eSIM Activation : డిజిటల్ సిమ్ కావాలా? మీ నెట్‌వర్క్ ఏదైనా eSIM తీసుకోవచ్చు.. యాక్టివేషన్ వెరీ ఈజీ.. స్టెప్ బై స్టెప్ గైడ్..!

eSIM Activation : ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్, జియో, వోడాఫోన్ ఐడియా ఇప్పుడు eSIM సర్వీసులను అందిస్తున్నాయి. ఫిజికల్ సిమ్ కార్డ్ నుంచి డిజిటల్ సిమ్‌కు ఎలా మారాలంటే

eSIM Activation : డిజిటల్ సిమ్ కావాలా? మీ నెట్‌వర్క్ ఏదైనా eSIM తీసుకోవచ్చు.. యాక్టివేషన్ వెరీ ఈజీ.. స్టెప్ బై స్టెప్ గైడ్..!

eSIM Activation

Updated On : September 29, 2025 / 4:22 PM IST

eSIM Activation : కొత్త సిమ్ కావాలా? ఫిజికల్ సిమ్ కాదండోయ్.. డిజిటల్ ఇసిమ్ (e-SIM) ఇప్పుడు ఇది బాగా పాపులర్ అయింది. ఫిజికల్ సిమ్ కన్నా డిజిటల్ సిమ్‌కు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ పెరుగుతోంది. చాలామంది వినియోగదారులు ఇసిమ్ యాక్టివేషన్ కోసం ఆసక్తి చూపిస్తున్నారు. ఫిజికల్ సిమ్ ఉండగా ఇసిమ్ ఏంటి? ఇదేలా పనిచేస్తుంది? ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? అనే సందేహాలు చాలామంది యూజర్లలో ఉంటుంది.

ఇప్పటికే ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా  (eSIM Activation) వంటి టెలికం దిగ్గజాలు ఇసిమ్ సర్వీసును అందిస్తున్నాయి. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ కూడా ఇటీవలే ఎంపిక చేసిన సర్కిల్‌లలో eSIM సర్వీసును ప్రారంభించింది. eSIM ఫిజికల్ సిమ్ కార్డ్ మాదిరిగానే వర్క్ చేస్తుంది. ఆపిల్ ఐఫోన్, గూగుల్ పిక్సెల్, శాంసంగ్ గెలాక్సీ S సిరీస్ వంటి సపోర్టు చేసే ఫోన్లలో ఫాస్ట్ నెట్‌వర్క్ కనెక్టివిటీని అందిస్తుంది. ఫిజికల్ సిమ్ బదులుగా ఇసిమ్ ఎందుకు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

eSIMకి ఎందుకు మారాలి? :
ఫిజిలక్ సిమ్ కార్డ్ మాదిరిగా కాకుండా eSIM పాతబడిపోదు లేదా పాడైపోదు. అయితే, కొంచెం కేర్ ఉండటం చాలా ముఖ్యం. మీ ఫోన్ నుంచి అనుకోకుండా eSIMని రిమూవ్ చేస్తే వెంటనే నెట్‌వర్క్ నిలిచిపోతుంది.

మీ eSIM కోసం ఎలా రిక్వెస్ట్ పంపాలంటే? :
మీ సర్వీస్ ప్రొవైడర్‌ను బట్టి రిక్వెస్ట్ ప్రాసెస్ ప్రక్రియ కొద్దిగా మారుతుంది.
జియో యూజర్లు : MyJio యాప్ ద్వారా లేదా సమీపంలోని జియో స్టోర్‌ను విజిట్ చేసి eSIM రిక్వెస్ట్ పొందండి.
ఎయిర్‌టెల్, Vi యూజర్లు : మీరు అధికారిక యాప్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. eSIM అని టెక్స్ట్ టైప్ చేసి 121 లేదా 199కు SMS పంపండి (మీ నెట్‌వర్క్ నిర్దిష్ట నంబర్‌ను చెక్ చేయండి).
బీఎస్ఎన్ఎల్ యూజర్లు : అప్లికేషన్ కోసం మీ సమీపంలోని కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించాలి. మీరు KYCని పూర్తి చేయాలి. ఇందుకు మీ ఆధార్ కార్డ్ అవసరం.

Read Also : Fake iPhone : పండగ ఆఫర్‌లో కొత్త ఐఫోన్ కొన్నారా? అది ఫేక్ ఐఫోన్ కావొచ్చు.. ఏమాత్రం డౌట్ ఉన్నా అర్జెంట్‌గా ఇలా చెక్ చేయండి..!

యాక్టివేషన్ ప్రాసెస్ ఇదిగో :

మీ రిక్వెస్ట్ సమర్పించిన తర్వాత eSIM డౌన్‌లోడ్ చేసి యాక్టివేట్ చేసేందుకు ఈ కింది విధంగా ప్రయత్నించండి.
QR కోడ్‌ స్వీకరించండి : మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ అడ్రస్ ద్వారా eSIM కోసం QR కోడ్‌ను అందుకుంటారు.
eSIM సెట్టింగ్స్ యాక్సెస్ చేయండి : మీ ఫోన్ సెట్టింగ్స్‌కు వెళ్లి “Mobile Networks,” “Cellular,” లేదా “SIM Services” ఎంచుకోండి.
eSIM యాడింగ్ : “Add eSIM” లేదా “Download eSIM” ఆప్షన్ ఎంచుకోండి.
స్కాన్ కోడ్ : “Use QR Code” ఆప్షన్ ఎంచుకుని మీ ఇమెయిల్‌కు వచ్చిన QR కోడ్‌ను స్కాన్ చేయండి.
IVR కన్ఫార్మేషన్ : మీ రిక్వెస్ట్ కన్ఫార్మ్ చేయడం, ప్రాసెస్ చేసేందుకు మీకు IVR కాల్ వస్తుంది.
ఈ మొత్తం ప్రక్రియ పూర్తి అయ్యేందుకు 4 గంటల వరకు సమయం పట్టవచ్చు.

ఫైనల్ స్టెప్, సెక్యూరిటీ :
eSIM యాక్టివేట్ తర్వాత మీ ఫిజికల్ సిమ్ నెట్‌వర్క్ కనెక్షన్ డిసేబుల్ అవుతుంది. eSIMతో మీ అన్ని సర్వీసులను యాక్సెస్ చేయొచ్చు.

సెక్యూరిటీ నోట్ : ట్రాయ్ నిబంధనల ప్రకారం.. యాక్టివేషన్ తర్వాత మొదటి 24 గంటల పాటు మీరు ఎలాంటి SMS మెసేజ్ స్వీకరించలేరు లేదా పంపలేరు. SIM స్వాప్ మోసాలను నిరోధించేందుకు ట్రాయ్ ఈ రూల్
పెట్టింది.