×
Ad

చలికాలం వచ్చేసింది.. గీజర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? గ్యాస్ vs ఎలక్ట్రిక్.. ఏది బెస్ట్? ఇలా చేస్తే..

గ్యాస్ గీజర్, ఎలక్ట్రిక్ గీజర్‌లో ఏది నీటిని వేగంగా వేడి చేస్తుంది? భద్రత విషయంలో ఏది బెస్ట్?

Geyser: చలికాలంలో వెచ్చటి నీళ్లు లేనిదే స్నానం చేయాలనిపించదు కదూ.. వేడి నీటి కోసం గీజర్ కొనాలనుకుంటున్నారా? గ్యాస్ గీజర్ మంచిదా లేక ఎలక్ట్రిక్ గీజర్ తీసుకోవాలా అనే డైలమాలో ఉన్నారా? అయితే మీ కోసమే ఈ సమాచారం.

వాటి లైఫ్‌టైమ్‌, భద్రత, ఖర్చు, నీరు వేడయ్యే సమయం గురించి విశ్లేషిద్దాం. ఏ గీజర్ నీటిని వేగంగా వేడి చేస్తుంది? ఏది తక్కువ ఖర్చుతో వస్తుంది? దేనితో ఎక్కువ భద్రత పొందొచ్చు? వంటి అంశాలన్నీ తెలుసుకున్న తర్వాత మీ అవసరాలకు సరైన గీజర్‌ను ఎంపిక చేసుకోండి. (Geyser)

చలికాలం రాగానే చాలా ఇళ్లలో వేడి నీటి కోసం గీజర్లు వాడటం మొదలవుతుంది. ఈ సారి మీరు మీ పాత గీజర్‌ను మార్చాలని అనుకుంటే మార్కెట్లో లభించే గ్యాస్ గీజర్లు, ఎలక్ట్రిక్ గీజర్లపై పూర్తి వివరాలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

Also Read: Chanchalguda: జైలుకి వచ్చిన రౌడీషీటర్‌.. అతడిని చూడగానే మరో రౌడీషీటర్‌ రెచ్చిపోయి.. విధ్వంసం.. ఎందుకంటే?

నీరు వేడయ్యే సమయం: ఏది ఫాస్ట్?

గ్యాస్ గీజర్, ఎలక్ట్రిక్ గీజర్‌లో ఏది నీటిని వేగంగా వేడి చేస్తుందో చూద్దాం. ఈ విషయంలో గ్యాస్ గీజర్లు ముందంజలో ఉంటాయి. ఎలక్ట్రిక్ గీజర్లతో పోలిస్తే గ్యాస్ గీజర్లు నీటిని చాలా వేగంగా వేడి చేస్తాయి. మీకు అత్యవసరంగా వేడి నీళ్లు కావాలంటే గ్యాస్ గీజర్ మంచి ఆప్షన్.

ధర వివరాలు: మీ బడ్జెట్‌కు ఏది సరిపోతుంది?

ధర విషయానికి వస్తే, ఎలక్ట్రిక్ గీజర్లు 3 లీటర్ లేదా 5 లీటర్ సామర్థ్యంతో ఉన్న ఇన్‌స్టంట్ మోడల్స్ రూ.2,500 నుంచి ప్రారంభమవుతాయి. ఇక 15 లీటర్ లేదా 25 లీటర్ సామర్థ్యంతో వచ్చే గీజర్ల సగటు ధర రూ.4,000 ఉంటుంది. అమెజాన్‌లో గ్యాస్ గీజర్ల ధరలు రూ.3,799 నుంచి రూ.6,499 మధ్య అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలు, బడ్జెట్‌ను బట్టి సరైన మోడల్‌ను ఎంచుకోవచ్చు.

భద్రత: మీ కుటుంబానికి ఏది సురక్షితం?

ఏదైనా ఎలక్ట్రిక్ పరికరం కొనేటప్పుడు భద్రత అనేది అత్యంత ముఖ్యమైన అంశం. క్రాంప్టన్ వెబ్‌సైట్లో ఉన్న వివరాల ప్రకారం.. గ్యాస్ గీజర్లను తక్కువ భద్రత ఉన్నవిగా పరిగణిస్తారు. ఎలక్ట్రిక్ గీజర్లు ఎక్కువ భద్రతను అందిస్తాయి. గ్యాస్ లీకేజీ, కార్బన్ మోనాక్సైడ్ వంటి ప్రమాదాలు గ్యాస్ గీజర్లతో ముడిపడి ఉంటాయి కాబట్టి, భద్రతకు ప్రాధాన్యం ఇచ్చేవారు ఎలక్ట్రిక్ గీజర్లను కొనడం మంచిది.

జీవితకాలం: ఎంత కాలం మన్నిక? 

గీజర్ల లైఫ్‌టైమ్‌ గురించి క్రాంప్టన్ అధికారిక వెబ్‌సైట్ అందించిన వివరాల ప్రకారం.. ఎలక్ట్రిక్ గీజర్లు సాధారణంగా 7 నుంచి 10 సంవత్సరాల వరకు సమర్థవంతంగా పనిచేస్తాయి. గ్యాస్ గీజర్లు వాటితో పోల్చితే కొంచెం వేగంగా దెబ్బతినే అవకాశం ఉంది. దీర్ఘకాలిక వాడకం, తక్కువ మెయింటెనెన్స్ కావాలనుకునే వారికి ఎలక్ట్రిక్ గీజర్లు అనుకూలంగా ఉంటాయి.