Women Safety : ఆడవారిపై నేరాలు జరిగే ప్రాంతాల్ని గుర్తించటానికి షీ–టీమ్స్‌ యాప్‌లో జియోట్యాగింగ్‌

ఆడవారిపై నేరాలు జరిగే ప్రాంతాల్ని గుర్తించటానికి షీ–టీమ్స్‌ యాప్‌లో జియోట్యాగింగ్‌ చేస్తోంది.

Women Safety : ఆడవారిపై నేరాలు జరిగే ప్రాంతాల్ని గుర్తించటానికి షీ–టీమ్స్‌ యాప్‌లో జియోట్యాగింగ్‌

Geo Tagging For Where Areas Crimes Occur Against Women

Geo Tagging For Where Areas Crimes Occur Against Women : మహిళల భద్రతే లక్ష్యంగా షీటీమ్స్ కృషి చేస్తోంది. యువతుల్ని ఈవ్ టీజింగ్ చేసినా..మహిళలను వేధించినా..సీటీమ్స్ రంగంలోకి దిగుతాయి.ఆకతాయిల పని పట్టటమే కాదు..ఊచలు లెక్కపెట్టిస్తాయి. అటువంటి షీటీమ్స్ ఆడవారి భద్రత కోసం మరో ముందడుగు వేసింది. టెక్నాలజీని వినియోగిస్తోంది. ఆడవారిపై నేరాలు జరిగే ప్రాంతాల్ని గుర్తించటానికి షీ టీమ్స్ యాప్ లో జియోట్యాగింగ్ ద్వారా గుర్తిస్తోంది. యువతులు, మహిళలపై నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి జియోట్యాగింగ్‌ చేస్తోంది. ఈ మ్యాప్స్‌ను అప్లికేషన్‌లో ఉంచడం ద్వారా ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ ప్రత్యేక పర్యవేక్షణకు మార్గం ఈజీ అవుతోంది. హైదరాబాద్‌ నుంచి ఆదిలాబాద్‌ వరకు ఎక్కడైనా షీ–టీమ్స్‌ పనితీరు, స్పందన ఒకేలా ఉండటానికి ఈ యాప్‌ వినియోగిస్తున్నారు. దీన్ని పోలీసు డిపార్ట్ మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది.

వినూత్నంగా నిఘా..
మహిళల భత్రత కోసం తెలంగాణ ప్రభుత్వం షీటీమ్స్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.ఈ షీటీమ్స్ మొదట్లో హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితంగా ఉండేది.కానీ
ప్రస్తుతం ఈ సేవలు తెలంగాణ రాష్ట్రమంతటా విస్తరించేలా చేసింది ప్రభుత్వం. దీంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 370 షీ–టీమ్స్‌ పనిచేస్తున్నాయి. ఈ టీమ్స్ ఆకతాయిలకు ఎటువంటి అనుమానం రాకుండా వారి పని చక్కబెట్టేస్తాయి. జులాయిల పనిపడతాయి. ఈ టీమ్స్ సభ్యులు మఫ్టీలో తిరుగుతుంటారు. ఈవ్‌టీజర్లు, మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై నిఘా వేస్తాయి. సాధారణంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో పాటు ఇతర పబ్లిక్‌ ప్లేసుల్లో ఈ బృందాలు నిరంతరం తిరుగుతుంటాయి. అన్ని వేళలా, అన్ని ప్రాంతాల్లోనూ షీటీమ్స ఉండటా సాధ్యంకాదు. అలా కొన్ని ప్రాంతాల్లో ఈవ్ టీజింగ్ జరుగుతోంది అనుకోండి. కానీ మరో ప్రాంతంలో ఈవ్ టీజింగ్ లు జరిగితే అది వారి దృష్టికి వచ్చిన సత్వరమే చర్యలు తీసుకోవాలనికి ఉండటలేదు. ఇది కొన్ని సందర్భాల్లో షీ–టీమ్స్‌ నిఘా మూస ధోరణిలో సాగుతోంది. ఈ క్రమంలో షీ–టీమ్స్‌ యాప్‌లో జియోట్యాగింగ్‌ను చేర్చారు.

