Amazon Great Indian Festival 2025 : అమెజాన్ పండగ సేల్ డీల్స్.. ఆపిల్ ఐఫోన్ 15పై క్రేజీ డిస్కౌంట్.. ఈ ఐఫోన్ కొనాలా? వద్దా?
Amazon Great Indian Festival 2025 : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అమెజాన్ అద్భుతమైన ఆఫర్.. ఐఫోన్ 15పై భారీ తగ్గింపు అందిస్తోంది. డిస్కౌంట్ ధరకే ఈ ఐఫోన్ ఎలా కొనాలంటే?

Amazon Great Indian Festival 2025 : కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్. అమెజాన్ అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 15 తగ్గింపు ధరకే అందిస్తోంది. ఇప్పటికే మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ అందుబాటులో ఉండగా, ఇటీవలే ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ కూడా మార్కెట్లోకి వచ్చేసింది. ఖరీదైన కొత్త ఆపిల్ ఐఫోన్ మోడల్స్ కొనలేకుంటే పాత మోడల్ ఐఫోన్ 15 చౌకైన ధరకే కొనేసుకోవచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

అమెజాన్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 15 ఆఫర్లు : ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ (128GB ఇంటర్నల్ స్టోరేజ్)తో అమెజాన్‌లో భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. అసలు లాంచ్ ధర రూ.79,900 నుంచి ఏకంగా రూ.47,999కు కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఏమిటంటే.. ఎస్బీఐ క్రెడిట్ కార్డులు కలిగిన కస్టమర్లు కొనుగోలుపై రూ.1,250 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఐఫోన్ 15 బ్లాక్, బ్లూ, గ్రీన్, రోజ్, ఎల్లో వంటి 5 వేర్వేరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఆపిల్ ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఆపిల్ ఐఫోన్ 15 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

ఈ ఐఫోన్ 15 మోడల్ 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో 4nm ప్రాసెస్ ఆధారంగా ఆపిల్ A16 బయోనిక్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. iOS 17 ఆపరేటింగ్ సిస్టమ్, లేటెస్ట్ iOS 25కి అప్‌గ్రేడ్ చేయవచ్చు. అయితే, ఈ ఐఫోన్ మోడల్‌లో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉండవు.

ఆపిల్ ఐఫోన్ 15 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 48MP ప్రైమరీ షూటర్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఐఫోన్ 12MP ఫ్రంట్ స్నాపర్ కూడా కలిగి ఉంది. 3349mAh బ్యాటరీతో పాటు 15W మ్యాగ్‌సేఫ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

ఆపిల్ ఐఫోన్ 15 కొనాలా వద్దా? : ఈ ఆపిల్ ఐఫోన్ 15 కొనుగోలుపై భారీ డిస్కౌంట్లు పొందవచ్చు. ఈ ఐఫోన్ ధర రూ. 50వేల కన్నా తక్కువగా ఉంది.

ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు అవసరం లేకపోతే మీరు ఆపిల్ ఐఫోన్ 15 కొనేసుకోవచ్చు. లేదంటే ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కావాలంటే మాత్రం ఐఫోన్ 16 కొనేసుకోవడమే బెటర్.