Facebook Outage : ఆమె లైవ్‌లో కనిపించింది అంతే.. క్షణాల్లో ఫేస్‌బుక్ సర్వీసులన్నీ బంద్..!

ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఫేస్ బుక్ సర్వీసుల్లో మెసేజింగ్ యాప్ వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ సర్వీసులు అన్నీ నిలిచిపోయాయి.

Facebook outage  : ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఫేస్ బుక్ అందించే సర్వీసుల్లో మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp), ఇన్ స్టాగ్రామ్ (Instagram) సర్వీసులు అన్నీ నిలిచిపోయాయి. సోమవారం (అక్టోబర్ 4) రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా సోషల్ మీడియా మూడు ప్లాట్ ఫాంల సర్వీసులు నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7 గంటల పాటు ఫేస్‌బుక్ సర్వీసులు స్తంభించిపోయాయి. ఎందుకు.. ఇలా జరిగింది? ఏమైందో యూజర్లకు అర్థం కాలేదు. ఫేస్ బుక్ సర్వర్లు ఏమైనా హ్యాక్ అయ్యాయా? అనే అనుమానాలను రేకిత్తించింది. అంతేకాదు.. ఫేస్ బుక్ సంస్థకు భారీ నష్టాన్ని మిగిల్చింది.

సాంకేతిక కారణాలతోనే సర్వీసులు నిలిచిపోయాయని సంస్థ సీఈఓ జుకర్ బర్గ్ కూడా క్షమాపణలు తెలియజేశారు కూడా. ఇంతవరకు అందరికి తెలిసిన విషయమే.. అయితే అసలు ఫేస్ బుక్ సర్వీసులు ఇంత అర్థాంతరంగా నిలిచిపోవడానికి సాంకేతిక కారణాలు కాదట.. ఒక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ ఎంట్రీతో ఫేస్ బుక్ సర్వీసులన్నీ నిలిచిపోయాయి. ఫేస్ బుక్ అక్రమాలను బయటపెట్టేందుకు ఆమె లైవ్ లోకి వచ్చిన కొన్నిగంటల్లోనే సంస్థ ఒకేసారి తన మూడు ప్లాట్ ఫాం సర్వీసులన్నీ నిలిపివేసింది.
Mark Zuckerberg: ఆరు గంటలు ఆగిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్.. ఆరొందల కోట్ల డాలర్ల నష్టం

ఫేస్‌బుక్ గజగజ.. ఇంతకీ ఎవరామే!
ఇంతకీ ఆ మహిళ ఎవరో కాదు.. ఫేస్ బుక్ మాజీ ఉద్యోగి.. ఆమె పేరు.. (Frances Haugen) ఫ్రాన్సెస్ హాగెన్ (37). సోషల్ దిగ్గజం ఫేస్ బుక్ అక్రమాలను ఈమె గతంలోనే బయటపెట్టింది. అప్పటినుంచి ఆమె అజ్ఞాతంలోనే ఉంటోంది. ఇప్పుడు ఫేస్ బుక్ అక్రమాల వ్యహారాన్ని ఆమె పబ్లిక్ గా బయటపెట్టడంతో ఫేస్ బుక్ వెన్నులో వణుకుపుట్టింది. ఈ క్రమంలో ఫ్రాన్సెస్.. ఫెడరల్ విజిల్ బ్లోయర్ (federal whistleblower) రక్షణ కోసం ఆమె అప్లయ్ చేసుకుంది. ఫేస్ బుక్ అక్రమాలకు సంబంధించి పలు ఇంటర్నల్ డాక్యుమెంట్లను కూడా ఆమె కాంగ్రెస్ సహా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్, ద వాల్ స్ట్రీట్ జర్నల్ (Wall Street Journal) కూడా సమర్పించింది.

ఫేస్ బుక్ గుట్టు ప్రపంచానికి తెలియజేయాలని నిర్ణయించుకుంది. ఫేస్‌బుక్‌కు కేవ‌లం లాభాలపైనే ఆపేక్ష తప్ప.. యూజర్ల ప్రైవసీ భ‌ద్ర‌తపై ఎలాంటి బాధ్యత లేదని ఫ్రాన్సెస్ ఆరోపించింది. ఫేస్‌బుక్ తన అల్గారిథమ్ సురక్షితమైన పద్ధతికి మార్చడం ద్వారా యూజర్లు తక్కువ సమయం మాత్రమే తమ ప్లాట్ ఫాంపై ఉంటారని భావిస్తోందని తెలిపింది. యూజర్ల భద్రత సంస్థకు పట్టదని ఆరోపించింది.
Read More :  WhatsApp Down : పని చేయని వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా.. కారణం అదేనా? చైనా పనేనా?

ఇప్పటివరకూ తానెన్నో సోష‌ల్ మీడియా సైట్ల‌ను చూసినట్టు చెప్పుకొచ్చింది. కానీ, ఫేస్ బుక్ మాదిరి అక్రమాలు ఎక్కడా జరగదని గుట్టు విప్పింది. త‌న అల్గారిథాన్ని సుర‌క్షితంగా మార్చినట్టయితే.. ఎక్కడ యూజ‌ర్లు త‌క్కువ స‌మ‌యం సైట్‌పై ఉంటారేమన్న భయంతోనే ఫేస్ బుక్ ఇలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపణలు గుప్పించారు. దాదాపు 60 నిమిషాల పాటు జరిగిన లైవ్ షోలో ఆమె ఫేస్ బుక్ అక్రమాలను ఒక్కొక్కటిగా బయటపెట్టింది. యూజర్ల బేస్ తగ్గిపోతే.. యాడ్ క్లిక్స్ తగ్గిపోతాయని, ఫలితంగా భారీగా ఆదాయం తగ్గిపోతుందని ఫేస్ బుక్ గ్రహించిందని అందుకే ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని హాగెన్ వెల్లడించింది.

ఇన్‌స్టాగ్రామ్ (Instagram) సర్వీసు టీనేజ‌ర్ల మాన‌సిక ఆరోగ్యానికి మంచిది కాద‌ని ఆమె అభిప్రాయపడింది. దీనికితోడు ఇప్పుడు ఫేస్ బుక్ Instagram Kids పేరుతో మరో సర్వీసు 13ఏళ్ల లోపు చిన్నారుల కోసం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించింది. అయితే దానికి సంబంధిత డాక్యుమెంట్లు, స‌మాచారాన్ని తాను బయటపెట్టడంతో ఫేస్ బుక్ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ కిడ్స్ లాంచింగ్‌ను అప్పటికప్పుడూ ఆపేసిందని హాగెన్ పేర్కొంది.

 Read More : Whatsapp : ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు

ట్రెండింగ్ వార్తలు