Flipkart Big Billion Days Sale
Flipkart Big Billion Days Sale : కొత్త ఆపిల్ ల్యాప్‌టాప్ కొంటున్నారా? ముఖ్యంగా స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనర్లు, కంటెంట్ క్రియేటర్లకు గుడ్ న్యూస్.. ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ భారీ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అద్భుతమైన డిజైన్, పవర్‌ఫుల్ డిస్‌ప్లే, స్టేబుల్ పర్ఫార్మెన్స్ కలిగి ఉంది. కొత్త మ్యాక్‌బుక్ ల్యాప్ టాప్ కొనాలంటే ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది.
కానీ, ఇలాంటి సేల్ ఆఫర్ల సమయంలో ఖరీదైన ల్యాప్‌టాప్ (Flipkart Big Billion Days Sale) కూడా సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు. M2 చిప్ కలిగిన ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా తగ్గింపు ధరకు లభ్యమవుతుంది. బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ ద్వారా మరింత తగ్గింపు పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ధరకే మ్యాక్‌బుక్ ఎయిర్ M2 :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2 (8GB ర్యామ్, 256GB SSD, macOS Sequoia) రూ.63,989 ధరకు అందిస్తోంది. వాస్తవ ధర కన్నా 25శాతం తక్కువ ఉంటుంది. బ్యాంక్ ఆఫర్లతోకొనుగోలుదారులు ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.4వేలు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
యూపీఐ లావాదేవీలపై రూ.1,000 అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. పాత ల్యాప్‌టాప్ ట్రేడింగ్ చేసే కస్టమర్లు మోడల్, వర్కింగ్ కండిషన్ బట్టి రూ.22వేల వరకు తగ్గింపు పొందవచ్చు. మ్యాక్‌బుక్ ఎయిర్ M2 ధర రూ.45వేల కన్నా తక్కువకే సొంతం చేసుకోవచ్చు.
ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2 లేటెస్ట్ జనరేషన్ ల్యాప్‌టాప్ కాకపోవచ్చు. కానీ, లేటెస్ట్ జనరేషన్ మ్యాక్‌బుక్ డివైజ్‌ల కన్నా భారీ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ ఆకర్షణీయ ధరకే అందిస్తోంది. క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, ఈఎంఐ ప్లాన్‌లతో చాలా తగ్గింపు ధరకే కొనేసుకోవచ్చు. మీరు మ్యాక్‌బుక్ ఎయిర్ రోజువారీ ల్యాప్‌టాప్ అవసరమయ్యే విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనర్లకు అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.
టాప్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ పోర్టబిలిటీకి సపోర్టు చేస్తుంది. మ్యాక్‌బుక్ M2 వెర్షన్ అదే కనెక్టివిటీని అందిస్తుంది. 13.6-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లేతో వస్తుంది. ట్రూ టోన్‌కు సపోర్టు ఇస్తుంది. డాక్యుమెంట్లు లేదా ఫొటో ఎడిటింగ్ లేదా కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేస్తున్నా కలర్ అడ్జెస్ట్‌మెంట్ అందిస్తుంది.
కేవలం 1.24 కిలోల బరువు కలిగిన ఈ ల్యాప్‌టాప్ ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లవచ్చు. స్టూడెంట్స్, ప్రొఫెషనర్లకు ప్రయాణంలో అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే.. మ్యాక్‌బుక్ ఎయిర్ M2 సాధారణ ఉపయోగంతో 15 గంటల కన్నా ఎక్కువసేపు ఛార్జింగ్ వస్తుంది. మీరు ఛార్జింగ్ విషయంలో ఆందోళన అవసరం లేదు. సింగిల్ టైమ్ ఛార్జ్ చేస్తే ఒక రోజంతా క్లాసులు, మీటింగ్స్ లేదా ప్రయాణం చేయవచ్చు.
ఆపిల్ ఇంటర్నల్ M2 చిప్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. బ్రౌజింగ్, వీడియో కాల్స్, ఆఫీస్ వర్క్ వంటి టాస్కులకు అద్భుతంగా ఉంటుంది. అయితే ఫోటో ఎడిటింగ్, లైట్ వీడియో ఎడిటింగ్, మల్టీ టాస్కింగ్ వంటి క్రియేటివిటీకి అద్భుతంగా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ ఆపిల్ సాఫ్ట్‌వేర్ ఎకో సిస్టమ్ తగినట్టుగా ఆప్టిమైజ్ అయి ఉంటుంది. ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లతో ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు.