Top 5 Gadgets 2024 : ఈ కొత్త ఏడాదిలో మీ ప్రియమైన వారికి టాప్ 5 గాడ్జెట్లను సర్‌ఫ్రైజ్ గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు..!

Top 5 Gadgets 2024 : కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా చాలామంది తమ ప్రియమైన వారికి ఏదో ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. భారత్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న మార్కెట్లలో మొదటి ఐదు అద్భుతమైన బహుమతులను మీకోసం అందిస్తున్నాం..

Here are top 5 gadgets to gift to your loved ones this New Year 2024

Top 5 Gadgets 2024 : కొత్త ఏడాదిలో మీ ప్రియమైన వారికి ఏదైనా విలువైన బహుమతి ఏది ఇవ్వాలా? అని చూస్తున్నారా? భారత మార్కెట్లో అనేక కొత్త మోడల్ డివైజ్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రధానంగా ఆపిల్ ఐఫోన్ నుంచి అనేక గాడ్జెట్లు వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆపిల్ ఐఫోన్ 15 నుంచి సోనీ ప్లేస్టేషన్ 5, శాంసంగ్ గెలాక్సీ ఎస్23FE, బోట్ స్మార్ట్ర్ రింగ్ జెన్-1 డివైజ్, ఆపిల్ ఐప్యాడ్ 10వ జనరేషన్, వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ఫోన్ టాప్ 5 గాడ్జెట్లలో మీకు నచ్చిన డివైజ్ న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు.

Read Also : iPhone 14 Discount Sale : ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై ఏకంగా రూ. 12వేలు తగ్గింపు.. ఈ డీల్ పొందాలంటే?

1) ఆపిల్ ఐఫోన్ 15:
ఆపిల్ నుంచి లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 15 గత వెర్షన్ల కన్నా అనేక అప్‌గ్రేడ్లతో వస్తుంది. ఇందులో గరిష్ట అవుట్‌డోర్ బ్రైట్‌నెస్ దాదాపు రెట్టింపు చేసి ఆకట్టుకునే 2వేల నిట్‌లకు చేర్చింది. ఐఫోన్ 6.1-అంగుళాల డిస్‌ప్లేతో పాటు కొత్త డైనమిక్ ఐలాండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన వండర్‌లస్ట్ ఈవెంట్‌లో రూ.79,990 ధరకు లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అన్ని ప్రధాన ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో రూ. 5వేల తగ్గింపుతో అందుబాటులో ఉంది. అయితే, విజయ్ సేల్స్‌లో ఇటీవలి ఆపిల్ డేస్ సమయంలో 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 67,990 ధరకు కొనుగోలు చేయవచ్చు.

2) సోనీ ప్లేస్టేషన్ 5 :
గేమింగ్ పరంగా సోనీ ప్లేస్టేషన్ 5తో న్యూ ఇయర్‌లో మీ ప్రియమైన వారిని బహుమతిగా ఇవ్వండి. 4కె గ్రాఫిక్స్, వేగవంతమైన ఎస్ఎస్‌డీ, వినూత్నమైన డ్యూయల్‌సెన్స్ కంట్రోలర్ హాప్టిక్ ఫీడ్‌బ్యాక్, అడాప్టివ్ ట్రిగ్గర్‌లను అందిస్తుంది. గేమర్లను గేమ్ పల్స్ అనుభూతి చెందడానికి వీలు కల్పిస్తుందని కంపెనీ పేర్కొంది. కొన్ని ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్‌లతో అమెజాన్‌లో రూ. 54, 990కి అందుబాటులో ఉన్న ప్లేస్టేషన్ 5 గిఫ్ట్ ఇవ్వొచ్చు.

