Realme GT 8 Series : కొత్త రియల్‌మి GT 8 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ఎప్పుడో తెలిసిందోచ్.. ధర, డిజైన్, కెమెరా వివరాలివే!

Realme GT 8 Series : రియల్‌మి జీటీ 8 సిరీస్ వచ్చేస్తోంది. ఈ నెల 21న రియల్‌మి జీటీ 8, జీటీ 8 సిరీస్ రిలీజ్ కానున్నాయి.

Realme GT 8 Series : కొత్త రియల్‌మి GT 8 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ఎప్పుడో తెలిసిందోచ్.. ధర, డిజైన్, కెమెరా వివరాలివే!

Realme GT 8 Series

Updated On : October 15, 2025 / 5:58 PM IST

Realme GT 8 Series : రియల్‌మి నుంచి సరికొత్త GT సిరీస్ ఫోన్ రాబోతుంది. చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి అక్టోబర్ 21న చైనాలో రియల్‌మి GT 8 సిరీస్‌ను లాంచ్ చేయనున్నట్టు అధికారికంగా ధృవీకరించింది. ఈ మేరకు సోషల్ మీడియా ఛానెల్‌లలో ప్రకటించింది. రాబోయే లైనప్‌లో రియల్‌మి GT 8, రియల్‌మి GT 8 ప్రో అనే రెండు మోడళ్లు ఉంటాయని భావిస్తున్నారు.

అడ్వాన్స్ ఇమేజ్ ట్యూనింగ్ కోసం (Realme GT 8 Series) టెక్ దిగ్గజం రికోతో కొత్త భాగస్వామ్యాన్ని కూడా వెల్లడించింది. రియల్‌మి GT 8 సిరీస్ రికో జీఆర్ ఇమేజింగ్ టెక్నాలజీ కలిగిన బ్రాండ్‌లో మొదటిది. ధర, డిజైన్, పర్ఫార్మెన్స్, కెమెరాలకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

రియల్‌మి జీటీ 8, జీటీ 8 ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా) :

రియల్‌మి జీటీ 8 ప్రో క్వాల్కమ్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో 2కే 10-బిట్ ఎల్టీపీఓ బీఓఈ ఫ్లాట్ ఓఎల్ఈడీ ప్యానెల్‌ కలిగి ఉంటుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. రియల్‌మి జీటీ 8 ప్రో 200MP 1/1.56-అంగుళాల శాంసంగ్ HP5 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ కలిగి ఉంటుంది.

లీక్‌ల ప్రకారం.. OISతో 50MP సోనీ LYT-808 ప్రైమరీ సెన్సార్‌తో పాటు 50MP శాంసంగ్ JN5 అల్ట్రావైడ్ కెమెరా కూడా అందించవచ్చు. ఫోకల్ లెంగ్త్‌లు, షూటింగ్ స్టైల్స్ మధ్య ఫ్లెక్సిబిలిటీని అందించే 3 ఇంటర్‌చేంజ్ కెమెరా మాడ్యూల్స్ సపోర్టు అందిస్తుందని భావిస్తున్నారు. వీటన్నింటికీ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారీ 7,000mAh బ్యాటరీ ఉండొచ్చు.

Read Also : Diwali 2025 : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ దీపావళి సేల్‌లో రూ. 25 వేల లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!

స్టాండర్డ్ రియల్‌మి జీటీ 8 స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందే అవకాశం ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల 1.5K ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. 50MP సోనీ LYT-808 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. అయితే, రియల్‌మి ప్రో మాదిరిగా కాకుండా రికో ఇమేజింగ్ టెక్‌ 8MP అల్ట్రావైడ్, 50MP టెలిఫోటో సెటప్‌ కలిగి ఉండవచ్చు. ఈ రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 16 ఆధారంగా రియల్‌మి యూఐ 7 రన్ అవుతాయి. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68+IP69 రేటింగ్‌ అందిస్తాయి.

భారత్‌లో రియల్‌మి GT 8, GT 8 ప్రో లాంచ్ తేదీ, ధర (అంచనా) :
రియల్‌మి జీటీ 8 సిరీస్ అధికారికంగా చైనాలో అక్టోబర్ 21న (భారత్ కాలమాన ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు) లాంచ్ అవుతుంది. లీక్‌ల ప్రకారం.. ఈ ఫోన్‌లు నవంబర్ రెండో వారం నాటికి భారత మార్కెట్లో వస్తాయని భావిస్తున్నారు. ధర విషయానికొస్తే.. రియల్‌మి జీటీ 8 ధర రూ.42,999 నుంచి ప్రారంభం కానుంది. రియల్‌మి జీటీ 8 ప్రో ధర రూ.62,999 నుంచి ఉండవచ్చునని అంచనా.