cameron green : చరిత్ర సృష్టించిన కామెరూన్ గ్రీన్.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ప్లేయర్‌గా..
ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ గ్రీన్ చరిత్ర సృష్టించాడు
cameron green is the most expencive forien player
IPL 2026 Auction : ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ గ్రీన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. అతడిని 25.20 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకుంది. ఈ క్రమంలో అతను మిచెల్ స్టార్క్ ను అధిగమించాడు. ఐపీఎల్ 2024 మినీవేలంలో స్కార్క్‌ను కేకేఆర్ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది.
రూ.2 కోట్ల బేస్‌ప్రైజ్‌తో వచ్చిన కామెరూన్ గ్రీన్ కోసం ఫ్రాంచైజీలు పోటీపట్టాయి. ఆరంభంలో కోల్‌కతా, ఆర్ఆర్ పోటీపడగా.. ఆ తరువాత సీఎస్‌కే వచ్చి చేరింది. మధ్యలో రాజస్థాన్ నిష్క్రమించగా ఆఖరి వరకు చెన్నై, కోల్‌కతా పోటీపడడంతో 25 కోట్లకు అతడి ధర పలికింది. చివరికి రేసు నుంచి చెన్నై నిష్ర్కమించగా కేకేఆర్ అతడిని సొంతం చేసుకుంది.
💰 INR 25.20 Crore 🤯🤯
The third most expensive player in the history of #TATAIPL auction! 🔨
Cameron Green will play for @KKRiders 💜#TATAIPLAuction pic.twitter.com/c0ErBPWHju
— IndianPremierLeague (@IPL) December 16, 2025
తొలి సెట్‌లో పృథ్వీషా, సర్ఫరాజ్ ఖాన్, కాన్వే, జేక్ ఫ్రెజర్ మెక్‌గుర్క్‌పై లను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు
