KTR France : పెట్టుబడులే లక్ష్యంగా..మంత్రి కేటీఆర్ ఫ్రాన్స్‌‌ టూర్

ఫ్రాన్స్ లో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే పనిలో బిజీగా ఉన్నారు.

KTR France : పెట్టుబడులే లక్ష్యంగా..మంత్రి కేటీఆర్ ఫ్రాన్స్‌‌ టూర్

Minister Ktr

Minister KTR France : ఫ్రాన్స్ లో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే పనిలో బిజీగా ఉన్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు, సీఈవోలుతో భేటీ అవుతున్నారు కేటీఆర్. ఫ్రెంచ్‌ సెనేట్‌లో జరిగే యాంబిషన్‌ ఇండియా ఫోరం సమావేశంలో ఆయన కీలకోపన్యాసం చేయనున్నారు. కేటీఆర్ ఉపన్యాసంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. కోవిడ్‌ తర్వాత భారత్‌-ఫ్రెంచ్‌ సంబంధాలు అభివృద్ధి అంశాలపై కేటీఆర్ తన అభిప్రాయాలు పంచుకోనున్నారు. రెండు దేశాలకు చెందిన 7 వందల మందికి పైగా పారిశ్రామిక, వాణిజ్య వేత్తలు, 4వందలకు పైగా కంపెనీల అధిపతులు, ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారు.

 

ఐదు రోజుల టూర్‌లో భాగంగా 2021, అక్టోబర్ 28వ తేదీ గురువారం మంత్రి కేటీఆర్‌…మిస్సైల్స్‌ ఎంబీడీఏ కంపెనీ ప్రతినిధులు, ఏరో క్యాంపస్‌ అక్విటిన్‌ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై..ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి కేటీఆర్‌ వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యటించాలని ఎంబీడీఏ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించారు.ఫ్రాన్స్ లోని భారత రాయబారి జావెద్‌ అష్రఫ్‌తో భేటీ అయ్యారు కేటీఆర్. ఫ్రెంచ్‌ కంపెనీలకు అవకాశం ఉన్న రంగాల గురించి వివరించారు.

 

అలాగే పారిస్‌లో కాస్మోటిక్‌ వ్యాలీ డిప్యూటీ సీఈఓ ఫ్రాంకీ బెచెరోతోనూ సమావేశం జరిగింది. భారత్‌లో సౌందర్య సాధనాల మార్కెట్‌, గణనీయమైన వృద్ధితో పాటు తెలంగాణలో కాస్మోటిక్‌ తయారీకి ఉన్న అవకాశాలను వివరించారు.రెండో రోజు పర్యటనలో భాగంగా..పలు ఫ్రెంచ్ వ్యాపార సంస్థల అధినేతలతో మంత్రి కేటీఆర్ బృందం సమావేశమవుతూ..బిజీ బిజీగా గడిపింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వారికి వివరించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు రంగాల్లో సాధించిన విజయాలను వారికి వివరించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ క్యాంపస్ స్టేషన్ ను కేటీఆర్ బృందం పరిశీలించింది. వీ హబ్, టీ వర్క్స్, టీ హబ్ వంటి తెలంగాణ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ సంస్థలతో సహకారం గురించి వివరించారు. వాస్తవానికి రైల్వే డిపోగా ఉన్న ఈ కేంద్రాన్ని ఇంక్యుబేటర్ గా మార్చారు. ఏడీపీ ఛైర్మన్, సీఈవో అగస్టిన్ డి రోమనెట్ తో కేటీఆర్ సమావేశమయ్యారు. దేశంలో విమానయానరంగంలో ఉన్న అవకాశాలను కేటీఆర్ వారికి వివరించారు. ఏరోస్పేస్ రంగానికి నాణ్యమైన సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సి అవసరాన్ని వారికి తెలిపారు. అంతేగాకుండా…ఫ్రాన్స్ లో అతిపెద్ద ఎంప్లాయర్ ఫెడరేషన్ అయిన..మూవ్ మెంట్ ఆఫ్ ఎంటర్ ఫ్రైజెస్ ఆఫ్ ప్రాన్స్ డిప్యూటీ సీఈవో జెరాల్డిన్ లెమ్లేతో మంత్రి కేటీఆర్ బృందం భేటీ అయ్యింది. తెలంగాణలో పెట్టబడి అవకాశాలను వారికి వివరించారు.

 

Minister Ktr France