X Copy Video Links : యూజర్లలో టెన్షన్..‘X’ కు ఏమైంది.. వీడియో లింక్‌లపై ఏంటి రచ్చ.. వైరల్ పోస్టులో నిజమెంత? ఫుల్ స్టోరీ..!
X Copy Video Links : ఎలన్ మస్క్ కంపెనీ కాపీ వీడియోలను లింక్ చేయడం లేదు.. ఎక్స్ వేదికగా పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీన అసలేం జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
- Sreehari A
- Published On : April 2, 2026 / 08:23 PM IST
X Copy Video Links
- ఎక్స్ వీడియో లింక్ ఫీచర్ తొలగింపుపై యూజర్లలో టెన్షన్..
- వీడియో లింక్ కాపీ అవ్వడం లేదంటూ చాలామంది ఫిర్యాదులు
- అది ఫేక్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్న ఎక్స్ యూజర్లు
X Copy Video Links : ఏప్రిల్ ఒకటో తేదీ.. ఎక్స్ వేదికగా యూజర్లలో ఒక వార్త ఆందోళన రేకిత్తించింది. ఎక్స్ వీడియో లింకులను కాపీ చేయకుండా ఫీచర్ డిలీట్ చేసిందంటూ ఆ వార్త సంచలనం రేకిత్తించింది.
కొన్ని గంటల వ్యవధిలోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వేగంగా వైరల్ అయింది. వైరల్ అయిన పోస్టులను చూసి నిజంగానే కంపెనీ ఇలా ఎందుకు చేసిందో తెలియక వినియోగదారులు ఆశ్చర్యపోయారు. అయితే, ఆ తర్వాత అసలు నిజం తెలియడంతో ఎక్స్ యూజర్లంతా ఊపిరిపీల్చుకున్నారు.
అసలేం జరిగిందంటే? :
ఏప్రిల్ 1వ తేదీన ఎక్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో కలకలం రేగింది. ఎక్స్ వేదికగా వీడియో లింక్‌లను కాపీ చేయలేకపోతున్నామని చాలా మంది యూజర్లు పేర్కొన్నారు. ఇంతలో, ఒక కొత్త అప్‌డేట్‌లో భాగంగా ఎక్స్ లింక్‌లను కాపీ లేదా షేర్ చేసే ఫీచర్‌ను తొలగించిందని పేర్కొంటూ పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ పోస్టులు వేగంగా వైరల్ అయ్యాయి.
ఈ పోస్టులకు లక్షలాది వ్యూస్ :
ఎక్స్ ప్లాట్ ఫారంలో వీడియో లింకులు కాపీ కావడం లేదంటూ వచ్చిన సమాచారం వేగంగా వైరల్ అయింది. కొంతమంది ఆ వీడియోను డైరెక్ట్ లింక్ ద్వారా షేర్ చేయలేకపోతున్నామని చాలామంది ఫిర్యాదు చేశారు.
పొలిటికల్ వీడియోల లింకుల వంటి ఇతర వీడియో కంటెంట్‌ను షేర్ అవ్వడం లేదనే ఆందోళనలు తలెత్తాయి. కొన్ని గంటల్లోనే ఈ తరహా వైరల్ న్యూస్ బాగా వైరల్ అయింది. పోస్టులకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి.
You can still copy the link of any video on X!!
All the other accounts are just doing engagement farming!
— ARS (@Papaji200) April 2, 2026
వైరల్ పోస్టులతో మరింత ఆందోళన :
కొన్ని అకౌంట్లలో ఈ వాదన అందరిని ఆందోళనకు గురిచేసింది. మస్క్ కంపెనీ ఈ కొత్త నియమాన్ని అమలు చేసిందని యూజర్లు నమ్మేలా మీమ్స్, పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే, ఈ వైరల్ వార్తలో అసలు వాస్తవం వెంటనే బయటపడింది. చాలా మంది వినియోగదారులు తమ ఫోన్‌లు, కంప్యూటర్‌లలో ఆ ఫీచర్ ఎలాంటి సమస్య లేకుండా పనిచేస్తోందని రిపోర్టు చేశారు.
ఆ తర్వాత, “యూఎస్ఏ న్యూస్” అనే అకౌంట్ ఈ న్యూస్ మొత్తం కేవలం ఒక ఏప్రిల్ ఫూల్స్ జోక్ అంటూ అంగీకరించింది. కేవలం ఎంగేజ్‌మెంట్‌ను పెంచడమే తప్ప మరొకటి లేదు. కొంతమంది యూజర్లు ఇది ఒక “రీబేస్” పోస్ట్ అని ఎక్స్ ఇలాంటి మార్పులేవీ చేయలేదని స్పష్టంగా పేర్కొన్నారు.
You can no longer copy the link of a video anymore on X pic.twitter.com/gfxCbYsBdr
— sachin. (@sachinyadav699) April 2, 2026
ఆ ఫీచర్ ఇప్పటికీ వర్క్ అవుతోంది :
అసలు వాస్తవం ఏమిటంటే.. ఎక్స్ ప్లాట్‌ఫారంలో వీడియో లింక్‌లను కాపీ చేసే ఫీచర్ గతంలో మాదిరిగానే పనిచేస్తోంది. మొబైల్ యాప్‌లో షేర్ ఐకాన్‌ను ట్యాప్ చేస్తే.. ‘కాపీ లింక్’ ఆప్షన్ ఇప్పటికీ కనిపిస్తోంది. వెబ్ బ్రౌజర్‌లో ‘కాపీ వీడియో అడ్రస్’ ఆప్షన్ కూడా వర్క్ అవుతోంది.
ఎక్స్‌లో వీడియో లింక్‌లను ఎలా కాపీ చేయాలి? :
- ఎక్స్ ద్వారా వీడియో లింక్‌లను కాపీ చేసి ఇతర యూజర్లతో షేర్ చేయొచ్చు.
- బాటమ్ రైట్ సైడ్ పైకి యారో ఐకాన్ బటన్‌పై క్లిక్ చేయండి
- లింక్‌ను కాపీ చేసి ఇతరులతో షేర్ చేయండి అనే ఆప్షన్ క్లిక్ చేయండి
- మీరు వీడియోపై రైట్-క్లిక్ చేసి వీడియో అడ్రస్‌ను కాపీ చేసి షేర్ కూడా చేయవచ్చు.
- ఎక్స్ ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఆయా వీడియో పోస్ట్‌లను షేర్ చేయొచ్చు.
