Realme 11 Pro+ Launch : రియల్‌మి 11ప్రో ప్లస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక స్పెషిఫికేషన్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Realme 11 Pro+ Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? మే 10 వరకు ఆగాల్సిందే.. రియల్‌మి నుంచి (Realme 11 Pro Plus) స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. ధర ఎంత ఉండొచ్చుంటే?

Realme 11 Pro+ Launch : రియల్‌మి 11ప్రో ప్లస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక స్పెషిఫికేషన్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Realme 11 Pro Plus Display Specifications Confirmed Officially, Appears on Geekbench Listing Ahead of Launch

Realme 11 Pro+ Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి (Realme) నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. వచ్చే మే 10న వెనిలా రియల్‌మి 11, రియల్‌మి 11 ప్రో, రియల్‌మే 11 ప్రో+లతో కూడిన రియల్‌మి 11 సిరీస్ చైనాలో లాంచ్ అవుతున్నట్లు ధృవీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల అరంగేట్రానికి ఇంకా వారం కన్నా ఎక్కువ సమయం ఉంది. ఈలోగా కంపెనీ Weibo పోస్ట్ ద్వారా Realme 11 Pro+ డిస్‌ప్లే స్పెసిఫికేషన్‌లను అధికారికంగా వెల్లడించింది.

అదనంగా, ఈ స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో కూడా కనిపించింది. రాబోయే రియల్‌మి కొత్త ఫోన్‌లో ప్రాసెసర్, సాఫ్ట్‌వేర్ సపోర్టుతో సహా మరికొన్ని ఫీచర్లను సూచిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ (Android 13 OS)లో రన్ అవుతుందని లిస్టింగ్ సూచించింది. MediaTek డైమెన్సిటీ 1080 SoC ద్వారా పనిచేస్తుంది. ఈ ఫోన్ ధర గ్లోబల్ మార్కెట్లో రూ. 34,990 నుంచి ఉండొచ్చునని అంచనా.

Read Also : Apple Employee Fraud : రూ. 138 కోట్లు కాజేసిన ఆపిల్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష.. కొల్లగొట్టిన మొత్తం కంపెనీకి చెల్లించాల్సిందే..!

రియల్‌మి చైనాలో లాంచ్ చేయడానికి ముందు రాబోయే రియల్‌మి 11 ప్రో+ డిజైన్, డిస్‌ప్లే స్పెసిఫికేషన్‌లను టీజ్ చేసింది. మే 10న లాంచ్ అయ్యే ఈ స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో సెంట్రల్ హోల్-పంచ్ కటౌట్‌తో రానుంది. 61-డిగ్రీ కర్వడ్ ఎడ్జ్‌లతో వస్తుంది. డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. Realme 11 Pro+ 2.33mm అల్ట్రా-చిన్‌ను కలిగి ఉంటుందని అధికారిక పోస్టర్ వెల్లడించింది.

Realme 11 Pro Plus Display Specifications Confirmed Officially, Appears on Geekbench Listing Ahead of Launch

Realme 11 Pro Plus Display Specifications Confirmed Officially

అదనంగా, రియల్‌మి 11 Pro+ మోడల్ నంబర్ RMX3740తో Geekbench లిస్టింగ్‌లో కనిపించింది. Nashville Chatter నివేదిక ప్రకారం.. Realme 11 Pro+ 5G మోడల్ MediaTek డైమెన్సిటీ 7050 SoC ద్వారా అందించవచ్చు. ఎందుకంటే 2.6 GHz వద్ద రెండు కోర్లు, 2.0 GHz వద్ద 6 కోర్లతో వస్తుంది. బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్‌లో సింగిల్-కోర్ టెస్టులో ఈ ఫోన్ 838, మల్టీ-కోర్ పరీక్షలో 2302 స్కోర్ చేసింది. లిస్టింగ్ ఫోన్‌కు సాఫ్ట్‌వేర్ సపోర్టు, RAM కాన్ఫిగరేషన్‌ను కూడా సూచించింది.

రియల్‌మి 11 Pro+ మోడల్ 12GB RAM, Android 13 OS అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అయ్యే అవకాశం ఉంది. రియల్‌మి 11 Pro+ నవంబర్ 2022లో రిలీజ్ అయిన Realme 10 Pro+ అప్‌గ్రేడ్ వెర్షన్.. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 2,160Hz PWM, 6.7-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆక్టా-కోర్ 6nm MediaTek డైమెన్సిటీ 1080 5G SoC ద్వారా రన్ అవుతుంది. గరిష్టంగా 8GB వరకు LPDDR4X RAMతో రానుంది.

Read Also : Upcoming Smartphones : మే 2023లో రాబోయే 5 కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏయే బ్రాండ్ల ఫోన్లు ఉండొచ్చుంటే? ఫుల్ లిస్టు మీకోసం..!