MG Gloster Editions : కొంటే ఇలాంటి కారు కొనాలి.. ఎంజీ గ్లోస్టర్ రెండు కొత్త వేరియంట్లు ఇవే.. ధర ఎంతంటే?

MG Gloster Editions : గ్లోస్టర్ డెజర్ట్‌స్టార్మ్ డీప్ గోల్డెన్ ఎక్స్‌టీరియర్ పెయింట్ జాబ్‌తో వస్తుంది. అయితే, గ్లోస్టర్ స్నోస్టార్మ్ డ్యూయల్-టోన్ పెర్ల్ వైట్, బ్లాక్ ఎక్స్‌టీరియర్ కలర్ స్కీమ్‌తో వస్తుంది.

MG Gloster Editions : కొంటే ఇలాంటి కారు కొనాలి.. ఎంజీ గ్లోస్టర్ రెండు కొత్త వేరియంట్లు ఇవే.. ధర ఎంతంటే?

MG Gloster Desertstorm and Snowstorm editions ( Image Credit : Google )

MG Gloster Editions : కొత్త కారు కొంటున్నారా? భారత మార్కెట్లో మోరిస్ గ్యారేజెస్ గ్లోస్టర్ కొత్త వేరియంట్‌లను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఎస్‌యూవీ ఇప్పుడు ‘డెసర్ట్‌స్టార్మ్’, ‘స్నోస్టార్మ్’ రెండు ప్రత్యేక ఆప్షన్లలో అందుబాటులో ఉంది. నిర్దిష్ట బ్యూటీ మార్పులతో వస్తాయి.

ఉదాహరణకు.. గ్లోస్టర్ డెజర్ట్‌స్టార్మ్ డీప్ గోల్డెన్ ఎక్స్‌టీరియర్ పెయింట్ జాబ్‌తో వస్తుంది. అయితే, గ్లోస్టర్ స్నోస్టార్మ్ డ్యూయల్-టోన్ పెర్ల్ వైట్, బ్లాక్ ఎక్స్‌టీరియర్ కలర్ స్కీమ్‌తో వస్తుంది. ఇంకా, స్నోస్ట్రోమ్ ఎడిషన్ 7-సీట్ ఆప్షన్‌గా మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, డిజర్ట్‌స్ట్రామ్ ఎడిషన్ గ్లోస్టర్ 6 సీట్, 7-సీట్ వెర్షన్‌లలో లభిస్తుంది.

Read Also : Vivo S19 Pro Series : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వివో S19 ప్రో సిరీస్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

ధర పరంగా చూస్తే.. ఈ రెండు కొత్త వేరియంట్‌ల ధర రూ. 41.05 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఎంజీ గ్లోస్టర్ డెసర్ట్‌స్టార్మ్ డీప్ గోల్డెన్ ఎక్స్‌టీరియర్ పెయింట్ జాబ్‌తో వస్తుంది. రెడ్ కాలిపర్‌లతో బ్లాక్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, డార్క్-థీమ్ ఓఆర్‌వీఎమ్ ‘రెడ్ ఐల్’ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ‘హైలాండ్స్ మిస్ట్’ ఎల్ఈడీలతో మరింత మెరుగ్గా ఉంటుంది. టైల్ ల్యాంప్స్, డోర్ హ్యాండిల్స్, స్పాయిలర్, రూఫ్ రెయిల్‌లు కూడా బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఉంటాయి. లోపలి భాగంలో పూర్తిగా బ్లాక్ కలర్ స్టీరింగ్ వీల్‌పై వైట్ స్టిచ్చింగ్‌తో బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్ లోపలి భాగాన్ని కలిగి ఉంటుంది.

గ్లోస్టర్ డిజర్ట్ స్ట్రోమ్, స్నో‌స్ట్రోమ్ ఎడిషన్లు :
మరోవైపు, స్నోస్టార్మ్ ఎడిషన్ హెడ్‌ల్యాంప్‌లు, బ్యాక్ బంపర్‌లలో రెడ్ కలర్ ఇన్సర్ట్‌లతో వస్తుంది. బ్యాక్ స్పాయిలర్, అల్లాయ్‌లు, డోర్ హ్యాండిల్స్, స్పాయిలర్, ఫ్రంట్ గ్రిల్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఉన్నాయి. లోపలి భాగంలో సీట్లు, స్టీరింగ్ వీల్ వైట్ స్టిచ్చింగ్‌తో బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. కాస్మెటిక్ మార్పులు కాకుండా, ఎంజీ గ్లోస్టర్ డెసర్ట్‌స్టార్మ్, స్నోస్టార్మ్ వేరియంట్‌లు మారలేదు.

ఈ రెండు వేరియంట్‌లు 2.0-లీటర్, టర్బో-డీజిల్ ఇంజన్‌తో 2WD, 4WD వెర్షన్‌లలో అందుబాటులో ఉన్నాయి. 2WD వెర్షన్‌లో ఈ మోటార్ 161బీహెచ్‌పీ, 375ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, 4WD వెర్షన్‌లో 215bhp, 480Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ద్వారా రన్ అవుతుంది. స్టాండర్డ్ గ్లోస్టర్ ధరలు రూ. 38.80 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతాయి.

Read Also : Vivo X Fold 3 Pro Launch : శాంసంగ్, వన్‌ప్లస్‌‌కు పోటీగా.. వివో కొత్త మడతబెట్టే ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?