Read more : బాలికలకు షీటీమ్స్ భరోసా : బాల్య వివాహాలకు  చెక్‌ 

నేరం జరిగితే తెలిసే విధానం..మ్యాప్‌పై ఆ ప్రాంతాలు తెలిసేలా..
హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసే ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఇలాంటి హాట్‌స్పాట్స్‌ను ఎప్పటికప్పుడు గుర్తిస్తుంటుంది. ఆయా ప్రాంతాల్లో నమోదైన కేసులు, వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా వీటిని గుర్తిస్తుంది. మ్యాప్‌పై ఆ వివరాలు పొందుపరుస్తూ జియోట్యాగింగ్‌ చేస్తుంది. రాష్ట్రంలోని అన్ని షీ–టీమ్స్‌ వద్ద ఈ యాప్‌ అందుబాటులో ఉంది. అందులోని మ్యాప్‌లో ఈవ్‌టీజింగ్‌ హాట్‌స్పాట్స్‌ను నిర్దేశిస్తుంటుంది. దీని ఆధారంగా ఆయా ప్రాంతాలను తెలుసుకునే సిబ్బంది వాటిపైనే ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. కాలమాన పరిస్థితులను బట్టి ఈ హాట్‌స్పాట్స్‌ మారుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఈ మ్యాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ షీ–టీమ్స్‌ను సమాచారం అందేలా చేస్తుంటుంది.

Read more : Sabyasachi Mangalsutra : ఇది మంగళసూత్రం ప్రకటనా? లో దుస్తుల ప్రకటనా?! నెటిజన్ల ఫైర్

ఫిర్యాదులు,పరిష్కారాలు,చక్యలు అన్నీ ఈ యాప్‌లోకి..
ఈవ్‌టీజింగ్‌ తరహాలో మహిళలపై జరిగే నేరాలు, వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులనూ ఈ యాప్‌లోకి తీసుకువస్తున్నారు. షీ–టీమ్స్‌ కేంద్రాలు, భరోసా కేంద్రాలు, యాంటీ ఉమెన్‌ ట్రాఫికింగ్‌ వింగ్, సైబర్‌ క్రైమ్‌… ఇలా కేటగిరీల వారీగా మహిళలు, యువతులపై జరిగే నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు రాష్ట్రంలో ఎక్కడ వచ్చినా వాటిని షీ–టీమ్స్‌ యాప్‌లో పొందుపరుస్తారు. ఫిర్యాదులోని అంశాలను బట్టి ఆయా విభాగాలకు దీన్ని పంపించి చర్యలు తీసుకునేలా చేస్తారు. ఆ ఫిర్యాదుపై ఆయా ప్రాంతాల్లో అధికారులు..సిబ్బంది ఎలా స్పందించారు? ఆ సమస్య పరిష్కరించటానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? సమస్య ఎంత వరకు పరిష్కరించారు? బాధితులకు సరైన న్యాయం జరిగిందా?వంటి అన్ని వివరాలు ఈ యాప్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. అలాగే ఆయా ప్రాంతాల్లో పోకిరీల వివరాలు..వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చిన ప్రాంతాలు ఏఏ సమయాల్లో కౌన్సిలింగ్ ఇచ్చారు? తేదీలు, టైమ్ లతో సహా వాటిలో పొందుపరచాలి. వీటి ఆధారంగా ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ పదేపదే ఈ తరహా నేరాలకు పాల్పడే వారిపై క్రిమినల్‌ కేసుల నమోదుకు చర్యలు తీసుకుంటోంది. ఇలా టెక్నాలజీతో వేధింపులకు చెక్ పెట్టటానికి షీటీమ్స్ కృషి చేస్తోంది.