Flipkart Big Saving Days Sale starts soon, promises discounts on Pixel 7, iPhone 14 and more
Flipkart Big Saving Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ప్లాట్‌ఫారమ్‌లో త్వరలో కొత్త బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days Sale) ఈవెంట్‌ను హోస్ట్ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్‌లపై భారీ డిస్కౌంట్లను అందించనుంది. ఫ్లిప్‌కార్ట్ టీజర్ పేజీలో నథింగ్ ఫోన్ (1) వంటి కొన్ని ప్రముఖ మిడ్-రేంజ్ ఫోన్‌లపై భారీ డీల్‌లను అందిస్తామని హామీ ఇచ్చింది.
కొన్ని ఫోన్ డీల్స్ ధరలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో వెల్లడయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పిక్సెల్ 7 స్మార్ట్‌ఫోన్ రూ.47,999 డిస్కౌంట్ ధరతో అందుబాటులోకి రానుంది. కంపెనీ ఇప్పుడే పిక్సెల్ 7 సిరీస్‌ను ప్రారంభించింది. రూ. 12వేల వరకు డిస్కౌంట్ అందించే అవకాశం ఉంది. Flipkart Pixel 7 ఫోన్ మోడల్ తక్కువ ధరకు అందించనుందో వెల్లడించలేదు. కొన్ని ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ కాకుండా బ్యాంక్ కార్డ్‌ల ఆధారంగా డీల్ జరిగే అవకాశాలు ఉన్నాయి.
పిక్సెల్ 7 ప్రో ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో రూ. 68,999 ధరతో రానుంది. ప్రస్తుతం రూ. 84,999 ధర ట్యాగ్‌తో వస్తుంది. కస్టమర్లకు రూ.16వేల డిస్కౌంట్ లభిస్తుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ అందించనుంది. శాంసంగ్ కంపెనీ అందించే Samsung Galaxy Z Flip 3 2021 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కూడా ఆన్‌లైన్‌లో ధర తగ్గింపును పొందే అవకాశం ఉంది.
Flipkart Big Saving Days Sale starts soon, promises discounts on Pixel 7, iPhone 14
శాంసంగ్ Galaxy S22+, Galaxy S21 FE 5Gలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్ ఈ ప్రీమియం ఫోన్‌లను తక్కువ ధర రేంజ్‌లో అందించనుంది. Flipkart ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై డీల్స్‌తో పాటు, మిడ్-రేంజ్ ఫోన్‌లపై కూడా డిస్కౌంట్లను ఆఫర్ చేస్తుంది. నథింగ్ ఫోన్ (1) ధర రూ. 24,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం రూ.29,999 ప్రారంభ ధరతో అమ్మకానికి ఉంది.
ఈ 5G ఫోన్‌పై ప్లాట్‌ఫాం దాదాపు రూ. 5వేలు తగ్గింపును అందించాలని యోచిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) గతంలో Pixel 6a, iPhone 13 వంటి ఫోన్‌లపై భారీ డిస్కౌంట్ అందించింది. రాబోయే సేల్ ఈవెంట్‌లో కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉంది. ఈవెంట్ సేల్ తేదీని ఫ్లిప్‌కార్ట్ ఇంకా ధృవీకరించలేదు. అతి త్వరలో వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఐఫోన్ 13 ఆఫర్లు కూడా లిమిటెడ్ పిరియడ్ మాత్రమే అందుబాటులో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..