Sabyasachi Mangalsutra : ఇది మంగళసూత్రం ప్రకటనా? లో దుస్తుల ప్రకటనా?! నెటిజన్ల ఫైర్

ఓ మంగళసూత్రం ప్రకటనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ వెల్లువెత్తుతోంది. ఇది మంగళసూత్రం ప్రకటనా? లేదా లో దుస్తుల ప్రకటనా? అంటూ తిట్టిపోస్తున్నారు.

Sabyasachi Mangalsutra : ఇది మంగళసూత్రం ప్రకటనా? లో దుస్తుల ప్రకటనా?! నెటిజన్ల ఫైర్

Viral Mangal Sutra

Sabyasachi trolled for viral mangalsutra నేటి ఫ్యాషన్ ప్రపంచంలో డిజైనర్లదే హవా. కొత్త మోడల్ డ్రెస్ తో ఈవెంట్స్ లో ఆకట్టుకోవాలన్నా..కొత్త డిజైన్ నగలు ధరించి అందరి కళ్లను తమవైపే తిప్పుకోవాలన్నా..డిజైనర్ పీస్ లదే హవా. ఈ ఫ్యాషన్ యుగంలో ట్రెండ్ ను ట్రెడిషన్ ను మిక్స్ చేసి డిజైనర్లు వావ్ అనిపించుకుంటున్నారు. పోటీలో నిలబడుతున్నారు. కానీ కొన్ని డిజైన్లు మాత్రం బెడిసి కొడుతుంటాయి. పైగా విమర్శలపాలవుతుంటాయి. అదే జరిగింది హిందువులకు అంత్యంత పవిత్రంగా భావించే ‘మంగళసూత్రం’ డిజైన్ విషయంలో. చేసిన మంగళసూత్రం డిజైన్ బాగానే ఉంది. కానీ దాన్ని పబ్లిసిటీ చేసే ప్రకటనలో మాత్రం బెడిసికొట్టింది. డిజైనర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ‘మంగళసూత్రాన్ని’ ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేశారు. మంగళసూత్రం డిజైన్ ఆకట్టుకునేలా ఉంది. కానీ దాన్ని ప్రజెంట్ చేసే ప్రకటన మాత్రం విమర్శలపాలైంది. దీంతో మంగళసూత్రం డిజైన్ గురించి మానేసి ఆ ప్రకటపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఈ ప్రకటన అంతగా విమర్శలపాలవ్వటానికి కారణమేంటీ అంటే..

Read more : Rebecca Downie : T20 వరల్డ్ కప్ జెర్సీ డిజైన్ చేసిన 12 ఏళ్ల చిన్నారి

డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన ‘‘మంగళసూత్రం ప్రకటన లో దుస్తుల ప్రకటన’ లా ఉందని ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఈ స్పెషల్ మంగళసూత్రం డిజైన్ వైరల్ గా మారింది. ఇంటిమేట్ ఫైన్ జ్యువెలరీ పేరిట..మంగళసూత్రం డిజైన్ చేశారు. ఈ మంగళసూత్రాన్ని.. ధరించిన ఫోటోలో ఓ మహిళ ధరించగా..మరో ఫోటోలో స్వలింగ సంపర్కులు కూడా ధరించినట్టుగా ఉండటం గమనించాల్సిన విషయం.”రాయల్ బెంగాల్ మంగళసూత్ర 1.2 , బెంగాల్ టైగర్ ఐకాన్ సేకరణను పరిచయం చేస్తున్నాము, VVS డైమండ్స్, బ్లాక్ ఒనిక్స్ , బ్లాక్ ఎనామెల్‌తో 18k బంగారంతో నెక్లెస్‌లు, చెవిపోగులు , సిగ్నెట్ రింగ్‌ల సేకరణ” అందుబాటులో ఉన్నాయని ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. మంగళసూత్రాన్ని అవమానించేలా ప్రవర్తించారంటూ విమర్శలు చేస్తున్నారు. అది మంగళసూత్రం ప్రకటనలా ఎక్కడా కనపడలేదని..లోదుస్తుల ప్రకటనలా ఉందని విమర్శిస్తున్నారు.సబ్యసాచి.. మంగళసూత్రాన్నే కాదు.. లో దుస్తుల సేకరణను ప్రారంభించిందని..ఈ ఐడియా చెత్తగా ఉందంటూ ప్రకటనపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మరికొందైతే..ఇది మంగళసూత్ర యాడ్ కాదు లో దుస్తులు కూడా కాదు.. కండోమ్ యాడ్ లాగా ఉందంటూ ఏకిపారేస్తున్నారు.

Read more : ఒక ఉంగరంలో 7,801 వజ్రాలు.. హైదరాబాదీ గిన్నీస్ వరల్డ్ రికార్డు!

ఇంకొందరు మంగళసూత్రం డిజైన్ చాలా బాగుందని..ఆకట్టుకునేలా ఉంది అంటూ ఆ డిజైన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా ఆడిజైన్ ఆకట్టుకుంది అనేది నిజమే. కానీ ప్రకటనలోనే వచ్చింది చిక్కంతా. డిజైన్ అందంగా ఉన్న పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మార్కెటింగ్ కు. అది డిజైనర్ ప్రతిభ ప్రసంశించబడటానికైనా. కానీ ఇక్కడి డిజైన్ బాగుంది. ప్రకటన మాత్రం విమర్శలపాలవుతోంది.

ఈ రోజుల్లో ఏ కంపెనీ అయినా..ఏదైనా వస్తువును మార్కెట్లోకి విడుదల చేయాలి అనుకుంటే.. దానికి కచ్చితంగా ప్రచారం కావాల్సిందే. అది చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. టీవీల్లో, పేపర్స్, సోషల్ మీడియా ఇలా వేదిక ఏదైనా పబ్లిసిటీ కోసం ప్రకటలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రకటనలతోనే ప్రజలకు ఆ వస్తువను పరిచమయవుతుంటాయి. ఇప్పుడు ప్రజలు వాడే దాదాపు అన్ని వస్తువులు.. ప్రకటనల ద్వారానే కొనేవే. ఎంత పబ్లిసిటీ అయితే అంత మార్కెంటింగ్ అవుతుంది. కాబట్టి.. కంపెనీలన్నీ కూడా.. ప్రకటనల విషయంలో ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ మంగళసూత్రం బాగుంది కానీ దాన్ని ప్రజెంట్ చేసే విధానం బాగాలేదు. అందుకే విమర్శలపాలవుతోంది.

Read more : ధనవంతుల దర్జాయే వేరప్పా.. : ‘వజ్రాల మాస్కు’లో శ్రీమంతుల దర్పాలు