Flipkart Big Diwali Sale starts
Flipkart Big Diwali Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ అక్టోబర్ 31 వరకు కొనసాగుతుంది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఇప్పటికే ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో మరిన్నింటితో సహా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డీల్స్ ప్రకటించింది. ఐఫోన్ 16 సిరీస్‌లో తగ్గింపు ఆఫర్‌లను పొందవచ్చు అయితే, ఈ డీల్స్ ఎంచుకున్న బ్యాంక్ కార్డ్ ఆఫర్‌లపై ఆధారపడి ఉంటాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఐఫోన్ 16 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 16 సిరీస్‌లోని అన్ని మోడళ్లను ఒరిజినల్ లాంచ్ ధరలకు విక్రయిస్తోంది. అయితే, అర్హత కలిగిన బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి తక్కువ ధరకు కావలసిన ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 16, ఐఫోన్ ప్లస్, ఐఫోన్ ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ రూ. 1,500 వరకు తగ్గింపు ఆఫర్‌తో అందుబాటులో ఉన్నాయి. ఎస్బీఐ బ్యాంక్ కార్డ్‌లపై కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది.
మీరు హై ఎండ్ ఆఫర్‌ల కోసం చూస్తున్నారా? విజయ్ సేల్స్ ద్వారా లేటెస్ట్ ఐఫోన్ 16 సిరీస్‌ను కొనుగోలు చేయాలి. ఈ ప్లాట్‌ఫారమ్ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ప్రామాణిక వెర్షన్‌లకు వర్తిస్తుంది. ఐఫోన్ ప్రో మోడల్‌లు రూ. 4వేల డిస్కౌంట్ బ్యాంక్ ఆఫర్‌తో జాబితా అయింది. ఈ బ్యాంక్ ఆఫర్లు ధరను భారీ మార్జిన్‌తో తగ్గిస్తాయి. ఈ ఆఫర్ల గడువు ఎప్పుడు ముగుస్తుందో ప్రస్తుతానికి తెలియదు.
ఐఫోన్ 16 సిరీస్ భారత్ ధర వివరాలివే :
ఆపిల్ ఐఫోన్ 16 128జీబీ మోడల్‌కు రూ. 79,900 నుంచి ప్రారంభమవుతుంది. మీకు మరింత స్టోరేజ్ కావాలంటే ఆపిల్ 256జీబీ వెర్షన్‌ను రూ. 89,900 ధరతో అందిస్తోంది. అయితే, టాప్-ఎండ్ 512జీబీ వేరియంట్ ధర రూ. 1,09,900 అవుతుంది. పెద్ద డిస్‌ప్లే కోసం చూస్తున్న వినియోగదారులకు ఐఫోన్ 16 ప్లస్ కూడా అందుబాటులో ఉంది. 128జీబీ మోడల్‌కు రూ. 89,900 నుంచి ప్రారంభమవుతుంది. 256జీబీ వేరియంట్ ధర రూ.99,900, 512జీబీ మోడల్ రూ.1,19,900కి అందుబాటులో ఉంటుంది.
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో 128జీబీ వేరియంట్ ధర రూ. 1,19,900 ప్రారంభ ధరతో వస్తుంది. ఆపిల్ 256జీబీ, 512జీబీ, 1టీబీ స్టోరేజ్ ఆప్షన్‌లను కూడా ప్రవేశపెట్టింది. ఈ ఐఫోన్ ధర వరుసగా రూ.1,29,900, రూ.1,49,900, రూ.1,69,900కు పొందవచ్చు. టాప్-ఆఫ్-లైన్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే యూజర్ల కోసం ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ 256జీబీ వేరియంట్‌కు రూ. 1,44,900 నుంచి ప్రారంభమవుతుంది. 512జీబీ మోడల్ ధర రూ.1,64,900 కాగా, 1టీబీ వెర్షన్ ధర రూ.1,84,900కు పొందవచ్చు.
Read Also : Redmi A4 5G Price : రెడ్‌మి A4 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, స్పెషిఫికేషన్లు లీక్..