Smartphones Bad For Kids : తల్లిదండ్రుల్లారా ఇకనైనా మేల్కోండి.. మీ పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌లు ఇవ్వొద్దు.. పెద్దయ్యాక ఈ సమస్యలు తప్పవు..!

Smartphones Bad For Kids : ఇది స్మార్ట్‌ఫోన్.. పిల్లల ఆట వస్తువు కాదు.. పిల్లలు మారం చేశారని వారి చేతుల్లో పెట్టకండి.. ఆ తర్వాత బాధపడిన ప్రయోజనం ఉండదని పిల్లల తల్లిదండ్రులను షావోమీ ఇండియా మాజీ హెడ్ మను కుమార్ జైన్ హెచ్చరించారు.

Smartphones Bad For Kids : అరచేతిలో స్మార్ట్‌ఫోన్.. ప్రతిఒక్కరిలో చేతిలో ఇదో నిత్యావసరంగా మారిపోయింది. ఏమి తినకుండా అయినా బతికేస్తారేమో కానీ.. క్షణం కూడా ఫోన్ లేకుండా బతకలేరంటే అతిశయోక్తి కాదు.. అంతగా మన జీవితాలను స్మార్ట్‌ఫోన్లు ప్రభావితం చేశాయి. పెద్దల విషయాన్ని అలా వదిలేస్తే.. పిల్లలు ఏం చేస్తున్నారు.. పసికందు నుంచి కుర్రాళ్ల వరకు అందరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు కనిపిస్తున్నాయి. పుస్తకం పట్టాల్సిన వయస్సులోనే పిల్లలు స్మార్ట్‌ఫోన్లు పట్టుకుంటున్నారు. ఆడుకోవాల్సిన పిల్లలు ఫోన్లలో ఆన్‌లైన్ గేమ్స్ ఆడేస్తున్నారు. ఈ పరిస్థితికి కారణం ఎవరంటే.. పిల్లల తల్లిదండ్రులే.. ఎందుకంటే.. చిన్నప్పటి నుంచి పిల్లలు మారం చేసినప్పుడల్లా వారి చేతుల్లో స్మార్ట్ ఫోన్ పెట్టేస్తున్నారు. పిల్లల జీవితాన్ని చేతులారా నాశనం చేస్తున్నామని మరిచిపోతున్నారు. మరికొంతమంది పిల్లలు అయితే ఏకంగా సోషల్ మీడియాలో గంటల తరబడి గడిపేస్తున్నారు. పిల్లలు ఆట సమయాన్ని పక్కన పెట్టేసి మొబైల్ గేమ్స్‌తో కాలం గడిపేస్తున్నారు.

పెద్దయ్యాక మానసిక రుగ్మతలు :
సోషల్ మీడియాలో పిల్లల మితిమీరిన ప్రమేయం తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జరగాల్సిందేదో జరిగిపోయింది.. ‘ఇకనైనా మేల్కోండి.. పిల్లలకు ఫోన్లు ఇవ్వడం ఆపేయండి’ అంటూ షావోమీ ఇండియా మాజీ హెడ్, మను కుమార్ జైన్ (Manu Kumar Jain) పిల్లల తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచింపజేసేలా లింక్‌డిన్ పోస్ట్‌లో జైన్ వాస్తవాలను తెలియజేశారు. పిల్లలకు ఏ వయస్సులో ఏది అవసరమో అదే ఇచ్చేలా జాగ్త్రత్త పడాలని జైన్ పలు సూచనలు చేశారు. అదే మన పిల్లల శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తుందని జైన్ పేర్కొన్నారు.

Read Also : Amazon Employee : పీకేసిన కంపెనీలోనే సీనియర్‌గా చేరిన అమెజాన్ ఉద్యోగి.. మెటర్నిటీ లీవ్‌లో ఉండగా తొలగింపు.. అసలేం జరిగిందంటే?

