PF ఖాతాదారులకు కేంద్రం దీపావళి కానుక… 8.5శాతం వడ్డీకి ఆమోదం

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్యనిధి (ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్ ఫండ్‌-ఈపీఎఫ్‌)పై 8.5శాతం వడ్డీ ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం..

PF ఖాతాదారులకు కేంద్రం దీపావళి కానుక… 8.5శాతం వడ్డీకి ఆమోదం

Pf Interst

PF Interst : దీపావళి పండుగ సమయాన పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్యనిధి (ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్ ఫండ్‌-ఈపీఎఫ్‌)పై 8.5శాతం వడ్డీ ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనిపై త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌పై 8.5శాతం చొప్పున వడ్డీ జమ చేయాలని ఈ ఏడాది మార్చిలోనే ఈపీఎఫ్‌వో నిర్ణయ మండలి కేంద్ర ట్రస్టీల బోర్డుకు ప్రతిపాదించింది. ఇందుకు కార్మిక శాఖ కూడా సమ్మతించింది. తాజాగా ఈ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థికశాఖ నుంచి ఆమోదం లభించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. 5కోట్లకు పైగా ఈపీఎఫ్‌ చందాదారులకు త్వరలోనే ఈ వడ్డీని జమ చేసే అవకాశాలున్నాయి.

Vitamin Deficiency : ఆ.. విటమిన్ లోపిస్తే… మతిమరుపు, గుండె సమస్యలు..!

ఇకపోతే.. పీఎఫ్‌పై 8.5శాతం వడ్డీరేటు.. గత ఏడేళ్లలో ఇదే తక్కువ కావడం గమనార్హం. 2018-19, 2016-17లో 8.65శాతం చొప్పున వడ్డీ జమ చేయగా.. 2013-14, 2014-15లో 8.75శాతం చొప్పున ఇచ్చారు. 2015-16లో 8.8శాతం చొప్పున జమచేశారు. అయితే కొవిడ్‌ సమయంలో విత్‌డ్రాలు పెరగడం, ఖాతాదారుల నుంచి జమయ్యే సొమ్ము తగ్గిపోవడంతో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీని 8.5శాతానికి తగ్గించారు.

ఈపీఎఫ్ ఖాతా కలిగిన ప్రతీ చందాదారుడు తమ ఖాతాలోని బ్యాలెన్స్‌ను ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక చిన్న SMS పంపడం ద్వారా EPF ఖాతా బ్యాలెన్స్‌ను చెక్ చేయవచ్చు. “EPFOHO UAN ENG”(చివరి మూడు అక్షరాలు మీరు ఎంచుకున్న భాషకు ప్రాతినిథ్యం వహిస్తాయి) అని టైపు చేసి 7738299899కు ఎస్ఎమ్ఎస్ పంపాలి. మీ పీఎఫ్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ వివరాలతో కూడిన ఒక ఎస్ఎంఎస్ మీకు వస్తుంది.

Cooked Vegetables : ఉడికించిన కూరగాయలు ఆరోగ్యానికి మంచిదేనా?..

అంతే కాకుండా సింపుల్ గా ఒక మిస్డ్ కాల్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. పీఎఫ్ అకౌంట్ కు ఏ మొబైల్ నంబర్ లింక్ అయి ఉందో దాని నుంచి 011-22901406 కు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. కొన్ని సెకన్ల తర్వాత మన పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉందో మెసేజ్ రూపంలో వచ్చేస్తుంది. ఈ సౌకర్యం కెవైసీ పూర్తి చేసుకున్న చందాదారులకు మాత్రమే వర్తిస్తుంది.

ఆన్ లైన్ ద్వారా ఇలా తెలుసుకోండి:
పీఎఫ్ఓ మెంబర్ పాస్ బుక్ పోర్టల్ (https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login)లో UAN నెంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ సేవలను పొందడానికి యూఏఎన్‌ నంబర్‌తో అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌నే వాడాలి.