Flipkart Diwali Sale starts soon_ Big discounts on iPhone 15 Models
Flipkart Diwali Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే, మరో రెండు రోజుల వరకు ఆగండి.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రకటించింది. ప్రత్యేకించి వినియోగదారుల కోసం 2024 దీపావళి సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై అదిరే డిస్కౌంట్లు, మరెన్నో డీల్స్ ఆఫర్ చేస్తోంది.
Read Also : Amazon Diwali Sale : అమెజాన్ దీపావళి సేల్ ఆఫర్లు.. ఈ ఐక్యూ ఫోన్లపై అదిరే డిస్కౌంట్లు.. ఎప్పటినుంచంటే?
ఆపిల్ ఐఫోన్ సహా మోటోరోలా, పోకో, షావోమీ, వన్‌ప్లస్ నుంచి అనేక ఫోన్‌లపై ప్లాట్‌ఫారమ్ ఆకర్షణీయైన డీల్‌లను వెల్లడించింది. సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఐఫోన్ 15 మోడల్‌లు కూడా భారీ తగ్గింపులు ఉంటాయని ధృవీకరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఐఫోన్ 15 సిరీస్‌పై ప్లాట్ డిస్కౌంట్లు :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఐఫోన్ 15 ప్రో ధర రూ.99,999కి తగ్గుతుంది. అదే ఫోన్ ప్రస్తుతం రూ. 1,09,900కి అమ్మకానికి ఉంది. అంటే.. ఐఫోన్ 15 ప్రోలో వినియోగదారులు రూ. 9,901 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5వేల అదనపు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్‌పై రూ. 5వేల తగ్గింపును కూడా అందించనుంది. తద్వారా ఈ ఐఫోన్ ధరను రూ. 89,999కి తగ్గిస్తుంది.
రాబోయే దీపావళి సేల్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండే రెగ్యులర్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందించనుంది. మీరు ఈ ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్‌ను పొందవచ్చు. అదనంగా, ఎక్స్ఛేంజ్ ఆఫర్ లేకపోయినా ఈ ఫోన్ ధర రూ. 94,999గానే ఉంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ ధర రూ. 1,09,900 అవుతుంది.
ఈ ఫోన్ భారత మార్కెట్లో రూ. 1,59,900కి అందుబాటులో ఉండనుంది. ఇదే బెస్ట్ ఐఫోన్ డీల్స్ కానుంది. ఇప్పటికే, ఆపిల్ పాత ఐఫోన్ ధరలను భారీగా తగ్గించింది. ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు భారత మార్కెట్లో దీపావళి పండుగ ప్రారంభమయ్యే ముందు ఐఫోన్ 15 సిరీస్‌పై మరిన్ని తగ్గింపులను అందించనున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ సేల్ వివరాల ప్రకారం.. :
ఐఫోన్ 15ప్రో మ్యాక్స్‌పై ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ. 1,34,900కు అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో సేల్ ధర రూ. 1,19,900, అదనంగా రూ. 5వేల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌తో ధర రూ.1,14,900కి తగ్గుతుంది.
ఇప్పుడు, సాధారణ 15 ప్రో మోడల్ మాదిరిగానే ఇక్కడ కూడా ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ వర్తిస్తుంది. ప్రభావవంతంగా రూ. 1,09,900కి తగ్గుతుంది. స్టాండర్డ్ మోడల్స్ విషయానికొస్తే.. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ డీల్ ధరలను ఫ్లిప్‌కార్ట్ ఇంకా వెల్లడించలేదు. ఏదేమైనప్పటికీ, ఐఫోన్ ప్రో మోడల్‌లను ప్రస్తుత సేల్ డీల్స్ కన్నా తక్కువ ధరకు అందజేయనుంది. స్టాండర్డ్ వెర్షన్‌లలో కూడా అదే ఆఫర్ వర్తిస్తుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 రూ. 63,999కి జాబితా అయింది. ఐఫోన్ 15 ప్లస్ ధర రూ.73,999కి అందుబాటులో ఉంది. ఈ స్టాండర్డ్ మోడల్ రూ. 60వేల లోపు ప్లస్ రూ. 70వేల లోపు అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ బేస్ ఐఫోన్ 15 మోడల్స్ కచ్చితమైన డీల్ ధరలను ఇంకా వెల్లడించలేదు.