Samsung Galaxy S24 FE : ఫ్లిప్‌కార్ట్‌లో వాలెంటైన్స్ డే సేల్.. ఈ శాంసంగ్ ఫోన్‌పై రూ. 20వేలు తగ్గింపు.. ఇలా కొన్నారంటే?
Samsung Galaxy S24 FE : ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్. శాంసంగ్ యూజర్లు ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనుగోలుపై రూ. 20వేలు తగ్గింపుతో పొందవచ్చు.
- Sreehari A
- Published On : February 8, 2026 / 03:17 PM IST
Samsung Galaxy S24 FE
- శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ కేవలం రూ.39,999కే
- ఫ్లిప్‌కార్ట్‌లో వాలెంటైన్స్ డే సేల్ ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు
- 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్‌పై 33 శాతం తగ్గింపు
Samsung Galaxy S24 FE : శాంసంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త శాంసంగ్ ఫోన్ కావాలా? అయితే మీకోసం అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో వాలెంటైన్స్ డే సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది.
మీరు బ్యాంక్ డిస్కౌంట్లతో ఈ శాంసంగ్ ఫోన్ ఇంకా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. కెమెరా, పవర్‌ఫుల్ 5000mAh బ్యాటరీ, వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ ఇలా కొన్నారంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు సేవ్ చేయొచ్చు.
8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్‌పై 33 శాతం తగ్గింపు పొందవచ్చు. ఈ శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ అసలు ధర రూ. 59,999 ఉండగా ఇప్పుడు కేవలం రూ. 39,999కే లభిస్తోంది. అంతేకాదు.. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ఈ అనేక కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. అదనపు ఆఫర్లతో ధర మరింత తగ్గతుంది.
అద్భుతమైన బ్యాంక్ ఆఫర్లు :
బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ. 2వేలు తగ్గింపుతో లభిస్తోంది. రూ. 38,100 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో పొందవచ్చు. మీ బడ్జెట్ ధరలో చూస్తుంటే రూ. 6667 నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ ఫీచర్లు :
శాంసంగ్ ఫోన్ డిస్‌ప్లేలో 6.7-అంగుళాల ఫుల్ HD ప్లస్ స్క్రీన్ అందిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. పర్ఫార్మెన్స్, మల్టీ టాస్కింగ్ కోసం ఎక్సినోస్ 2400e ప్రాసెసర్‌తో వస్తుంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా వన్ యూఐ 6పై రన్ అవుతుంది.
కెమెరా ఫీచర్లు, బ్యాటరీ లైఫ్ :
ఈ మొబైల్ ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 8MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 10MP కెమెరా ఉంది.
పవర్ విషయానికి వస్తే.. 4,700mAh బ్యాటరీతో వస్తుంది. 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం Wi-Fi, జీపీఎస్, బ్లూటూత్ వంటి అనేక ఫీచర్లతో వస్తుంది.
