Flipkart Super Value Week Sale
Flipkart Super Value Week Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘సూపర్ వాల్యూ వీక్’ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ సమయంలో అనేక ఫోన్లపై డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌లో 55-అంగుళాల LED స్మార్ట్ టీవీని సగం కన్నా తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు. టీసీఎల్, రియల్‌మి, షావోమీ, మోటోరోలా వంటి మెయిన్ బ్రాండ్‌ల స్మార్ట్ టీవీలు 61శాతం వరకు తగ్గింపుతో లభిస్తాయి.
ధర తగ్గింపు తర్వాత స్మార్ట్ టీవీని కొనుగోలు చేసేటప్పుడు (Flipkart Super Value Week Sale) మీరు బ్యాంక్ ఆఫర్ల నుంచి అనేక బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ స్మార్ట్‌టీవీలు LED స్క్రీన్‌లు, ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫామ్ అనేక ప్రీ-ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లతో వస్తాయి. అయితే, ఏయే స్మార్ట్ టీవీలపై ఎలాంటి బంపర్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..
ఈ టీసీఎల్ స్మార్ట్‌టీవీ ఈ ఏడాది 2025లో లాంచ్ అయింది. ఈ 55-అంగుళాల ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 61శాతం డిస్కౌంట్‌తో లభిస్తుంది. ఫస్ట్ టైమ్ రూ.77,999 ధరకు లభించిన ఈ స్మార్ట్ టీవీ ఇప్పుడు కేవలం రూ.29,990కే లభిస్తుంది. అదనంగా, మీరు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీలో ఎంఈఎంసీ డాల్బీ విజన్ అట్మోస్ వంటి ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి.
Read Also : Vivo Y31 5G Phone : పండగ చేస్కోండి.. ఈ ధరకు 5G ఫోన్ దొరుకుతుందా? వివో Y31 ఫీచర్స్ చూస్తే నమ్మలేరు!
2. షియోమి ఎఫ్ ప్రో :
ఈ షావోమీ స్మార్ట్ టీవీ కేవలం రూ. 34,999కే లభిస్తుంది. ఈ స్మార్ట్‌టీవీ అసలు ధర రూ. 62,999 ఉండగా 44 శాతం తగ్గింపుతో లభిస్తోంది. 2025లో లాంచ్ అయిన ఈ మోడల్ భారీ 34W స్పీకర్లతో వస్తుంది. పవర్‌ఫుల్ సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. అద్భుతమైన ఫొటో క్వాలిటీని అందించే UHD 4K డిస్‌ప్లేతో సహా అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తుంది.
3. రియల్‌మి టెక్‌లైఫ్ :
రియల్‌మి టెక్‌లైఫ్ నుంచి వచ్చిన ఈ 55-అంగుళాల ఎల్ఈడీ స్మార్ట్ టీవీ కూడా అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ రూ. 63,999కు వస్తుంది. కానీ, మీకు 57శాతం బంపర్ డిస్కౌంట్ లభిస్తోంది. మీరు ఈ స్మార్ట్‌టీవీని ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 26,999కు ఇంటికి తెచ్చుకోవచ్చు. మీ స్మార్ట్‌టీవీ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్ల నుంచి కూడా అనేక బెనిఫిట్స్ పొందవచ్చు. సేల్ సమయంలో ధర భారీ తగ్గింపు ధరకే కొనేసుకోవచ్చు.
4. మోటోరోలా 4K LED స్మార్ట్ టీవీ :
మోటోరోలా 55-అంగుళాల 4K LED స్మార్ట్ టీవీ 49శాతం వరకు తగ్గింపుతో లభిస్తుంది. అసలు ధర రూ. 59,899 నుంచి ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 29,999కే ఇంటికి తెచ్చుకోవచ్చు. గూగుల్ టీవీ ప్లాట్‌ఫామ్ అద్భుతమైన ఆడియో ఎక్స్‌పీరియన్స్ అందించే 48W స్పీకర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.