10ఏళ్ల లోపు పిల్లల్లోనే ఫోన్ల వినియోగం అధికం :
(Sapien) ల్యాబ్ నుంచి వచ్చిన నివేదికను ఈ సందర్భంగా జైన్ షేర్ చేశారు. చిన్న పిల్లలకు ఇప్పటినుంచే స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లను ఇవ్వడం వల్ల భవిష్యత్తులో అనేక మానసిక రుగ్మతలతో బాధపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇటీవల అధ్యయనంలో ఫలితాలను పరిశీలిస్తే దిగ్భ్రాంతిని కలిగించేలా ఉన్నాయి. సుమారు 10 ఏళ్లలోపు పిల్లల్లో స్మార్ట్‌ఫోన్‌లకు గురైన వారిలో 60-70 శాతం మంది మహిళలు పెద్దయ్యాక మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పురుషుల్లో మాత్రం రోగనిరోధక శక్తిని కోల్పోతారట.. సుమారు 10 ఏళ్లలోపు స్మార్ట్‌ఫోన్‌లకు గురైన వారిలో 45-50 శాతం మంది పెద్దాయ్యక కూడా ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారని అధ్యయనంలో తేలింది.

Former smartphone company head says smartphones are bad for kids

పిల్లలు మారం చేస్తున్నారని ఫోన్ ఇస్తే అంతే.. :
పిల్లలు ఏడుస్తున్నప్పుడు, భోజనం చేసేటప్పుడు లేదా కారులో ప్రయాణిస్తున్నప్పుడు వారిని బుజ్జగించడానికి తల్లిదండ్రులు సాధారణంగా స్మార్ట్‌ఫోన్ ఇస్తుంటారు. పిల్లలకు ఇచ్చే స్మార్ట్‌ఫోన్ ఆట వస్తువు కాదని, వారి జీవితాన్ని నాశనం చేసే ఆయుధమని జైన్ హెచ్చరించారు. ఇలాంటి స్మార్ట్‌ఫోన్‌లను పిల్లల చేతుల్లో పెట్టే ప్రలోభాలను నిరోధించాలని తల్లిదండ్రులను ఆయన కోరారు. దానికి బదులుగా, వాస్తవ-ప్రపంచంలో ఉండేలా ప్రోత్సహించడం, బహిరంగ కార్యకలాపాల్లో పాల్గొనేలా చేయడంతో పాటు పిల్లలను తమ అభిరుచులలో నిమగ్నం అయ్యేలా చూడటం వంటి విషయాలను జైన్ ప్రస్తావించారు. ఇలా చేయడం ద్వారా పిల్లల్లో మానసిక పరమైన ఉల్లాసంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించగలవని జైన్ అభిప్రాయపడ్డారు.

పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే.. :
తమ పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తల్లిదండ్రుల బాధ్యతను జైన్ గుర్తు చేశారు. గంటల కొద్ది మొబైల్ స్ర్కీన్ చూడటాన్ని పూర్తిగా తగ్గించాలని, లేదంటే హానికరమైన ప్రభావాలకు దారితీస్తుందని జైన్ హెచ్చరించారు. ముఖ్యంగా చిన్న పిల్లలలో బాల్యం ఎంతో విలువైనదిగా జైన్ పేర్కొన్నారు. తమ పిల్లలకు ఉజ్వలమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం సాధ్యమైనంతంగా అద్భుతమైన పునాదిని అందించడమే తల్లిదండ్రుల బాధ్యత అని జైన్ స్పష్టం చేశారు.

స్మార్ట్‌ఫోన్‌లు లేదా టాబ్లెట్‌లకు తాను వ్యతిరేకం కాదని జైన్ క్లారిటీ ఇచ్చారు. స్మార్ట్‌ఫోన్ల వినియోగం మన జీవితాలపై ఎంతలా ప్రభావం చూపుతున్నాయో జైన్ తెలియజేప్పారు. తాను కూడా ఈ స్మార్ట్‌ఫోన్లను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లు అంగీకరించారు. ఏది ఏమైనప్పటికీ, చిన్న పిల్లలకు స్మార్ట్‌ఫోన్లను అందించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని గట్టిగా చెప్పాడు. ఈ విషయంలో పిల్లల తల్లిదండ్రులే పూర్తి బాధ్యత తీసుకోవాలని జైన్ సూచనలు చేశారు.

Read Also : Honda Elevate SUV Car : కొత్త కారు కొంటున్నారా? హోండా ఎలివేట్ SUV బుకింగ్స్ ఓపెన్.. ఈ కారు ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే బుకింగ్ చేస్తారు..!

ట్రెండింగ్ వార్తలు