Face Book
Face Book: సోషల్ మీడియాలో ఏ చెత్త పెట్టినా చెల్లుతుంది అనే వాళ్లకి ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్ చెక్ పెడుతున్న సంగతి తెలిసిందే. ఖాతాదారుల పోస్టులు, అందులో ఉండే కంటెంట్ ను జల్లెడ పట్టి.. అందులో అసభ్యకర పోస్టులు, విద్వేష పూరిత కంటెంట్ ను తొలగిస్తుంది. ఇప్పటికే ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో 2.52 కోట్ల కంటెంట్‌ను ఫేస్‌బుక్ తొలగించింది.
ఇక ఇప్పుడు మరో మూడు కోట్ల కంటెంట్లను తొలగించినట్లు పేస్ బుక్ ప్రకటిచింది. జూన్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో 3.15 కోట్ల ప్రసంగాల కంటెంట్‌పై చర్యలు తీసుకున్నట్లు పేస్ బుక్ వెల్లడించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 వేల కంటెంట్ వ్యూస్‌కుగాను.. తొలగించినటువంటి విద్వేష కంటెంట్‌కు వచ్చే వ్యూస్ 5కి పడిపోయినట్లు తెలిపింది.
ఈ చర్యల వల్ల తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో విద్వేష ప్రసంగాల విస్తృతి చాలా వరకు తగ్గిందని ఫేస్‌బుక్ వైస్ ప్రెసిడెంట్ ఇంటిగ్రిటీ గయ్ రోజెన్ చెప్పారు. ఫేస్‌బుక్ తొలిసారి ఇలాంటి కంటెంట్‌ను రిపోర్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇలాంటి కంటెంట్‌ను తొలగించడం 15 రెట్లు పెరిగినట్లు ఆయన తెలిపారు.