×
Ad

Flipkart Diwali Sale 2025 : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ ఆఫర్లు.. ఐఫోన్ 16, శాంసంగ్ గెలాక్సీ S25, పిక్సెల్ 9 ఫోన్లపై స్టన్నింగ్ డీల్స్.. డేట్ సేవ్ చేసి పెట్టుకోండి..!

Flipkart Diwali Sale 2025 : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ ఈ నెల 11న ప్రారంభం కానుంది. ఐఫోన్ 16, పిక్సెల్ 9, గెలాక్సీ S25పై డిస్కౌంట్లు మీకోసం..

Flipkart Diwali Sale

Flipkart Diwali Sale 2025 : పండుగ సీజన్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. అక్టోబర్ 2న ఫ్లిప్‌కార్ట్ బ్లాక్‌బస్టర్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగిసిన కొద్దిరోజులకే ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో ధమాకా సేల్‌తో రాబోతుంది. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఈ కంపెనీ అధికారికంగా బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ 2025ను ప్రకటించింది.

ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి (Flipkart Diwali Sale 2025) ఇంట్లో అవసరమైన వస్తువుల వరకు ప్రతిదానిపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 16, శాంసంగ్ గెలాక్సీ S25, గూగుల్ పిక్సెల్ 9 వంటి అనేక స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ ప్రారంభ తేదీ :
ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ అక్టోబర్ 11, 2025న అందరి యూజర్లకు అందుబాటులోకి రానుంది. అయితే, మీరు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ లేదా ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సభ్యులైతే అక్టోబర్ 10 నుంచి ముందస్తు యాక్సెస్ పొందవచ్చు. అందరికన్నా ఒక రోజు ముందుగానే సేల్ యాక్సస్ పొందవచ్చు.

Read Also : Samsung Galaxy S24 : సూపర్ ఆఫర్ బ్రో.. ఈ శాంసంగ్ ఫోన్‌‌పై భారీ డిస్కౌంట్.. ఇలాంటి ఆఫర్ మళ్లీ జన్మలో రాదు.. డోంట్ మిస్!

ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే యాప్ అంతటా బ్యానర్లు, పుష్ నోటిఫికేషన్‌ల ద్వారా సేల్ క్యాంపెయిన్ ప్రారంభించింది. పండుగ సీజన్ కావడంతో ఫ్లిప్‌కార్ట్ ప్లస్ అడ్వాన్స్ సేల్, అదనపు బెనిఫిట్స్ కోసం ఫ్రీ లాయల్టీ ప్రోగ్రామ్ కూడా అందిస్తోంది. అంతేకాదు.. ఏడాదికి రూ. 1,249 ధరతో ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ద్వారా ప్రత్యేకమైన ఆఫర్‌లు, స్పీడ్ సపోర్టు, ప్రీమియం సర్వీసులను అందిస్తుంది.

ఫ్లాగ్‌షిప్ ఫోన్లు, గాడ్జెట్‌లపై భారీ డిస్కౌంట్లు :
ఈ ఏడాదిలో దీపావళి సేల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 16, గూగుల్ పిక్సెల్ 9 సిరీస్, శాంసంగ్ గెలాక్సీ S25 లైనప్‌లపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. ఆపిల్ మ్యాక్‌బుక్ M2 వంటి ప్రీమియం ల్యాప్‌టాప్‌లతో పాటు స్మార్ట్‌వాచ్‌లు, వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు, ఇతర పాపులర్ ఎలక్ట్రానిక్స్‌పై కూడా ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్లతో అందిస్తోంది.

బ్యాంక్ ఆఫర్లు, అదనపు డిస్కౌంట్లు :
ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ బ్యాంక్‌తో క్రెడిట్, డెబిట్ కార్డ్ లావాదేవీలపై ఇన్‌స్టంట్ 10శాతం తగ్గింపును అందిస్తోంది. అదనంగా, యాక్సస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్లు ప్రత్యేకమైన క్యాష్‌బ్యాక్, రివార్డులను పొందవచ్చు.