సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విటర్) భారత్‌లో ప్రీమియం సర్వీస్ ధరలను 47 శాతం వరకు తగ్గించింది. బేసిక్, ప్రీమియం, ప్రీమియం+కు ఈ ధర తగ్గింపు వర్తిస్తుంది. ఇంటర్నెట్ మార్కెట్‌లో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న భారత మార్కెట్లో ఎక్స్‌కు మరింత ప్రోత్సహించడమే దీనికి కారణం.
ఇండియాలో 2023 ఫిబ్రవరిలో ట్విటర్ బ్లూ పేరుతో ప్రీమియం సర్వీస్ ప్రారంభించారు. ఆ తర్వాత ధరలను ఇంతగా సవరించడం ఇదే తొలిసారి. గత ఏడాది ప్రీమియం+ ధరలు రెండుసార్లు పెరిగినా, ఇప్పుడు మాత్రం బేసిక్, ప్రీమియం, ప్రీమియం+కు మూడింటి ధరలను ఒకేసారి తగ్గించారు.
ధరలు (వెబ్ వర్షన్‌లో)
మొబైల్ యాప్‌లలో
గూగుల్, యాపిల్ కమిషన్ల కారణంగా మొబైల్ యాప్‌లలో ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి..
ప్రతి టియర్‌లో పొందే ఫీచర్లు
ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ సబ్‌స్క్రిప్షన్ ఆదాయాన్ని పెంచుకోవాలని యత్నిస్తున్నా, 2024 డిసెంబర్ నాటికి మొబైల్ ప్లాట్‌ఫామ్‌లలో ఇన్ అప్ కొనుగోళ్ల ద్వారా వచ్చిన ఆదాయం కేవలం $16.5 మిలియన్ మాత్రమే(Appfigures గణాంకాల ప్రకారం).