Honda Elevate SUV Car : కొత్త కారు కొంటున్నారా? హోండా ఎలివేట్ SUV బుకింగ్స్ ఓపెన్.. ఈ కారు ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే బుకింగ్ చేస్తారు..!

Honda Elevate SUV Car : భారత మార్కెట్లోకి హోండా ఎలివేట్ మిడ్ సైజ్ SUV కారు వచ్చేస్తోంది. ఈ SUV కారు లాంచ్‌కు ముందే అనాధికారికంగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రాబోయే ఈ కొత్త కారు ధర ధర రూ. 10.50 లక్షల నుంచి రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉంటుందట..

Honda Elevate SUV Car : కొత్త కారు కొంటున్నారా? హోండా ఎలివేట్ SUV బుకింగ్స్ ఓపెన్.. ఈ కారు ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే బుకింగ్ చేస్తారు..!

Honda Elevate SUV unofficial bookings start, more details here

Honda Elevate SUV Car Unofficial Bookings : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే కొద్ది రోజులు ఓపిక పట్టండి. భారత మార్కెట్లోకి ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) నుంచి మిడ్ సైజ్ SUV కారు వచ్చేస్తోంది. దేశ మార్కెట్ పోటీదారుల్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారాకు పోటీగా హోండా ఎలివేట్ (Honda Elevate) మిడ్-సైజ్ SUVని లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది.

జూన్ 6న ప్రపంచ ప్రీమియర్‌లో హోండా ఎలివేట్ మోడల్ ప్రదర్శించనుంది. ఈ వెహికల్ అడుగుపెట్టబోయే మొదటి దేశంగా భారత్ కానుంది. అంతకంటే ముందే.. కార్‌మేకర్ కొన్ని డీలర్‌షిప్‌లు రూ. 21వేల టోకెన్ మొత్తానికి ఎలివేట్ కోసం బుకింగ్‌లను ప్రారంభించాయి. అయినప్పటికీ అనధికారికంగా బుకింగ్స్ తీసుకుంటున్నారు.

హోండా ఎలివేట్ ధర ఎంత ఉండొచ్చుంటే? :
సిటీ మిడ్-సైజ్ సెడాన్, అమేజ్ కాంపాక్ట్ సెడాన్ తర్వాత ఎలివేట్ మిడ్-సైజ్ SUV హోండా మూడవ వాల్యూమ్ పిల్లర్ అవుతుంది. పండుగ సీజన్ ప్రారంభానికి ముందు ప్రారంభమైంది. భారత మార్కెట్లో హోండా ఎలివేట్ ధర రూ. 10.50 లక్షల నుంచి రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also : Honda Shine 100 : సరసమైన ధరకే హోండా షైన్ 100 బైక్.. ఒకే రోజులో 500 యూనిట్లు డెలివరీ..!

హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) మోడల్ ధర రూ. 10.87 లక్షల నుంచి రూ. 19.20 లక్షలు (ఎక్స్-షోరూమ్), మారుతి సుజుకి గ్రాండ్ విటారా రూ. 10.70 లక్షల నుంచి రూ. 19.95 లక్షల (ఎక్స్-షోరూమ్), కియా సెల్టోస్ రూ. 10.89 లక్షల నుంచి రూ. 19.65 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.

Honda Elevate SUV unofficial bookings start, more details here

Honda Elevate SUV unofficial bookings start, more details here

మిడ్ సైజ్ SUV ఫీచర్లు ఇవేనా? :
ఎలివేట్ రెండు ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. మనం సిటీలో తిరిగే విధంగానే డిజైన్ చేసింది కంపెనీ. 6-స్పీడ్ MT, 7-స్పీడ్ CVT ఆప్షన్లతో 1.5-లీటర్ VTEC DOHC పెట్రోల్ ఇంజన్ (121PS) గరిష్ట శక్తి, 145Nm గరిష్ట టార్క్ ఉంటుంది. 1.5-లీటర్ అట్కిన్సన్-సైకిల్ పెట్రోల్ ఇంజన్ (126PS గరిష్ట శక్తి, 253Nm గరిష్ట టార్క్)తో ఇంటిగ్రేట్ ఆటో-ఛార్జింగ్, టూ-మోటార్ e-CVT సిస్టమ్‌తో కూడిన స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ కూడా ఉంటుంది.

ఇక, ఫీచర్ల విషయానికొస్తే.. హోండా ఎలివేట్ LED హెడ్‌ల్యాంప్‌లు, DRL, టెయిల్‌ల్యాంప్‌లు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వస్తుంది. క్యాబిన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఎలివేట్‌తో హోండా ADASను కూడా అందిస్తుందని భావిస్తున్నారు.

Read Also : Amazon Employee : పీకేసిన కంపెనీలోనే సీనియర్‌గా చేరిన అమెజాన్ ఉద్యోగి.. మెటర్నిటీ లీవ్‌లో ఉండగా తొలగింపు.. అసలేం జరిగిందంటే?