iPhone SE 4 Leak : ఐఫోన్ 7 ప్లస్ డిజైన్‌తో కొత్త ఐఫోన్ ఎస్ఈ 4 వస్తోంది.. లాంచ్‌కు ముందే కేస్ రెండర్లు లీక్..!

iPhone SE 4 Leak : వచ్చే ఏడాది 20225 ప్రారంభంలో ఐఫోన్ ఎస్ఈ 4 ఫోన్ లాంచ్ కానుంది. ఫేస్ ఐడీ ఫీచర్‌తో వస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి.

iPhone SE 4 Leak : ఐఫోన్ 7 ప్లస్ డిజైన్‌తో కొత్త ఐఫోన్ ఎస్ఈ 4 వస్తోంది.. లాంచ్‌కు ముందే కేస్ రెండర్లు లీక్..!

iPhone SE 4 Leaked Case Renders Suggest Similar Design to iPhone 7 Plus ( Image Source : Google )

Updated On : October 14, 2024 / 9:18 PM IST

iPhone SE 4 Leak : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో ఆపిల్ నుంచి సరికొత్త ఐఫోన్ ఎస్ఈ 4 మోడల్ రాబోతుంది. నివేదికల ప్రకారం.. వచ్చే ఏడాది 20225 ప్రారంభంలో ఐఫోన్ ఎస్ఈ 4 ఫోన్ లాంచ్ కానుంది. ఫేస్ ఐడీ ఫీచర్‌తో వస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఐఫోన్ ఎస్ఈ (2022)కి ఇది అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వస్తుందని భావిస్తున్నారు.

Read Also : World Billionaire Rankings : ప్రపంచ బిలియనీర్ల ర్యాంకులు ఎందుకు మారుతాయంటే? అసలు కారణాలివే!

బడ్జెట్ ఐఫోన్, బేస్ ఐఫోన్ 14 మాదిరిగా అదే డిజైన్‌ను కలిగి ఉంటుందని అంచనా. అయితే, ఐఫోన్ ఎస్ఈ 4 కొత్త లీకైన కేస్ రెండర్‌లు రాబోయే ఫోన్ ఐఫోన్ 7 ప్లస్ డిజైన్ పోలికలను కలిగి ఉంటాయని సూచిస్తున్నాయి. రెండర్‌లు ఐఫోన్ ఎస్ఈ 4 ఫ్లాట్ బ్యాక్ ప్యానెల్, డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉండవచ్చు.

టిప్‌స్టర్ సోనీ డిక్సన్ ప్రకారం.. ఐఫోన్ ఎస్ఈ 4 డివైజ్ కేస్‌కు సంబంధించి రెండర్‌లను పోస్ట్ చేసారు. చైనీస్ సోషల్ మీడియాలోని లీకైన ఫొటోలను పరిశీలిస్తే.. రాబోయే ఐఫోన్ బ్యాక్ ప్యానెల్ డిజైన్‌ను సూచిస్తున్నాయి. ఈ హ్యాండ్‌సెట్ పాత ఐఫోన్ 7 ప్లస్ నుంచి డిజైన్ సూచనలను తీసుకున్నట్లు ఫొటోలు సూచిస్తున్నాయి.

ఐఫోన్ ఎస్ఈ 4 కేస్ డ్యూయల్ బ్యాక్ కెమెరాల కటౌట్‌తో ఫ్లాట్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉన్నట్లుగా కనిపిస్తుంది. గతంలో అన్ని ఐఫోన్ ఎస్ఈ మోడల్‌లు ఒకే బ్యాక్ కెమెరాతో వచ్చినందున ఈ కొత్త కెమెరా మోడల్ సిరీస్‌లో మొదటిది. రాబోయే ఐఫోన్‌లో యాక్షన్ బటన్ కాకుండా మ్యూట్ స్విచ్‌కు కటౌట్ ఉన్నట్లు కనిపిస్తోంది. కెమెరా ఐలాండ్ ఐఫోన్ 7 ప్లస్‌లోని కెమెరాను పోలి ఉంటుంది.

ఐఫోన్ ఎస్ఈ 4 స్పెసిఫికేషన్‌లు, ధర (అంచనా) :
ఐఫోన్ ఎస్ఈ 4లో ఫేస్ ఐడీ, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ఉంటుంది. ఒక సింగిల్ 48ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరాను పొందనుంది. 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.06-అంగుళాల ప్యానెల్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. గరిష్టంగా 8జీబీ ఎల్‌పీడీడీఆర్5 ర్యామ్ సహా ఆపిల్ ఎ18 చిప్‌సెట్‌లో రన్ అవుతుంది. ఆపిల్ కొత్త ఐఫోన్ ఎస్ఈ ధర 499 డాలర్లు (దాదాపు రూ. 42వేలు), 549 డాలర్లు (దాదాపు రూ. 46వేలు ) మధ్య ఉంటుంది. ఐఫోన్ ఎస్ఈ (2022) బేస్ 64జీబీ మోడల్ ధర 429 డాలర్లు (దాదాపు రూ. 35వేలు) ప్రారంభ ధర ట్యాగ్‌తో వస్తుంది.

Read Also : Honor Magic 7 Series : హానర్ మ్యాజిక్ 7 సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?