IRCTC అకౌంట్ పాస్‌వర్డ్ మరిచిపోయారా? ఇలా రీసెట్ చేసుకోండి!

ఐఆర్ సీటీసీ ప్లాట్ ఫాం ద్వారా రైల్వే ప్రయాణికులు తమ టికెట్ రిజర్వు చేసుకోవచ్చు. కానీ, దీనికి IRCTC అకౌంట్ ఉండాలి. ఒకవేళ అకౌంట్ ఉండి.. పాస్ వర్డ్ మర్చిపోతే.. తిరిగి ఇలా పొందండి.

Forgot IRCTC ID-password : రైల్వే రిజర్వేషన్ టికెట్ బుకింగ్ చేసుకోవాలా? అయితే మీకు ఐఆర్‌సీటీసీ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. రైల్లో ప్రయాణించేవారు ముందుగా రిజర్వేషన్ చేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా రైలు టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. ప్రత్యేకించి పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో సీట్లు దొరకడం కష్టం. అప్పుడు ముందుగా రిజిర్వేషన్ చేసుకోవడం ద్వారా సీటు రిజర్వ్ చేసుకోవచ్చు.
Nokia T20 Tablet: భారత్‌కు నోకియా T20 ట్యాబ్లెట్.. ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి సేల్.. ధర ఎంతంటే?

ఐఆర్ సీటీసీ ప్లాట్ ఫాం ద్వారా రైల్వే ప్రయాణికులు తమ టికెట్ రిజర్వు చేసుకోనే అవకాశం ఉంది. ఇందుకోసం IRCTC అకౌంట్ కలిగి ఉండాలి. ఒకవేళ అకౌంట్ ఉండి.. పాస్ వర్డ్ మర్చిపోతే.. తిరిగి ఎలా పొందాలో తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకోండి. ఈ సింపుల్ టిప్స్ ద్వారా సులభంగా IRCTC పాస్ వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..

పాస్‌వర్డ్ రీసెట్ చేయండిలా :
* ముందుగా.. IRCTC అధికారిక వెబ్‌సైట్‌ విజిట్ చేయండి.
* మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ లాగిన్ ఐడిని ఎంటర్ చేయండి.
* మీకు అక్కడే Forgot Password అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
* మీ రిజిస్టర్డ్ ఈ-మెయిల్, IRCTC యూజర్ ఐడీ, పుట్టిన తేదీ, Captcha కోడ్ ఎంటర్ చేయాలి.
* IRCTC రిజిస్టర్డ్ ఈమెయిల్‌కు మెయిల్ వస్తుంది. ఆ లింకు ద్వారా మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఈజీగా రీసెట్ చేసుకోండి.
* ఐఆర్‌సీటీసీ అకౌంట్లోకి లాగిన్ కాగానే మీకు బాగా గుర్తుండే స్ట్రాంగ్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత Ok చేయండి.
* మీ కొత్త పాస్‌వర్డ్ క్రియేట్ అయినట్టే..
* మీ IRCTC అకౌంట్ కొత్త పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
KTR France : పెట్టుబడులే లక్ష్యంగా..మంత్రి కేటీఆర్ ఫ్రాన్స్‌‌ టూర్

ట్రెండింగ్ వార్తలు