అలా చేస్తే రూ.51 క్యాష్ బ్యాక్.. WhatsApp యూజర్లకు అదిరిపోయే ఆఫర్

ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవలే మన దేశంలో యూపీఐ ఆధారిత పేమెంట్స్‌ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిదే. కాగా, యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు అదిరిపోయే ఆఫర్..

అలా చేస్తే రూ.51 క్యాష్ బ్యాక్.. WhatsApp యూజర్లకు అదిరిపోయే ఆఫర్

Whatsapp

WhatsApp : ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవలే మన దేశంలో యూపీఐ ఆధారిత పేమెంట్స్‌ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిదే. కాగా, యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు క్యాష్‌బ్యాక్‌ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. గతంలో గూగుల్ పే, ఫోన్ పే అనుసరించిన మార్గానే ఇప్పుడు వాట్సాప్ వెళ్తోంది. క్యాష్ బ్యాక్ లతో కస్టమర్లను అట్రాక్ట్ చేయనుంది.

ఆండ్రాయిడ్‌లో వాట్సాప్‌ బీటా వినియోగదారులకు ‘గివ్‌ క్యాష్‌, గెట్‌ రూ.51’ పేరుతో బ్యానర్‌ కనిపిస్తుంది. వారు నచ్చిన ఐదుగురికి యూపీఐ ద్వారా డబ్బులు పంపిస్తే వెంటనే వారికి రూ.51 క్యాష్‌బ్యాక్‌ను వాట్సాప్‌ అందిస్తోంది. ఇంత మొత్తం పంపాలన్న కండీషన్ ఏమీ లేదు. ఒకవేళ రూపాయి పంపించినా రూ.51 చొప్పున క్యాష్‌బ్యాక్‌ అందుతోంది. పేమెంట్‌ పూర్తయిన కాసేపటికే క్యాష్‌బ్యాక్‌ మొత్తం అకౌంట్‌లో జమ అవుతుంది. అయితే, క్యాష్‌బ్యాక్‌ సదుపాయం గరిష్ఠంగా ఐదుగురికి పంపడానికే వర్తిస్తుంది.

PF ఖాతాదారులకు కేంద్రం దీపావళి కానుక… 8.5శాతం వడ్డీకి ఆమోదం

ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లకు ఈ ఆఫర్‌ అందిస్తోంది. త్వరలో అందరికీ ఈ క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. పేమెంట్‌ సేవలను ప్రారంభించిన తొలి రోజుల్లో గూగుల్‌ పే కూడా స్క్రాచ్‌ కార్డుల రూపంలో క్యాష్‌బ్యాక్‌ ( వెయ్యి రూపాయల వరకు స్క్రాచ్ కార్డులు) అందించి పెద్ద సంఖ్యలో వినియోగదారులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పేటీఎం, ఫోన్‌ పే సైతం ఇదే రూట్లో వెళ్లాయి. ఇప్పుడు వాట్సాప్‌ సైతం అదే తరహాలో కస్టమర్లను అట్రాక్ట్ చేసే ప్రయత్నంలో ఉంది.

Cooked Vegetables : ఉడికించిన కూరగాయలు ఆరోగ్యానికి మంచిదేనా?..

ప్రస్తుతం గూగుల్ పే క్యాష్ బ్యాక్ ఇవ్వడం బాగా తగ్గించేంది. ఆ స్థానంలో కూపన్లు ఇస్తోంది. వాటి ద్వారా ఏదైనా కొనుగోలు చేస్తే డిస్కౌంట్ లభిస్తుంది. వాట్సాప్ యాప్ లో చాట్ బార్ రైట్ సైడ్ లో పేమెంట్ షార్ట్ కట్ బటన్ కనిపిస్తుంది. వాట్సాప్ పే రూపీ సింబల్ లో ఆ షార్ట్ కట్ ఉంటుంది.