×
Ad

Flipkart Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్.. భారీగా తగ్గిన గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

Flipkart Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో XLపై అదిరిపోయే డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Google Pixel 9 Pro XL

Flipkart Diwali Sale : పిక్సెల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ సందర్భంగా గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ ధర భారీగా తగ్గింది. ఈ పండుగ సీజన్‌లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL తగ్గింపు ధరకే కొనేసుకోవచ్చు. పిక్సెల్ 10 సిరీస్ లేటెస్ట్ మోడళ్ల కన్నా ఫ్లిప్‌కార్ట్ పిక్సెల్ 9 ప్రో XL ధరను భారీగా తగ్గించింది. ఈ సీజన్‌లో అత్యంత ఆకర్షణీయమైన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ డీల్‌ ఇదే.. ఈ ఏడాది ప్రారంభంలో రూ.1,24,999 ధరకు లాంచ్ అయింది.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ సమయంలో పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ రూ.89,999 ఫ్లాట్ డిస్కౌంట్ (Flipkart Diwali Sale) ధరకు లభిస్తోంది. అంటే.. రూ.35వేలు తగ్గింపు పొందింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు ఈ ఆఫర్ బెస్ట్ అని చెప్పొచ్చు. అదనంగా రూ.7,750 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. మొత్తంగా రూ.42,750 సేవ్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఆసక్తిగల యూజర్లు పాత స్మార్ట్‌ఫోన్‌లపై పిక్సెల్ ఫోన్ డిస్కౌంట్ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.

Read Also : Realme GT 8 Series : కొత్త రియల్‌మి GT 8 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ఎప్పుడో తెలిసిందోచ్.. ధర, డిజైన్, కెమెరా వివరాలివే!

గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.8-అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంది. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ప్రీమియం డిజైన్ హుడ్ కింద గూగుల్ టెన్సర్ G4 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 16GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ బాక్స్‌తో వస్తుంది. గూగుల్ 7 ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లను కూడా అందిస్తుంది.

కెమెరా ఫ్రంట్ సైడ్ గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. OISతో 50MP ప్రైమరీ సెన్సార్, 5x ఆప్టికల్ జూమ్‌తో 48MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 123 ఫీల్డ్ ఆఫ్ వ్యూను అందించే 48MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 42MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. 37W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5060mAh బ్యాటరీ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ అబ్సిడియన్, పింగాణీ, హాజెల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.