3) శాంసంగ్ గెలాక్సీ ఎస్23FE :
శాంసంగ్ నుంచి ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో రూ. 59999కి రిటైల్ అవుతుంది. ఈ డివైజ్ 6.40-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను 120హెచ్‌జెడ్ అధిక రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో కలిగి ఉంది. ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో అమర్చిన శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ 8జీబీ ర్యామ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 13లో రన్ అవుతోంది. నాన్-రిమూవబుల్ 4500ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది.

top 5 gadgets gift loved ones  

4) బోట్ స్మార్ట్ర్ రింగ్ జెన్-1 డివైజ్ :
ఈ స్మార్ట్ రింగ్ రూ. 8999కి అందుబాటులో ఉంది. మ్యూజిక్, సోషల్ మీడియా, పవర్‌పాయింట్ స్మార్ట్ టచ్ ఫంక్షనాలిటీతో కూడిన కంట్రోల్ కలిగి ఉంది. 6-యాక్సిస్ మోషన్ సెన్సార్, ప్రీమియం సిరామిక్‌తో రూపొందించిన ఈ స్మార్ట్ రింగ్ కంపెనీ ప్రకారం.. ఎక్కువకాలం మన్నిక, అధునాతనతను అందిస్తుంది. ఫిట్‌నెస్ ట్రాకింగ్‌ను అందిస్తుంది.

సెక్యూరిటీ విషయానికి వస్తే.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఫీచర్‌లను అందిస్తుంది. ఆక్వాటిక్ అడ్వెంచర్‌ల కోసం 5ఏటీఎమ్ నీటి నిరోధకతకు సపోర్టు ఇస్తుంది. హృదయ స్పందన రేటు, రక్త ఆక్సిజన్, శరీరం కోలుకోవడం, ఉష్ణోగ్రత, నిద్ర విధానాలను రియల్ టైమ్ ట్రాకింగ్‌తో కస్టమర్‌లు ఆరోగ్యాన్ని కూడా మానిటరింగ్ చేయొచ్చు.

5) ఆపిల్ ఐప్యాడ్ 10వ జనరేషన్ :
ఆపిల్ ఐప్యాడ్ 10వ జనరేషన్ 10.9-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లేను కలిగి ఉంది. ఎ14 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. ఆపిల్ టాబ్లెట్‌లో 5ఎక్స్ వరకు డిజిటల్ జూమ్‌తో వెనుకవైపు 12ఎంపీ కెమెరా ఉంది. ఆటోఫోకస్ విత్ ఫోకస్ పిక్సెల్‌లు, పనోరమా (63ఎంపీ వరకు), స్మార్ట్ హెచ్‌డీఆర్ 3, ఫోటో జియోట్యాగింగ్, ఆటో ఇమేజ్ స్టెబిలైజేషన్, బర్స్ట్ మోడ్ వంటి ఇతర అవసరమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ టాబ్లెట్ ప్రస్తుతం ఆపిల్ డేస్‌లో విజయ్ సేల్స్‌పై భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ డివైజ్ ప్రభావవంతమైన ధర రూ. 33,430 వద్ద కొనుగోలు చేయవచ్చు.

6) వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ఫోన్ :
వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ధర రూ. 39,999కు పొందవచ్చు. 16ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పాటు 50ఎంపీ ప్రధాన సెన్సార్, 8ఎంపీ అల్ట్రావైడ్, మాక్రో లెన్స్‌తో శక్తివంతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ డివైజ్ 6.7-అంగుళాల 120హెచ్‌జెడ్ సూపర్ ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 8జీబీ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 128జీబీ యూఎఫ్ఎస్3.1 స్టోరేజ్, 100డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్‌తో కూడిన 5000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఆక్సిజన్‌ఓఎస్ రన్ అవుతోంది. వివిధ కెమెరా మోడ్‌లను అందిస్తుంది.

Read Also : Apple iPhone 15 Price Cut : ఆపిల్ ఐఫోన్ 15పై భారీ తగ్గింపు.. కొత్త ధర, బ్యాంకు ఆఫర్లు ఇవే..!