Redmi A4 5G Price : రెడ్‌మి A4 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, స్పెషిఫికేషన్లు లీక్..

Redmi A4 5G Price : రెడ్‌మి ఎ4 5జీ 4జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో ఒకే వేరియంట్‌లో లాంచ్ కానుంది. ఈ రెడ్‌మి ఫోన్ బ్యాంక్, లాంచ్ ఆఫర్‌లతో ధర రూ. 8,499 వరకు ఉండవచ్చు.

Redmi A4 5G Price : రెడ్‌మి A4 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, స్పెషిఫికేషన్లు లీక్..

Redmi A4 5G India price and specifications leaked ahead of launch

Updated On : October 22, 2024 / 4:02 PM IST

Redmi A4 5G Price : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి నుంచి సరికొత్త 5జీ ఫోన్ రాబోతుంది. ఈ ఏడాదిలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) జరగనున్న సందర్భంగా రెడ్‌మి A4 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించేందుకు ప్లాన్ చేస్తోంది. రాబోయే ఈ కొత్త 5జీ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4ఎస్ జనరేషన్ 2 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.

ఈ ఫోన్ క్వాల్‌కామ్, షావోమీ మధ్య భాగస్వామ్యంలో చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఫస్ట్ 5జీ రెడ్‌మి ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఈ 5జీ ఫోన్ ధర రూ. 10వేల లోపు ఉంటుంది. ఈ ఫోన్ ధర షావోమీ ధృవీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఈ ఏడాది ఆఖరిలో జరుగుతుందని కంపెనీ ధృవీకరించింది. అధికారిక లాంచ్ డేట్ ఇంకా వెల్లడి కాలేదు. అయితే, ఫోన్ లాంచ్‌కు ముందు రెడ్‌మి A4 5జీ ధర, స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి.

భారత్‌లో రెడ్‌మి ఎ4 5జీ ధర :
రెడ్‌మి ఎ4 5జీ 4జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో ఒకే వేరియంట్‌లో లాంచ్ కానుంది. ఈ రెడ్‌మి ఫోన్ బ్యాంక్, లాంచ్ ఆఫర్‌లతో ధర రూ. 8,499 వరకు ఉండవచ్చు.

రెడ్‌మి ఎ4 5జీ స్పెసిఫికేషన్లు (అంచనా) :
రెడ్‌మి ఎ4 5జీ ఫోన్ 4ఎన్ఎమ్ స్నాప్‌డ్రాగన్ 4ఎస్ జనరేషన్ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. నివేదిక ప్రకారం.. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సుమారుగా 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా. ఇంకా, ఈ ఫోన్ 18డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని పుకార్లు సూచిస్తున్నాయి.

కెమెరాల విషయానికొస్తే.. రెడ్‌మి ఎ4 5జీ ఫోన్ 50ఎంపీ ప్రధాన బ్యాక్ కెమెరాను ఎఫ్/1.8 ఎపర్చర్‌తో కలిగి ఉంటుందని అంచనా. దీనితో పాటు 8ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. హైపర్‌ఓఎస్ 1.0 ఇంటర్‌ఫేస్‌తో లేయర్డ్ ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుందని అంచనా. భద్రత విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుందని భావిస్తున్నారు.

Read Also : iPhone SE 4 Leak : ఐఫోన్ 7 ప్లస్ డిజైన్‌తో కొత్త ఐఫోన్ ఎస్ఈ 4 వస్తోంది.. లాంచ్‌కు ముందే కేస్ రెండర్లు లీక్..!