Rebecca Downie : T20 వరల్డ్ కప్ జెర్సీ డిజైన్ చేసిన 12 ఏళ్ల చిన్నారి

12 ఏళ్ల చిన్నారి క్రికెట్ జట్టు వేసుకునే జెర్సీని డిజైన్ చేసి శెభాష్ అనిపించుకుంది. స్కాట్‌లాండ్ క్రికెట్ జట్టునుంచి ప్రశంసలు అందుకుంది ‘రెబెక్కా డౌనీ’ అనే చిన్నారి.

Rebecca Downie : T20 వరల్డ్ కప్ జెర్సీ డిజైన్ చేసిన 12 ఏళ్ల చిన్నారి

12 Years  Girl's Design To Scotland's Cricket Team T20 World Cup

12 years  girl’s design to Scotland’s cricket team T20 World Cup : 12 వయస్సు పిల్లలు ఏం చేస్తారు? స్కూలుకెళతారు. హోం వర్కులు చేస్తారు. అమ్మా నాన్నలతో ఆడుకుంటారు. కానీ 12 ఏళ్ల చిన్నారి క్రికెట్ జట్టు వేసుకునే జెర్సీని డిజైన్ చేసి శెభాష్ అనిపించుకుంటే స్కాట్‌లాండ్ క్రికెట్ జట్టునుంచి ప్రశంసలు అందుకుంది. ఆ చిన్నారి పేరు ‘రెబెక్కా డౌనీ’.

Read more : Nicole Oliveira: NASAతో 8 ఏళ్ల చిన్నారి..బొమ్మలతో ఆడుకునే వయస్సులో ‘ఆస్టరాయిడ్‌’ తో ఆటలు

కాగా..టీ20 వరల్డ్ క్వాలిఫయింగ్ పోటీల్లో స్కాట్‌లాండ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. సూపర్ 12 స్టేజ్‌కు కూడా స్కాట్ లాండ్ జట్టు దగ్గరవుతోంది. పాప్వా న్యూ గునియాపై 17 పరుగులతో.. అంతకముందు ఫెవరేట్స్ బంగ్లాదేశ్‌పైన కూడా గెలిచిన స్కాట్‌లాండ్ జట్టు గ్రూపు బి స్టేజ్‌లోకి దూసుకువెళ్తోంది. ఈ క్రమంలో స్కాట్‌లాండ్ క్రికెట్ రెబెక్కా డౌనీ అనే 12 ఏళ్ల అమ్మాయికి థ్యాంక్స్ చెప్పింది. ఎందుకంటే ఆ అమ్మాయే వారి వేసుకునే జెర్సీని డిజైన్ చేసింది.

స్కాట్‌లాండ్ క్రికెటర్లు వేసుకున్న జెర్సీని 12 ఏళ్ల రెబెక్కా డౌనీ డిజైన్ చేసిందని తమ ట్విట్టర్ లో వెల్లడించారు.స్కాట్ లాండ్ జెర్సీ వేసుకున్న రెబెక్కా ఫోటోను కూడా స్కాట్‌లాండ్ జట్టు పోస్టు చేసింది. రెబెక్కాది స్కాట్ లాండ్ లోని హాడింగ్టన్‌. జట్టు జెర్సీని వేసుకుని మ్యాచ్‌లను తిలకిస్తున్న రెబెక్కాకు థ్యాంక్స్ అంటూ క్రికెట్ స్కాట్‌లాండ్ తన ట్వీట్‌లో వెల్లడించింది.

Read more : Guinness Book Record : 9ఏళ్ల వయస్సులో గిన్నిస్ బుక్ రికార్డు.. భళా బాలిక