుంది. కీనోట్ తర్వాత.. డెవలపర్ కీనోట్ కూడా ఉంటుంది.

Google I/O 2023ని ఎలా వీక్షించాలంటే? :
ఈసారి, గూగుల్ I/O 2023 ఈవెంట్ ఫిజికల్‌గా జరుగనుంది. అయితే మొబైల్ యూజర్లు కీనోట్‌ను ఉచితంగా లైవ్‌లో చూడవచ్చు. యూట్యూబ్‌లో (YouTube)లో I/O ఈవెంట్ అందుబాటులో ఉంటుంది గూగుల్ (Google) ఇప్పటికే స్ట్రీమ్‌ను షెడ్యూల్ చేసింది. దీనికి సంబంధించి లింక్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.

Read Also : Realme 11 Pro+ Launch : రియల్‌మి 11ప్రో ప్లస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక స్పెషిఫికేషన్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Google I/O కీనోట్ మే 10న రాత్రి 10:30కి ప్రారంభం కానుంది. ఆ తర్వాత, డెవలపర్-ఫోకస్డ్ కీనోట్ ప్రారంభం కానుంది. ఆపిల్ WWDC మాదిరిగా కాకుండా (Google I/O) కీనోట్‌లు సాధారణంగా చాలా పెద్దగానూ గంటకు పైగా సమయం పడుతుంది. ఈ ఏడాదిలో గూగుల్ అనేక ప్రొడక్టులు, సర్వీసులను ఆవిష్కరిస్తుందని అంచనా.

Google I_O 2023 Starts tonight _ How to watch Livestream in India, what to expect

Google I_O 2023 Starts tonight _ How to watch Livestream in India, what to expect

గూగుల్ I/O 2023లో రాబోయే కొత్త ప్రొడక్టులవే :
గూగుల్ ఫస్ట్ జనరేషన్ ప్రొడక్టుల్లో కొన్నింటిని ప్రదర్శించనుంది. భారతీయ అభిమానులు, వినియోగదారులు Pixel 7a లాంచ్ లైవ్‌లో చూడవచ్చు. మే 11న ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను విక్రయించనున్నట్లు గూగుల్ ఇప్పటికే వెల్లడించింది. సాధారణంగా Samsung, Oppo, OnePlus ఆధిపత్యంలో మిడ్-బడ్జెట్ విభాగంలో Pixel 7a కంపెనీకి గేమ్-ఛేంజర్‌గా ఉంటుంది. Pixel 7a ధర సుమారు రూ. 45వేలు ఉండవచ్చు. ఈ కొత్త ఫోన్ చిప్‌సెట్ (Tensor G2)తో రానుంది. కొన్ని స్క్రీన్, బ్యాటరీ, కెమెరా అప్‌గ్రేడ్‌లు కూడా ఉండబోతున్నాయి. గూగుల్ ఈవెంట్లో Google Pixel Fold ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. మరోవైపు.. శాంసంగ్ గెలాక్సీ Z Fold 4, Oppo Find N2కి గూగుల్ పోటీగా ప్రొడక్టులను లాంచ్ చేయనుంది. గూగుల్ ఇప్పటికే ఫోల్డబుల్ డిజైన్‌ను వెల్లడించింది.

ఈ ఫోన్ Galaxy Z Fold 4 మోడల్ కన్నా భారీ డిస్‌ప్లేను కలిగి ఉండనుంది. Google Tensor G2 SoC ద్వారా రానుంది. Pixel 7 సిరీస్‌లోనూ ఇదే ప్రాసెసర్ ఉంటుంది. పిక్సెల్ ఫోల్డ్‌లోని బ్యాక్ కెమెరా మాడ్యూల్ మూడు సెన్సార్‌లను కలిగి ఉంటుంది. వైడ్ కెమెరా, అల్ట్రా-వైడ్ కెమెరా, టెలిఫోటో కెమెరా ఉండవచ్చు. గూగుల్ ఫోన్‌లో ఈ ఫారమ్ ఫ్యాక్టర్‌కి Android OSతో రావొచ్చు. Pixel టాబ్లెట్ కూడా ఇదే OSతో రావచ్చు. గూగుల్ టాబ్లెట్‌లు సాఫ్ట్‌వేర్ సపోర్టుతో 10-అంగుళాల డిస్‌ప్లేతో రానున్నాయి. గూగుల్ టాబ్లెట్ ధర సుమారు రూ. 50వేలు ఉండవచ్చు. భారత మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం లేదు.

Read Also : Google Pixel 7a : మే 10న గూగుల్ పిక్సెల్ 7a ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!