Cooked Vegetables : ఉడికించిన కూరగాయలు ఆరోగ్యానికి మంచిదేనా?..

ఉడికించిన కూరగాయలు తినడం కారణంగా గా మనం జీర్ణప్రక్రియ చాలా మెరుగుపడుతుంది. కూరగాయలలో ఉండే కాంప్లెక్స్ కాంపౌండ్స్ కారణంగా మనం తిన్న ఆహారం ముక్కలు ముక్కలుగా మారి త్వరగా జీర్ణం కావటం

Cooked Vegetables : ఉడికించిన కూరగాయలు ఆరోగ్యానికి మంచిదేనా?..

Cooked Vegetables

Updated On : October 29, 2021 / 4:24 PM IST

Cooked Vegetables : మనం నిత్యం తీసుకునే ఆహారంలో కూరగాయలు అధిక ప్రాధాన్యత కలిగి ఉంటాయి. కూరగాయలు లేకుండా మనం ఎలాంటి ఆహారం తీసుకోలేని పరిస్ధితి. మన జీవితంలో కూరగాయలు అంతర్భాగమని చెప్పొచ్చు. కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఉడికించిన కూరగాయలను అలాగే ఆకుపచ్చని ఆకు కూరలను తీసుకోవడం ద్వారా మన శరీరానికి తగినంత ఫైబర్, మినరల్స్, విటమిన్స్ అందుతాయి. ఉడికించిన కూరగాయలు తినటం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులతో పాటు క్యాన్సర్ వంటి అనేక రకాల రోగాల నుంచి మనకు తగిన రక్షణ లభిస్తుంది.

ఒక పాత్రలో కాస్తంత నీళ్లను పోసి అందులో కూరగాయలను వేసి వేడిచేయాలి. మరీ ఎక్కవగా కాకుండా, మరీ తక్కువ కాకుండా తగినంత సమయం వరకు మాత్రమే కూరగాయలను ఉడికించాలి. తద్వారా మాత్రమే పోషకాలు శరీరానికి లభిస్తాయి. కూరగాయలను సరైన విధంగా ఉడికించడం వలన వాటిలో దాగి ఉండే క్రిమికీటకాలు నశిస్తాయి. తద్వారా, కూరగాయాలనేవి తినడానికి సురక్షితంగా మారి తద్వారా ఆరోగ్యకరంగా మారతాయి.

ఉడికించిన కూరగాయలు తినడం కారణంగా గా మనం జీర్ణప్రక్రియ చాలా మెరుగుపడుతుంది. కూరగాయలలో ఉండే కాంప్లెక్స్ కాంపౌండ్స్ కారణంగా మనం తిన్న ఆహారం ముక్కలు ముక్కలుగా మారి త్వరగా జీర్ణం కావటం జరుగుతుంది. అనేకరకాల అధ్యయనాల ప్రకారం ఉడికించిన కూరగాయలలో పోషకవిలువలు అధికంగా లభిస్తాయి. కేరట్స్,  బ్రొకోలి వంటివాటిని ఉడికించడం ద్వారా వాటి నుంచి గరిష్ట ప్రయోజనాలను పొందవచ్చని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

ఉడికించిన కూరగాయలు తినడం కారణంగా మనం ఎసిడిటి సమస్యను అంతం చేయవచ్చును. ఉడికించిన కూరగాయలలో ఉండేటువంటి టెక్చర్ మన ఎసిడిటి సమస్యను తగ్గిస్తుంది. దీని కారణంగా మనం తీసుకున్న ఫుడ్డు ఎక్కువసేపు కడుపులో ఉండదు. తద్వారా మనం ఎసిడిటి సమస్యను తగ్గించుకోవచ్చు. ఉడికించిన కూరగాయలను తినడం కారణంగా చర్మ సౌందర్యం అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ప్రతిరోజు మనం ఈ ఉడికించిన కూరగాయలు తినడం కారణంగా అనేక రకాల పోషకాలు మనకు అందుతాయి. తద్వారా మన ఫేస్ లో గ్లో వస్తుంది.

ఉడికించడం వలన కూరగాయలలో లభ్యమయ్యే యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ అనేది మరింత పెరుగుతుంది. దీని వలన శరీరంలోని ఆక్సిడేషన్ వలన ఉత్పత్తయ్యే ఫ్రీ రాడికల్స్ అనే కెమికల్స్ అనేవి తొలగించబడతాయి. అనేక వ్యాధులు నుంచి రక్షణ లభిస్తుంది. బరువు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న వారికి ఉడకబెట్టిన కూరగాయలు తినడం చాలా శ్రేయస్కరం. ఉడికించిన కూరగాయలు తక్కువ క్యాలరీస్ ఉంటాయి. తద్వారా మనం త్వరగా బరువు తగ్గవచ్చు. క్యారెట్ ను ఉడకబెట్టుకుని తినటం ద్వారా జుట్టు రాలే సమస్యను నివారిస్తుంది. జుట్టు సైతం ఒత్తుగా పెరుగుతుంది. ఉడికించడం వలన ఆహారానికి సరైన రుచి రావడంతో పాటు మనకు సమయం కూడా ఆదా అవుతుంది.