From iPhone 15 to iPhone 13 get massive discounts
Apple iPhones Sale : ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్త ఏడాదిలో రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా అనేక స్మార్ట్ఫోన్లు, టెలివిజన్లు, ల్యాప్‌టాప్‌లపై ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది. జనవరి 14 నుంచి జనవరి 19 వరకు ఆరు రోజుల పాటు కొనసాగనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ యూజర్లు జనవరి 13న ముందస్తు యాక్సెస్‌ను పొందవచ్చు.
ఆపిల్, శాంసంగ్, గూగుల్ వంటి టెక్ బ్రాండ్లపై కొన్ని ధరల తగ్గింపులను పొందవచ్చు. ఆపిల్ ఐఫోన్ 14, గూగుల్ పిక్సెల్ 7ఎ వంటి ఫోన్లపై భారీ తగ్గింపులను పొందే అవకాశం ఉందని కంపెనీ ఇప్పటికే తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఐఫోన్లలో బెస్ట్ డీల్స్ పొందవచ్చు. రిపబ్లిక్ డే సేల్కు ముందు, ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్లపై భారీ డీల్‌లను పొందవచ్చు.
ఆపిల్ ఐఫోన్ 15 :
సెప్టెంబర్ 2023లో లాంచ్ అయిన ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ 128జీబీ మోడల్ ధర రూ.79,900 ఉండగా.. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డేల్ సందర్భంగా ఈ డివైజ్ 8 శాతం తగ్గింపుతో రూ.72,999కి అందిస్తోంది. అంతేకాకుండా, బ్రాండ్ ఎంపిక చేసిన డివైజ్‌లపై రూ. 57,990 ఎక్స్చేంజ్ డిస్కౌంట్, అదనంగా రూ. 3వేలు అందిస్తోంది. అలాగే, ఈఎంఐ, ఈఎంఐ యేతర లావాదేవీలకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై తగ్గింపులను పొందవచ్చు. హెచ్డీఎఫ్సీ డెబిట్ కార్డ్ ఉన్న వినియోగదారులు ఈఎంఐ లావాదేవీలపై రూ.4వేలు తగ్గింపును పొందవచ్చు.
iPhone 15 to iPhone 13 massive discounts
ఐఫోన్ 14 :
2022లో లాంచ్ అయిన ఐఫోన్ 14 మోడల్ 128జీబీ ధర రూ. 69,900, అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో 15 శాతం తగ్గింపుతో రూ. 58,999తో అందుబాటులో ఉంది. వినియోగదారులు రూ. 54,990 వరకు ఎక్స్ఛేంజ్ తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, యస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై అనేక బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి.
ఐఫోన్ 13 :
ఆపిల్ ఐఫోన్ 13 ధర రూ. 59,900, ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 52,999గా అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన మోడళ్లపై వినియోగదారులు రూ. 44,400 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, రూ. 3వేలు అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ బెనిఫిట్స్ పొందవచ్చు. అంతేకాకుండా, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.
ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లతో పాటు వినియోగదారులు సరసమైన ధరలకు ఐఫోన్లను పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ మోడల్ కండిషన్‌పై ఆధారపడి ఉన్నాయని గమనించాలి.
Read Also : Apple iPhone 13 Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. రూ.50వేల లోపు ధరకే ఆపిల్ ఐఫోన్ 13 సొంతం చేసుకోండి