EPFO Passbook Lite
EPFO Passbook Lite : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) సభ్యుల పోర్టల్‌లో “పాస్‌బుక్ లైట్” అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్‌తో సబ్‌స్క్రైబర్లు ఇప్పుడు తమ ఈపీఎఫ్ పాస్‌బుక్ లైట్ వెర్షన్‌ను నేరుగా పోర్టల్‌లో చూడొచ్చు.
ఇకపై పాస్‌బుక్ వెబ్‌సైట్‌లోకి సపరేటుగా (EPFO Passbook Lite) లాగిన్ అవసరం ఉండదు. ఈ ఫీచర్ సాయంతో పీఎఫ్ సభ్యులు, కాంట్రిబ్యూషన్స్, విత్ డ్రాలు, పీఎఫ్ బ్యాలెన్స్ ఒకే చోట చెక్ చేసుకోవచ్చు.
ఈపీఎఫ్ఓ పాస్‌బుక్ లైట్ లాగిన్ ప్రాసెస్ :
ఈపీఎఫ్ఓ పాస్‌బుక్ లైట్ ఫీచర్ లక్షలాది మంది పీఎఫ్ హోల్డర్లకు అత్యంత ప్రయోజకరంగా ఉంటుంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈపీఎఫ్ఓ పాస్‌బుక్ లైట్ ఏంటి :
మీ పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బు విత్‌డ్రా చేసినా మీకు మెసేజ్ రావడం లేదా. ఇకపై ఈ సమస్య ఉండదు. దేశవ్యాప్తంగా లక్షలాది ఈపీఎఫ్ఓ హోల్డర్ల కోసం పాస్‌బుక్ లైట్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఖాతాదారులు తమ ఈపీఎఫ్ఓ పాస్‌బుక్‌లోని మొత్తం సమాచారాన్ని ఒకే క్లిక్‌తో యాక్సెస్ చేయొచ్చు.
‘పాస్‌బుక్ లైట్’ ఏంటి? :
పాస్‌బుక్ లైట్ అనేది ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లోని ఇంటర్‌ఫేస్. ఈ ఫీచర్‌తో ఎలాంటి లాగిన్ ప్రక్రియ లేకుండానే నేరుగా పీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేయవచ్చు. గతంలో పీఎఫ్ హోల్డర్లు తమ UAN, పాస్‌వర్డ్, క్యాప్చాను ఎంటర్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ ప్రక్రియ చాలా ఈజీగా మారింది. పీఎఫ్ సభ్యులు తమ UAN నంబర్, OTP ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత, నేరుగా తమ పాస్‌బుక్‌ను చెక్ చేసుకోవచ్చు.
పాస్‌బుక్ లైట్ ఎలా వాడాలి? :
ఈ ఫీచర్ ఎందుకు ముఖ్యమంటే? :
ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో మీ పాస్‌బుక్‌ను చూసేందుకు ఒకప్పుడు కొద్దిగా ప్రాసెస్ ఉండేది. దాంతో మిలియన్ల మంది పీఎఫ్ సభ్యులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఈపీఎఫ్ఓ పాస్‌బుక్ లైట్‌ను ప్రారంభించింది.
దీని ప్రకారం.. కొంతమందికి టెక్నికల్ అవగాహన లేకపోవడం, నెట్‌వర్క్ సమస్యల కారణంగా చాలా మంది తమ పీఎఫ్ అకౌంట్ వివరాలను తెలుసుకోలేకపోయారు. ఈ ఫీచర్ ప్రత్యేకంగా ఆయా వ్యక్తులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.