Diwali 2025 : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ దీపావళి సేల్‌లో రూ. 25 వేల లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!
Diwali 2025 : ఈ పండుగ సీజన్‌లో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. లాంగ్ బ్యాటరీలతో టాప్ 5 పవర్‌హౌస్ ఫోన్లపై ఓసారి లుక్కేయండి.

5 Best Phones
Diwali 2025 : కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? దీపావళి పండగ వచ్చేస్తోంది. ఈ ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ దీపావళి సేల్స్ ప్రారంభించాయి. బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. తక్కువ ఖర్చుతో హై ఎండ్ ప్రొఫైల్ ఐఫోన్లను కొనాలని అనుకుంటే ఇదే బెస్ట్ టైమ్.
మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ కోసం అద్భుతమైన పర్ఫార్మెన్స్, క్రేజీ కెమెరాలు, లాంగ్ బ్యాటరీ (Diwali 2025) లైఫ్ అందించే రూ. 25వేల లోపు ఉన్న టాప్ ఫోన్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లను పొందవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ :
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ రూ.22,322 ధరతో 6.67-అంగుళాల 120Hz డిస్‌ప్లే అందిస్తుంది. డైమెన్సిటీ 7030 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. OISతో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, స్పష్టమైన ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది. రోజువారీ మొబైల్ యూజర్లకు అద్భుతమైన ఆప్షన్.
ఒప్పో F31 :
ఒప్పో F31 ఫోన్ 8జీబీ ర్యామ్, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో 6.57-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే, 2MP లెన్స్‌తో 50MP మెయిన్ సెన్సార్, భారీ 7000mAh బ్యాటరీ ఉన్నాయి. డైమెన్సిటీ 6300 చిప్‌తో ఆధారితమైనది. ఈ దీపావళికి తప్పక కొనుగోలు చేయాల్సిన ఫోన్.
వన్‌ప్లస్ నార్డ్ CE 5 :
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5 ఫోన్ డైమెన్సిటీ 8350 అపెక్స్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 5200mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఫాస్ట్ పవర్ అప్‌లను కోరుకునే వారికి అద్భుతంగా ఉంటుంది.
ఐక్యూ నియో 10R :
ఐక్యూ నియో 10R ఫోన్ రూ. 23,869 నుంచి ప్రారంభమవుతుంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 6.78-అంగుళాల 144Hz అమోల్డ్ డిస్‌ప్లే, భారీ 6400mAh బ్యాటరీతో వస్తుంది. బడ్జెట్ ఫోన్లలో గేమర్‌లు, ఇతర యూజర్లకు అద్భుతమైన ఆప్షన్.
నథింగ్ ఫోన్ 3a :
నథింగ్ ఫోన్ (3a) 5G ఫోన్ రూ. 23,475 ధరకు లభించే 6.77-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో 2.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉంది. 38 గంటల వరకు టాక్ టైమ్‌ను అందిస్తుంది.