×
Ad

Flipkart Republic Day Sale 2026 : ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026.. ఆపిల్ ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 16పై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. ఏ మోడల్ ధర ఎంతంటే?

Flipkart Republic Day Sale 2026 : ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026 సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ డీల్స్ ఎలా పొందాలంటే?

Flipkart Republic Day Sale 2026 (Image Credit To Original Source)

  • ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్ 2026 ఆఫర్లు, డిస్కౌంట్లు
  • ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 16పై అద్భుతమైన ఆఫర్లు
  • డైరెక్ట్ డిస్కౌంట్లతో ఇతర బ్యాంక్ డీల్స్, ఈఎంఐ ఆప్షన్లు

Flipkart Republic Day Sale 2026 : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేవారికి అదిరిపోయే డీల్స్.. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026 సందర్భంగా ఐఫోన్ మోడళ్లపై అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్లు, ఇతర హోం అప్లియన్సెస్‌పై భారీగా తగ్గింపు పొందవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఐఫోన్ కొంటే అదనంగా 10శాతం తగ్గింపు పొందవచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా ఈఎంఐ కార్డులతో రూ. 400 తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యూజర్లు సూపర్‌కాయిన్‌లు కూడా పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదే మీకు అద్భుతమైన ఛాన్స్.. ఈ సేల్ సమయంలో లేటెస్ట్ ఐఫోన్ 17 మోడల్, ఐఫోన్ 16, ఐఫోన్ ఎయిర్ వంటి ఐఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. డైరెక్ట్ డిస్కౌంట్లతో పాటు ఇతర బ్యాంక్ డీల్స్, ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ సేల్ నుంచి ఐఫోన్ ఆఫర్లపై ఓసారి లుక్కేయండి..

ఐఫోన్ 17 :
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే డీల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 17 కేవలం రూ. 74,900కు ఇంటికి తెచ్చుకోవచ్చు. బ్యాంక్ డిస్కౌంట్లతో ఇంకా తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో అదనంగా రూ. 4వేలు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు.

అలాగే, ఈఎంఐ ద్వారా నెలకు రూ.6,909తో ఈ ఐఫోన్‌ ఆర్డర్ పెట్టుకోవచ్చు. సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే 6.3 అంగుళాలతో వస్తుంది. 18MP ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ 48MP బ్యాక్ కెమెరా ఉంది. పర్ఫార్మెన్స్ పరంగా ఆపిల్ A19 చిప్ సపోర్టు అందిస్తుంది.

Flipkart Republic Day Sale 2026 (Image Credit To Original Source)

ఐఫోన్ 16 :
ఫ్లిప్‌కార్ట్ డీల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 16 కేవలం రూ. 56,999కు కొనేసుకోవచ్చు. బ్యాంక్ డీల్స్ ద్వారా ఇంకా తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 4వేలు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు.

Read Also : Best Airtel Plans : పండగ చేస్కోండి.. ఎయిర్‌టెల్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. 1.5GB రోజువారీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ..

ఈఎంఐ ద్వారా నెలకు రూ. 2,458తో ఈ ఐఫోన్‌ తీసుకోవచ్చు. సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే 6.1 అంగుళాలు ఉంటుంది. 12MP ఫ్రంట్ కెమెరా, 48MP + 12MP డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఆపిల్ A18 చిప్ సపోర్టు చేస్తుంది.

ఐఫోన్ ఎయిర్ :
ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ధర రూ. 99,900కు లభిస్తోంది. 16శాతం తగ్గింపుతో రూ. 17వేల వరకు నేరుగా డిస్కౌంట్ కూడా పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్లలో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో అదనంగా రూ.4వేలు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

ఈఎంఐ ద్వారా నెలకు రూ. 3,513తో ఈ ఐఫోన్‌ ఎయిర్ కొనేసుకోవచ్చు. ఐఫోన్ సూపర్ రెటినా XDR డిస్‌ప్లే 6.5 అంగుళాలతో వస్తుంది. 18MP ఫ్రంట్ కెమెరా, 48MP బ్యాక్ కెమెరా, ఆపిల్ A19 చిప్ సపోర్టు అందిస్తుంది.