Gaming World’s Smallest Console Is The Same Size As A Postage Stamp
Smallest Game console : ఈ గేమ్ కన్సోల్ చూశారా? ఎంత చిన్నగా ఉందో… చూడటానికి పోస్టల్ స్టాంప్ సైజులో కనిపిస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిచిన్నదైన గేమ్ కన్సోల్.. అమెరికాకు చెందిన సైంటిస్టులు ఈ గేమ్ కన్సోల్ రూపొందించారు. ఒహియోలోని ఓ కంపెనీ చిన్న సర్క్యూట్స్ ద్వారా డెవలప్ చేసింది.
ఇందులో ప్రీ-ఇన్ స్టాల్ 5 గేమ్‌లు ఉంటాయి. ఈ కన్సోల్ రూపొందించిన కంపెనీ ప్రకారం.. ప్రైమరీ గ్రే మోడల్ ధర రూ.1,425గా వెల్లడించింది. లింక్ కేబుల్స్, ఇతర Accessories ధర కొంచెం పెరిగే అవకాశం ఉంది. గేమ్ కన్సోల్‌లో OLED స్క్రీన్ డిస్‌ప్లేతో వచ్చింది.
iPhone 13 Pro Hack : ఆపిల్‌కు చెమటలు పట్టించిన చైనా హ్యాకర్లు.. సెకన్‌లో ఐఫోన్ 13ప్రో హ్యాక్!
ఈ బ్యాటరీతో పాటు కన్సోల్ ఛార్జింగ్ కోసం బజర్, గేమ్ ప్లే బటన్, పవర్ స్విచ్, స్క్రీన్, మైక్రో-USB పోర్ట్ అమర్చారు. అలాగే కీబోర్డుకు రింగులను కూడా యాడ్ చేయొచ్చు. స్నాక్ వంటి గేమ్స్ కన్సోల్, టెట్రిస్, స్పేస్ ఇన్వేడర్స్ ఇన్‌స్టాల్ చేశారు. వీటితోపాటు మైక్రోపైథాన్ భాషను ఉపయోగించి యూజర్లు సొంతంగా మల్టీప్లేయర్ గేమ్‌లను తయారుచేసుకోవచ్చు.
చిన్న సర్క్యూట్లు, ఎలక్ట్రానిక్ ప్రొడక్టుల చిన్న వెర్షన్లను రూపొందించడంలో ఒక కంపెనీ ఈ కన్సోల్‌ను డెవలప్ చేసింది. ఒక పెద్ద వెర్షన్ తీసుకొచ్చింది. ఇలా చేయడం తొలిసారి కాదు.. 2012లో కంపెనీ తన మొట్టమొదటి ప్రొడక్ట్ స్మాల్ డ్యూనోను ప్రవేశపెట్టింది. టీవీ, ఆర్కేడ్ కన్సోల్, వయోలిన్లను కూడా రూపొందించింది. ప్రపంచంలోనే అతిచిన్న గేమ్ కన్సోల్‌ను రూపొందించడమే లక్ష్యంగా పోస్టేజ్ స్టాంప్ ఇంజినీర్ బెన్ రోజ్ పేర్కొన్నారు.
Covid Booster Shot : కోవిడ్ బూస్టర్ డోస్ పై పూనావాలా కీలక వ్యాఖ్యలు