Flipkart Big Billion Days : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17, ఐఫోన్ 15 ధరలు భారీగా తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్లు ఇవే!

Flipkart Big Billion Days 2026 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026లో ఐఫోన్ 17 రూ. 79,999 నుంచి, ఐఫోన్ 15 రూ. 63,999 నుంచి లభించనున్నాయి. బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ల వివరాలివే..

Flipkart Big Billion Days 2026 iPhone 15

  • ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో ఐఫోన్ 17పై భారీ ఆఫర్
  • ఫ్లిప్‌కార్ట్ బీబీడీ సేల్‌లో అదిరిపోయే డీల్స్
  • ఐఫోన్ 15 రూ. 63,999కే.. ఐఫోన్ 17 రూ. 79,999 నుంచి
  • ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 17పై భారీ డిస్కౌంట్

Flipkart Big Billion Days 2026 : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? అక్టోబర్ 9 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 ప్రారంభం కానుంది. ఈ సేల్‌కు అర్హత ఉన్న కస్టమర్లకు అక్టోబర్ 8 నుంచే ముందస్తు యాక్సెస్ పొందవచ్చు.

ఈసారి స్మార్ట్‌ఫోన్‌లపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ 17, ఐఫోన్ 15 మోడళ్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి.. ఇంతకీ ఈ డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

ఐఫోన్ 17 ధర ఎంతంటే? :
ఫ్లిప్‌కార్ట్ సేల్ వివరాల ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 17 మోడల్ 256GB వేరియంట్‌ను రూ. 79,999 ప్రారంభ ధరకు (Flipkart Big Billion Days) సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్ లిస్టు ధర రూ. 99,900గా ఉంది. ఈ ఆఫర్‌లో క్రెడిట్ కార్డ్ ఈఎంఐ బెనిఫిట్స్, రూ. 3వేలు ఫ్లాట్ ఎక్స్ఛేంజ్ బోనస్ వంటి బెనిఫిట్స్ పొందవచ్చు.

అర్హత ఉన్న ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంకు లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అయితే ఫైనల్ ధర, బ్యాంక్ ఆఫర్లు, సేల్ సమయంలో ధర ఎంత అనేది చెక్ చేయాలి.

Read Also : POCO C95 Pro : కొంటే ఇలాంటి ఫోన్ కొనాలి.. భారీ బ్యాటరీతో పోకో C95 ప్రో ఆగయా.. ఏ వేరియంట్ ధర ఎంతంటే?

ఎక్స్ఛేంజ్‌తో మరింత తగ్గింపు :
పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే ఐఫోన్ 17పై గరిష్ఠంగా రూ. 89,850 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. అయితే, అసలు ఎక్స్ఛేంజ్ వాల్యూ, పాత ఫోన్ మోడల్, కండిషన్, ఎక్స్ఛేంజ్ అర్హతపై ఆధారపడి ఉంటుంది. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.

ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ :
ఐఫోన్ 15పై కూడా సేల్‌లో స్పెషల్ ధర అందుబాటులో ఉంది. బ్యాంక్ డిస్కౌంట్ల తర్వాత ప్రారంభ ధర రూ. 63,999గా ఉండనుంది. ఈ లిస్టు ధర రూ. 74,900కు లభిస్తుంది. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే గరిష్ఠంగా రూ. 54,400 వరకు అదనపు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది.

పిక్సెల్ 11పై బంపర్ ఆఫర్ :
ఆపిల్ ఫోన్లతో పాటు గూగుల్ పిక్సెల్ 11 కూడా రూ. 69,999 ధరకు అందుబాటులోకి రానుంది. మోటోరోలా ఎడ్జ్ జీ సిరీస్ ఫోన్లపై కూడా సేల్ సందర్భంగా భారీ తగ్గింపుతో లభించనున్నాయి.

  • ఫ్లిప్‌కార్ట్ యాప్ లేదా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
  • అక్టోబర్ 9న బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 15ను సెర్చ్ చేయండి.
  • అందుబాటులో ఉన్న వేరియంట్, సేల్ ధరను చెక్ చేయండి.
  • బ్యాంక్ ఆఫర్, క్యాష్‌బ్యాక్, ఈఎంఐ ఎంత పడుతుందో చెక్ చేయండి.
  • పాత ఫోన్ ఉంటే ఎక్స్చేంజ్ ఆప్షన్‌లో వివరాలు ఎంటర్ చేయండి.
  • ఫైనల్ ధర, ఎక్స్ఛేంజ్ వాల్యూ చెక్ చేసి ఆర్డర్ పెట్టుకోవడమే..