Diwali Sale : కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? టాప్ ప్రీమియం స్మార్ట్‌టీవీలపై ఖతర్నాక్ డిస్కౌంట్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

Diwali Sale : ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో దీపావళి సేల్స్ సందర్భంగా టాప్ ప్రీమియం స్మార్ట్‌టీవీలపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి.

Diwali Sale : కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? టాప్ ప్రీమియం స్మార్ట్‌టీవీలపై ఖతర్నాక్ డిస్కౌంట్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

Diwali Sale

Updated On : October 15, 2025 / 4:12 PM IST

Diwali Sale : కొత్త స్మార్ట్ టీవీ కొనేందుకు చూస్తున్నారా? ఈ పండుగ సీజన్‌లో అనేక బ్రాండ్ల స్మార్ట్ టీవీలపై అద్భుతమైన డిస్కౌంట్లు లభ్యమవుతున్నాయి. దేశంలోని అతిపెద్ద ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ పండుగ సేల్స్ సందర్భంగా భారీ తగ్గింపు ధరకే లభిస్తున్నాయి.

ఈ ప్లాట్‌ఫామ్‌లు స్మార్ట్‌టీవీలపై 70 శాతం వరకు (Diwali Sale) డిస్కౌంట్ అందిస్తున్నాయి. ఈ డిస్కౌంట్లతో పాటు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై 10 శాతం వరకు తగ్గింపు కూడా అందిస్తున్నాయి.

బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు టాప్ స్మార్ట్‌టీవీలివే :

  • ఫోక్స్ స్కై 55-అంగుళాల టీవీపై ఫ్లిప్‌కార్ట్ 74 శాతం తగ్గింపును అందిస్తోంది. ఈ స్మార్ట్‌టీవీ అసలు ధర రూ.98,990 ఉండగా ఇప్పుడు సేల్ సమయంలో రూ.24,999కి లభిస్తుంది.
  • అమెజాన్ టీసీఎల్ 55-అంగుళాల 4K టీవీపై 68 శాతం తగ్గింపును అందిస్తోంది. అసలు ధర రూ. 1,09,990 ఉండగా ఇప్పుడు ధర కేవలం రూ. 34,990కే లభిస్తోంది.
  • ఏసర్‌ప్యూర్ 55-అంగుళాల టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో 66 శాతం తగ్గింపుతో లభిస్తుంది. అసలు ధర రూ.80,990 నుంచి రూ.26,999 తగ్గిన ధరతో పొందవచ్చు.
  • టీసీఎల్ 55-అంగుళాల టీవీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 64 శాతం తగ్గింపుతో రూ.93,990 నుంచి రూ.32,990కి చేరుకుంది.

Read Also : Motorola Razr 60 Price : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్.. మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే అతి చౌకైన ధరకే..!

  • అమెజాన్‌లో, టీసీఎల్ 43-అంగుళాల 4K టీవీ 62 శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఇప్పుడు అసలు ధర రూ.52,990 నుంచి రూ.19,990కి లభిస్తుంది.
  • మోటోరోలా 55-అంగుళాల 4K టీవీని ఫ్లిప్‌కార్ట్‌లో 54 శాతం తగ్గింపుతో అందిస్తోంది. అసలు ధర రూ.69,999 నుంచి రూ.31,999కి తగ్గింపు పొందింది.
  • ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలుదారులు అదనంగా 10 శాతం తగ్గింపును పొందవచ్చు.
  • ఫ్లిప్‌కార్ట్ యూజర్లు ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో 10 శాతం తగ్గింపు పొందవచ్చు.
  • అమెజాన్ కొనుగోలుదారులు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుపై అదే డిస్కౌంట్ పొందవచ్చు.