Forgot IRCTC Password : మీ ఐఆర్‌సీటీసీ పాస్‌వర్డ్ మర్చిపోయారా? మీ అకౌంట్ పాస్‌వర్డ్‌ ఆన్‌లైన్‌లో ఎలా రీసెట్ చేయాలో తెలుసా?

Forgot IRCTC Password : మీ పాస్‌వర్డ్‌ను రికవరీ లేదా రీసెట్ చేయడానికి ఆన్‌లైన్ ప్రాసెస్ అందిస్తుంది. మీ ఐఆర్‌సీటీసీ పాస్‌వర్డ్‌ని ఎలా రీసెట్ చేయవచ్చు అనేదానిపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Forgot IRCTC Password : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్ ద్వారా రైల్వే టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి లేదా రద్దు చేయడానికి ఆన్‌లైన్ సౌకర్యాన్ని అందిస్తోంది. భారత్‌లో రైలు ప్రయాణాన్ని సులభతరం చేసింది. అయితే, ఏదైనా ఇతర ఆన్‌లైన్ సర్వీసు మాదిరిగా ఐఆర్‌సీటీసీ యూజర్‌లు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ కలిగి ఉండాలి. ఇతర థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్ల వంటి యాప్‌లు ఉన్నప్పటికీ, ఐఆర్‌సీటీసీలో టిక్కెట్‌లను బుక్ చేసేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ ఈ పాస్‌వర్డ్ అవసరమని గమనించాలి.

Read Also : Vivo X Fold 3 Pro Launch : శాంసంగ్, వన్‌ప్లస్‌‌కు పోటీగా.. వివో కొత్త మడతబెట్టే ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

రైల్లో తరచుగా ప్రయాణం చేయని వ్యక్తులు, ప్రత్యేకించి సుదీర్ఘకాలం ఇన్ యాక్టివ్‌గా ఉన్న తర్వాత వారి పాస్‌వర్డ్‌ను మర్చిపోతుంటారు. అయితే, ఐఆర్‌సీటీసీ మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీ లేదా మొబైల్ నంబర్‌ని ఉపయోగించి మీ పాస్‌వర్డ్‌ను రికవరీ లేదా రీసెట్ చేయడానికి ఆన్‌లైన్ ప్రాసెస్ అందిస్తుంది. మీ ఐఆర్‌సీటీసీ పాస్‌వర్డ్‌ని ఎలా రీసెట్ చేయవచ్చు అనేదానిపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఐఆర్‌సీటీసీ పాస్‌వర్డ్‌ని రీసెట్ చేయడం ఎలా? :
మీ ఐఆర్‌సీటీసీ పాస్‌వర్డ్‌ని రికవరీ చేసేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఇమెయిల్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా చేయొచ్చు. రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీ ఉపయోగించి ఐఆర్‌సీటీసీ పాస్‌వర్డ్‌ని రికవరీ చేయొచ్చు.

  • ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
  • అధికారిక ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌కి నావిగేట్ చేయాలి.
  • ‘Forget Password’ లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ యూజర్ నేమ్ ఎంటర్ చేయమని ప్రాంప్ట్ వస్తుంది.
  • దాన్ని టైప్ చేసి Next ఆప్షన్ ఎంచుకోండి.
  • మీరు సెక్యూరిటీ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన పేజీకి రీడైరెక్ట్ అవుతారు.
  • ఈ ప్రశ్న మీ అకౌంట్ రిజిస్టర్ సమయంలో సెట్ చేసి ఉంటారు.
  • మీ అకౌంట్ యాక్సెస్ చేసే ఆన్సర్ గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.

సెక్యూరిటీ ప్రశ్నకు సరిగ్గా సమాధానం ఇచ్చిన తర్వాత మీరు ఐఆర్‌సీటీసీ నుంచి ఇమెయిల్‌ను అందుకుంటారు. ఈ ఇమెయిల్ మీ పాస్‌వర్డ్‌ని రీసెట్ చేయడానికి సూచనలను అందిస్తుంది.
మీ పాస్‌వర్డ్‌ని రీసెట్ చేయడానికి ఇమెయిల్‌లో అందించిన సూచనలను ఫాలో అవ్వండి. భవిష్యత్తులో సమస్యలను నివారించడానికి స్ట్రాంగ్, మీకు బాగా గుర్తుండిపోయే పాస్‌వర్డ్‌ని ఎంచుకోండి.

రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో ఐఆర్‌సీటీసీ పాస్‌వర్డ్‌ రికవరీ ప్రక్రియ :

  • ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ని విజిట్ చేసి ‘Forget Password’ లింక్‌పై క్లిక్ చేసి రీసెట్ చేసుకోండి.
  • మీ యూజర్ నేమ్‌తో క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేసి ఆపై కొనసాగండి.
  • మీరు పాస్‌వర్డ్ రికవరీ పేజీకి రీడైరెక్ట్ అవుతారు.
  • మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ (వన్-టైమ్ పాస్‌వర్డ్) వస్తుంది.
  • పాస్‌వర్డ్ రికవరీ పేజీలో ఈ ఓటీపీ ఎంటర్ చేయండి.
  • ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కొత్త పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయమని ప్రాంప్ట్ వస్తుంది.
  • కొత్త పాస్‌వర్డ్‌ను మళ్లీ ఎంటర్ చేయడం చేసి నిర్ధారించండి.
  • క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి మీ కొత్త పాస్‌వర్డ్‌ ద్వారా లాగిన్ అవ్వండి.

పాస్‌వర్డ్ క్రియేట్ చేసేటప్పుడు సేఫ్‌గా ఉండేలా సెట్ చేయాలి. అక్షరాలు, సంఖ్యలు, స్పెషల్ క్యారెక్టర్లతో కూడిన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయండి. అలాగే, జనరల్ వర్డ్స్, సులభంగా గెస్ చేసే పదాలు లేదా ‘password123’ లేదా ‘abcdef’ వంటి సీక్వెన్స్‌ అసలు వినియోగించవద్దు. ముఖ్యంగా, ఆన్‌లైన్ రికవరీ మెథడ్స్ సాధ్యం కాకపోతే లేదా మీకు ఏవైనా సమస్యలు ఎదురైతే.. ఐఆర్‌సీటీసీ కస్టమర్ కేర్ విభాగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. మీ పాస్‌వర్డ్‌ని రీసెట్ చేయడం లేదా మీ అకౌంట్ యాక్సెస్ కోసం హెల్ప్ పొందడానికి కస్టమర్ కేర్‌ను సంప్రదించవచ్చు.

Read Also : MG Gloster Editions : కొంటే ఇలాంటి కారు కొనాలి.. ఎంజీ గ్లోస్టర్ రెండు కొత్త వేరియంట్లు ఇవే.. ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు