Google Fine : గూగుల్‌కు భారీ జరిమానా.. అందుకేనా?

ప్రముఖ సెర్చ్​​ ఇంజిన్ 'గూగుల్​'కు ఫ్రాన్స్​కు చెందిన యాంటీ-ట్రస్ట్ వాచ్​డాగ్​​ సంస్థ భారీ జరిమానా విధించింది. కాపీరైట్ నిబంధనల ఉల్లంఘన కింద ఆల్ఫాబెట్ గూగుల్ కు భారీ జరిమానా విధించింది.

Google Fine Copyright Row : ప్రముఖ సెర్చ్​​ ఇంజిన్ ‘గూగుల్​’కు ఫ్రాన్స్​కు చెందిన యాంటీ-ట్రస్ట్ వాచ్​డాగ్​​ సంస్థ భారీ జరిమానా విధించింది. న్యూస్ కాపీరైట్ (news copyright row) నిబంధనల ఉల్లంఘన కింద ఆల్ఫాబెట్ గూగుల్ కు భారీ జరిమానా విధించింది. కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు 500 మిలియన్ల యూరోలు (593 మిలియన్ డాలర్లు) జరిమానా విధించింది. భారత కరెన్సీలో రూ.4,415 కోట్లు.. దీనిపై ఇప్పటివరకూ గూగుల్ అధికారికంగా స్పందించలేదు.

దేశీయ న్యూస్ పబ్లిషర్లకు సంబంధించి తాత్కాలిక ఆదేశాలను అమలు చేయడంలో గూగుల్ విఫలం కావడంతో ఈ దిశగా చర్యలు చేపట్టింది. APIG, SEPM, AFP వంటి న్యూస్ పబ్లిషర్స్ తమ న్యూస్ కంటెంట్ వినియోగంపై రెమ్యురేషన్‌పై చర్చించడంలో గూగుల్ విఫలమైంది. దీనిపై వాచ్ డాగ్ యాంటీ ట్రస్ట్ అథారిటీ స్పందించింది. ఈ తాత్కాలిక ఉత్తర్వులను గూగుల్ ఉల్లంఘించిందా అనే దానిపై విచారించనుంది. దీనిపై ఇప్పటివరకూ గూగుల్ అధికారికంగా స్పందించలేదు.

రాబోయే రెండు లేదా మూడు నెలల్లో వార్తా సంస్థలకు ఇతర పబ్లిషర్లకు వార్తల వినియోగానికి ఎలా రెమ్యురేషన్ ఇస్తుందనే దానిపై ప్రతిపాదనలు పంపాల్సి ఉంది. అలా చేయని పక్షంలో గూగుల్ రోజుకు అదనంగా 9 లక్షల యూరోల చొప్పున జరిమానా ఎదుర్కొవాల్సి రావొచ్చు.

గతంలో కూడా గూగుల్​కు ఆన్ లైన్ ఆన్​లైన్​ ​ప్రకటనల విషయంలో భారీ ఫైన్ పడింది. ఆన్​లైన్​ ​ప్రకటనల విషయంలో నిబంధనలను ఉల్లంఘించినందుకు ఫ్రాన్స్​కు చెందిన యాంటీ ట్రస్ట్ వాచ్​ డాగ్​ సంస్థ 268 మిలియన్​ డాలర్ల జరిమానా విధించింది. ఆన్​లైన్​ అడ్వర్టైజింగ్ వ్యాపారంలో తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు 268 మిలియన్​ డాలర్‌ జరిమానా విధించాలని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు