Flipkart Mobiles Bonanza Sale starts
Flipkart Mobiles Bonanza Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ లేటెస్ట్ మొబైల్స్ బొనాంజా సేల్ సందర్భంగా అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్ నవంబర్ 21 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో ఇ-కామర్స్ దిగ్గజం ఐఫోన్ 15, వన్‌ప్లస్ 12 వంటి అనేక పాపులర్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
పోకో ఎక్స్6, మోటో జీ85, సీఎమ్ఎఫ్ ఫోన్ 1, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఫోన్లను డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు. మీరు కొత్త ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే.. కొన్ని బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.
ఐఫోన్ 15పై భారీ తగ్గింపు :
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 (128జీబీ స్టోరేజ్) మోడల్ రూ. 57,749 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. అధికారిక ఆపిల్ స్టోర్ల ప్రకారం ఐఫోన్ 15 అసలు రిటైల్ ధర రూ.69,900 కావడం గమనార్హం. ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా ఈ ఐఫోన్‌పై ఆసక్తిగల వినియోగదారులు రూ.12,151 భారీ డిస్కౌంట్ పొందవచ్చు.
ఆపిల్ ఇంటిలిజెన్స్ కోరుకునే యూజర్లు కొత్త ఐఫోన్ 16ని కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఐఫోన్ ప్రారంభ ధర రూ. 79,900 వద్ద అందుబాటులో ఉంది. అయితే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ ద్వారా రూ. 74,900 ధరతో కొనుగోలు చేయొచ్చు. ఆండ్రాయిడ్ పరంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్23 రూ. 41,999కి విక్రయిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ధర రూ. 59,145కు అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్ సమయంలో వన్‌ప్లస్ 12 రూ.59,884కి విక్రయిస్తోంది.
అమెజాన్ సేల్ సమయంలో పోకో ఎక్స్6 ధర రూ. 18,999 వద్ద అందుబాటులో ఉంది. ప్రారంభ ధర రూ. 21,999 నుంచి తగ్గింది. మోటో జీ85 అసలు ప్రారంభ ధర రూ. 17,999 వద్ద జాబితా అయింది. బ్యాంక్ కార్డ్‌లతో ఈ ఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్ పొందవచ్చు. ఉదాహరణకు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు ఈఎంఐ లావాదేవీలపై రూ. 1,200 డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ఈ ఫోన్ ధర రూ.16,799కి తగ్గుతుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో సీఎమ్ఎఫ్ ఫోన్ 1 తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ ఫోన్ రూ. 14,999 వద్ద కొనుగోలు చేయొచ్చు. నథింగ్ ఫోన్ (2)ని కొనుగోలు చేసే యూజర్లు రూ.36,999 తగ్గింపు ధరతో పొందవచ్చు. ఈ ఫోన్ భారత మార్కెట్లో రూ. 44,999కి లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్ రూ. 8వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో అనేక స్మార్ట్‌ఫోన్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.