Upcoming Smartphones : మే 2023లో రాబోయే 5 కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏయే బ్రాండ్ల ఫోన్లు ఉండొచ్చుంటే? ఫుల్ లిస్టు మీకోసం..!
Upcoming Smartphones 2023 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే మరికొన్ని రోజులు ఆగండి.. మే 2023లో 5 కొత్త స్మార్ట్‌ఫోన్లు రానున్నాయి. ఏయే బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు ఉండనున్నాయో ఓసారి లిస్టు చూద్దాం..

From Pixel 7a to Realme 11 pro, here's a list of smartphones launching in May
Upcoming Smartphones : భారత మార్కెట్లో వచ్చే మేలో కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజాలైన శాంసంగ్ (Samsung), రియల్‌మి (Realme), గూగుల్ (Google), వన్‌ప్లస్ (OnePlus) వంటి బ్రాండ్‌లు కొత్త ఫోన్‌లను ప్రకటించేందుకు రెడీగా ఉన్నాయి. రాబోయే రెండు కొత్త ఫోన్‌లను (Google I/O 2023) ఈవెంట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ల నుంచి రియల్‌మి 11 ప్రో వరకు అనేక కొత్త స్మార్ట్‌ఫోన్లు ఉండనున్నాయి. ఈ ఫోన్లకు సంబంధించి ఫుల్ లిస్టు మీకోసం అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన బ్రాండ్ ఫోన్ ఎంచుకోండి.
మే 2023లో రానున్న స్మార్ట్‌ఫోన్లు ఇవే :
1) Pixel 7a :
గూగుల్ (Google I/O 2023) ఈవెంట్‌లో మే 10న పిక్సెల్ సిరీస్‌లో (Google) సరికొత్త మోడల్ లాంచ్ చేయనుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో రానుంది. సోనీ IMX787 లెన్స్‌తో కూడిన 64 MP OIS కెమెరాతో స్మార్ట్‌ఫోన్ రావచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. Pixel 7a ఫోన్ టెన్సర్ G2 చిప్‌సెట్, 4,500 mAh బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు.
Read Also : Swiggy New Charges : స్విగ్గీ కొత్త ఛార్జీల బాదుడు.. ప్రతి ఆర్డర్‌పై రూ.2 చెల్లించాల్సిందే.. ఎందుకో తెలుసా?
2) పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ :
గూగుల్ (Google I/O) ఈవెంట్లో పిక్సెల్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. సెర్చ్ దిగ్గజం నుంచి ఇదే ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్. నివేదిక ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ 5.8-అంగుళాల కవర్ డిస్‌ప్లే, 7.69-అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లేతో రావచ్చు. కెమెరాల పరంగా చూస్తే.. పిక్సెల్ ఫోల్డ్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్, సెల్ఫీలకు రెండు పంచ్-హోల్ కెమెరాలతో రావచ్చు.

Upcoming Smartphones : From Pixel 7a to Realme 11 pro, here’s a list of smartphones launching in May
3) Realme 11 Pro, Pro+ :
రియల్‌మి 11 ప్రో సిరీస్‌ను మే నెలలో భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్టు ధృవీకరించింది. స్పెసిఫికేషన్ల పరంగా.. (Realme 11 Pro) 108MP బ్యాక్ కెమెరా, డైమెన్సిటీ 7000 సిరీస్ చిప్‌సెట్‌తో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీ, 67W ఛార్జర్‌తో వస్తుంది. Realme 11 Pro+ డైమెన్సిటీ 7000-సిరీస్ చిప్‌సెట్, కర్వ్డ్ ఎడ్జ్‌లతో 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేతో రావచ్చు. రియల్‌మి స్మార్ట్‌ఫోన్ 200MP ప్రైమరీ కెమెరా సెన్సార్, 16MP సెల్ఫీ కెమెరాతో రావచ్చు.
4) OnePlus Nord 3 :
వన్‌ప్లస్ Nord 3 ఫోన్ మే చివరిలో భారత మార్కెట్లో లాంచ్ కానుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 5G ప్రాసెసర్‌తో రావచ్చు. Nord 3 5,000mAh బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తుందని అంచనా. భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ.30వేల నుంచి రూ. 40వేల మధ్య ఉండవచ్చు.
5) Samsung Galaxy F54 :
శాంసంగ్ లేటెస్ట్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ (Galaxy F54) కూడా మే నెలలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ F54 Exynos s5e8835 ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED, 108 MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో దాదాపు రూ. 23వేల వద్ద లాంచ్ అయ్యే అవకాశం ఉంది.