Motorola Razr 60 Price : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్.. మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే అతి చౌకైన ధరకే..!

Motorola Razr 60 Price
Motorola Razr 60 Price : కొత్త మోటోరోలా ఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ సందర్భంగా అనేక ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, హోం అప్లియన్సెస్, స్మార్ట్‌ఫోన్‌లతో సహా వివిధ కేటగిరీలపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్‌లలో ఒకటి మోటరోలా రేజర్ 60 ఫోన్ ఒకటి.
ప్రస్తుతం సేల్ సందర్భంగా ఈ మోటోరోలా రెజర్ 60 ధర (Motorola Razr 60 Price) భారీగా తగ్గింది. ఈ సేల్ సమయంలో మీ బడ్జెట్ ధరలోనే కొనేసుకోవచ్చు. మోటోరోలా రెజర్ 60 ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మోటోరోలా రేజర్ 60 ఫ్లిప్‌కార్ట్ డీల్ :
భారత మార్కెట్లో మోటోరోలా రేజర్ 60 ధర రూ.49,999కు లాంచ్ అయింది. ఈ ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.39,999కు లిస్ట్ అయింది. ఈ-కామర్స్ దిగ్గజం మోటోరోలా రేజర్ 60 ఫోన్‌పై రూ.10వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఇంకా ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత ఫోన్ ట్రేడ్ చేయవచ్చు.
మోటోరోలా రేజర్ 60 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
మోటోరోలా రేజర్ 60 ఫోన్ 6.96-అంగుళాల pOLED లోపలి స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ గరిష్ట ప్రకాశం, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. బయట 90Hz రిఫ్రెష్ రేట్, 1,700 నిట్స్ గరిష్ట ప్రకాశంతో 3.63-అంగుళాల pOLED కవర్ స్క్రీన్ ఉంది.
మోటోరోలా రేజర్ 60, మీడియాటెక్ డైమెన్సిటీ 7400X చిప్‌సెట్‌తో వస్తుంది. 30W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. ఆప్టిక్స్ పరంగా, రెజర్ 60 స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా కలిగి ఉంది.