Flipkart Sale 2026 : వావ్.. వివో T5 ప్రో 5Gపై భారీ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొంటే రూ. 14,850 తగ్గింపు..!
Flipkart Sale 2026 : కొత్త వివో ఫోన్ కొనేవారికి పండగే.. వివో టీ5 ప్రో 5జీపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. రూ. 36,999 ధరకు ఈ ఫోన్ బ్యాంక్ ఆఫర్‌తో రూ. 35,149కే సొంతం చేసుకోవచ్చు.
- Sreehari A
- Published on- October 20, 2026 / 01:07 PM IST
Vivo T5 Pro 5G Price
- వివో టి5 ప్రో 5జి 6.83-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే
- 9020mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా సెటప్
- సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా
Flipkart Sale 2026 : స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి అదిరిపోయే ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ సేల్ 2026లో వివో టీ5 ప్రో 5జీ ఆకర్షణీయమైన ధరకు అందుబాటులో ఉంది. భారీ బ్యాటరీ, హై-రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది. ఈ ఫోన్‌పై బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. వివో ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..
వివో టీ5 ప్రో 5జీ ధర ఎంతంటే? :
ఫ్లిప్‌కార్ట్‌లో వివోT5 ప్రో 5జీ ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.36,999గా ఉంది. ఈ వేరియంట్ ప్రారంభ ధర రూ. 49,999తో పోలిస్తే ఇప్పటికే రూ. 13వేలు తగ్గింది. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంకు క్రెడిట్ కార్డులతో రూ. 1,850 డిస్కౌంట్ లభిస్తుంది.
Read Also : Apple iPhone 16 : ఆపిల్ ఐఫోన్ 16పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఇలా కొంటే ఏకంగా రూ.15,901 ఆదా!
ఈ ఆఫర్ వర్తిస్తే.. వివో ఫోన్ ధర రూ. 35,149కు తగ్గుతుంది. ప్రారంభ ధరతో పోలిస్తే మొత్తం రూ. 14,850 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే, బ్యాంక్ ఆఫర్ నిబంధనలు, అర్హతలను బట్టి తగ్గింపు ఉంటుంది.
వివో T5 ప్రో 5జీ ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 2392 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.83 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో వీడియోలు చూడటం, గేమింగ్ చేయడం మరింత ఆకర్షణీయంగా ఉండనుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6పై రన్ అవుతుంది. ఇందులో 9020mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
ఫొటోగ్రఫీ కోసం OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ కెమెరా బ్యాక్ సైడ్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందించారు. 5G, బ్లూటూత్ 5.4, Wi-Fi, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్‌బీ టైప్-సి 3.0 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
మొత్తంగా, భారీ బ్యాటరీ, పవర్ ఫుల్ డిస్‌ప్లే, ఆకర్షణీయమైన ధర కోరుకునేవారికి ఈ డీల్ అద్భుతంగా ఉంటుంది. కొనుగోలు చేసే ముందు ఫ్లిప్‌కార్ట్‌లో లేటెస్ట్ ధర, స్టాక్, బ్యాంక్ ఆఫర్లను ఓసారి చెక్ చేయడం బెటర్..
