Chanchalguda: జైలుకి వచ్చిన రౌడీషీటర్.. అతడిని చూడగానే మరో రౌడీషీటర్ రెచ్చిపోయి.. విధ్వంసం.. ఎందుకంటే?
ఓ కేసులో జాబ్రీ రిమాండ్ ఖైదీగా జైలుకి వచ్చాడు.
Chanchalguda Jail
Chanchalguda: హైదరాబాద్ చంచల్‌గూడ జైల్లో ఉద్రిక్తత చెలరేగింది. ఖైదీల మధ్య ఘర్షణ జరిగి ములాఖత్ రూమ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఖైదీ జాబ్రీపై దస్తగిరి అనే మరో ఖైదీ దాడి చేశాడు. జాబ్రీకి తీవ్రగాయాలు అయ్యాయి.
జాబ్రీ, దస్తగిరి ఇద్దరూ రౌడీషీటర్లే. దస్తగిరి, జాబ్రీ మధ్య పాతకక్షలు ఉండడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ కేసులో జాబ్రీ రిమాండ్ ఖైదీగా జైలుకి వచ్చాడు. (Chanchalguda)
Also Read: విడదల రజినికి వరసగా చిక్కులు.. సవాళ్లు విసురుతున్న పరిస్థితులు ఇవే..
జాబ్రీని జైలు ఆసుపత్రిలో చూడగానే దస్తగిరి దాడికి దిగాడు. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలు అయ్యాయి. జాబ్రీని గాంధీ ఆసుపత్రికి, దస్తగిరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
చంచల్ గూడ జైలులో గతంలోనూ ఖైదీలు ఘర్షణ పడ్డ ఘటనలు చోటుచేసుకున్నాయి. నేరాలు చేసి జైలుకి వచ్చే ఖైదీలు ఇక్కడ కూడా ఘర్షణలను దిగుతూ మరిన్ని చిక్కులు కొనితెచ్చుకుంటున్నారు.
